Begin typing your search above and press return to search.

'సలార్' పాత పుకార్లపై నిర్మాత క్లారిటీ

దర్శకుడు ప్రశాంత్‌ నీల్ ఈ సినిమాను ప్రారంభించినప్పటి నుంచి కూడా కన్నడ మూవీ 'ఉగ్రం' కి ఇది రీమేక్ అని ప్రచారం జరుగుతోంది.

By:  Tupaki Desk   |   12 Dec 2023 5:39 AM GMT
సలార్ పాత పుకార్లపై నిర్మాత క్లారిటీ
X

ప్రభాస్ అభిమానులతో పాటు పాన్ ఇండియా రేంజ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం 'సలార్‌'. ఈ సినిమాకు కేజీఎఫ్‌ మేకర్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించడం వల్ల అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న ఈ సినిమా ను క్రిస్మస్ కానుకగా డిసెంబర్‌ 22న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెల్సిందే.

దర్శకుడు ప్రశాంత్‌ నీల్ ఈ సినిమాను ప్రారంభించినప్పటి నుంచి కూడా కన్నడ మూవీ 'ఉగ్రం' కి ఇది రీమేక్ అని ప్రచారం జరుగుతోంది. ఆ సమయంలో కొన్ని మీడియా సంస్థలు ప్రచురితం చేసిన కథనాల కారణంగా సలార్‌ నిజంగానే ఉగ్రం రీమేక్ అయ్యి ఉంటుందని చాలా మంది భావించారు. తాజాగా ఆ పాత పుకార్లపై నిర్మాత విజయ్ కిరగందూర్‌ క్లారిటీ ఇచ్చారు.

సలార్‌ ప్రమోషన్‌ లో భాగంగా నిర్మాత విజయ్ మాట్లాడుతూ.. రెండు ప్రాజెక్ట్‌ ల మధ్య ఎలాంటి సంబంధం లేదు. సలార్‌ చిత్రం చాలా స్పెషల్‌ మూవీ అన్నట్లుగా ఆయన పేర్కొన్నాడు. ఇప్పటికే మీడియాలో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవం అని కూడా నిర్మాత మరోసారి క్లారిటీ ఇచ్చాడు. దాంతో ఆ పుకార్లకు చెక్‌ పెట్టినట్లు అయింది.

ప్రభాస్ కి జోడీగా ఈ సినిమాలో శృతి హాసన్‌ నటించిన విషయం తెల్సిందే. కీలక పాత్రల్లో పృథ్వీరాజ్ సుకుమారన్‌, జగపతిబాబు, శ్రియా రెడ్డి, ఈశ్వరీ రావు ఇంకా పాన్ ఇండియా క్రేజీ స్టార్స్‌ ఈ సినిమాలో నటించారు. సౌత్‌ లో అన్ని భాషలతో పాటు హిందీలో ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు.