Begin typing your search above and press return to search.

వైఎస్ జగన్ వద్దకు దిల్ రాజు.. ఏంటి మ్యాటర్?

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ రేట్ ఉన్న అగ్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు పవర్ ఏమిటో దాదాపు అందరికి తెలిసిందే

By:  Tupaki Desk   |   7 Aug 2023 8:24 AM GMT
వైఎస్ జగన్ వద్దకు దిల్ రాజు.. ఏంటి మ్యాటర్?
X

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ రేట్ ఉన్న అగ్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు పవర్ ఏమిటో దాదాపు అందరికి తెలిసిందే. ఎలాంటి సమస్య వచ్చినా కూడా కూర్చుని దాన్ని నిమిషాల్లో సాల్వ్ చేయగల సత్తా ఉన్న నిర్మాత అని చెప్పవచ్చు. గతంలో ఆయనకు బడా హీరోల నుంచి కూడా కొన్ని విభేదాలు వచ్చినప్పటికీ వెంటనే వాటిని పరిష్కరించుకొని ముందుకు సాగారు.

వీలైనంత వరకు ఎక్కువగా సినిమాలతో బిజీగా ఉండే రాజుగారు ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. ఇటీవల టాలీవుడ్ పవర్ బాడీకి అధ్యక్షుడిగా మారారు. ఇండస్ట్రీలో ఇప్పుడు వివిధ రకాల క్రాఫ్ట్స్ లోను ఆయన మార్పులు తీసుకొచ్చే అధికారమైతే దక్కించుకున్నారు అని అనిపిస్తోంది. ఇక రాబోయే రోజుల్లో కూడా దిల్ రాజు మరికొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

అయితే అన్నిటికంటే ముందు ఆయన మరొక కీలకమైన అడుగు ముందుకు వేయబోతున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి దిల్ రాజు ప్రత్యేకంగా చర్చలు జరిపే అవకాశం ఉంది. ఎలాగూ తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుంది. టిఆర్ఎస్ పార్టీలో కూడా దిల్ రాజుకి చాలా మంది స్నేహితులు ఉన్నారు. ఇక అటువైపు నుంచి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇండస్ట్రీకి కావాల్సిన సపోర్ట్ అయితే దక్కుతుంది.

వచ్చిన చిక్కల్లా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి. అక్కడి నుంచి తెలుగు చిత్ర పరిశ్రమకు ఇంకా అనుకున్నంత స్థాయిలో సపోర్ట్ అయితే దొరకడం లేదు. గతంలో చివరిసారిగా ఇండస్ట్రీ ప్రముఖుల అందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రినీ టిక్కెట్ల రేట్ల పెంపుదల కోసం కలిసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మళ్లీ చాలాకాలం తర్వాత నిర్మాత దిల్ రాజు ఏపీ సీఎంను కలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఇప్పటికే అపాయింట్ మెంట్ కోసం కూడా ఆయన సీఎం క్యాంప్ ఆఫీస్ ను సంప్రదించినట్లుగా తెలుస్తోంది. ఏ క్షణంలో అయినా పాజిటివ్ రెస్పాన్స్ రావచ్చు. తప్పనిసరిగా దిల్ రాజు సీఎం జగన్ అయితే కలుసుకునే అవకాశం ఉంది. అయితే ఆయన జగన్ తో ఎలాంటి విషయాలపై చర్చిస్తారు అనేది కూడా హాట్ టాపిక్ గా మారింది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో సగభాగాన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా అభివృద్ధి చేయాలి అని జగన్ ప్రభుత్వం కోరుకుంటుంది. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ పై కూడా స్పెషల్ గా ఫోకస్ చేయడం అందరికీ తెలిసిన విషయమే. ఇక ఇప్పుడు దిల్ రాజు ఏ విషయాలపై మాట్లాడుతారు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిల్ రాజు కు ఎలాంటి విషయాలపై కండిషన్స్ పెడుతుంది ఆమె సందేహాలు అందరిలోనూ కాస్త క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. ఇక దిల్ రాజు జగన్ మీటింగ్ ఏవైనా పొలిటికల్ హీట్ ను క్రియేట్ చేస్తుందా అనేది కూడా హాట్ టాపిక్ గా మారుతోంది.