రాజాసాబ్ పై నెగెటివ్ క్యాంపెయిన్ చేసిన నిర్మాత ఎవరు?
ఇదిలా ఉంటే టీజర్ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న 'బేబీ' నిర్మాత ఎస్‌కెఎన్ 'ది రాజా సాబ్' మూవీపై సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
By: Tupaki Desk | 16 Jun 2025 9:48 AMపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తొలి కామెడీ, హీరర్ థ్రిల్లర్ 'ది రాజా సాబ్'. మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి. విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తుండగా, మాలవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. బోమన్ ఇరానీ, జరీనా వాహబ్, సముద్రఖని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నయనతార స్పెషల్ సాంగ్‌లో మెరవనుంది. ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా అభిమానుల్ని ఊరిస్తున్న 'ది రాజా సాబ్' టీజర్‌ని ఫైనల్‌గా సోమవారం విడుదల చేశారు.
అంచనాలకు మించి నవ్విస్తూ భయపెట్టిన టీజర్ సినిమాలపై అంచనాలని పెంచేసింది. ఇదిలా ఉంటే టీజర్ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న 'బేబీ' నిర్మాత ఎస్‌కెఎన్ 'ది రాజా సాబ్' మూవీపై సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ పేరు గుర్తు పెట్టుకోండి. బందర్‌లో కృష్ణ కిషోర్ ఇప్పుడు కృష్ణ కాంప్లెక్స్. అక్కడ మారుతి ఫాదర్ అరటిపళ్ల బిజినెస్ చేసేవారు. మారుతి విజన్ ఎంటంటే నేను ఎప్పటికైనా సినిమాల్లోకి వెళ్లాలని దాన్ని ఒక డ్రీమ్‌లా భావించి 23 ఏళ్లు కష్టపడి ఈ రోజు పాన్ ఇండియా స్టార్ పక్కన కటౌట్ పెట్టే స్థాయికి ఎదిగాడంటే అతని కృషి ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఒక మొగుడి మగతనం భార్యకే తెలుస్తుంది. అలాగే ఒక స్నేహితుడి పొటెన్షియాలిటీ క్లోజ్‌గా ఫీలయ్యే బెస్ట్ ఫ్రెండ్‌కే తెలుస్తుంది. ఇరవై ఏళ్లుగా నేను మారుతితో కలిసి ప్రయాణిస్తున్నాను. ఈ రోజుని మీరు రాసిపెట్టుకోండి. ఈ సినిమాని ఎవరైతే అండరెస్ట్‌మేట్ చేశారో..అండర్ రేట్ చేశారో.. అన్ని రికార్డుల్ని ఈ సినిమా తిరగరాస్తుంది. మీరు పదేళ్లుగా, పన్నెండేళ్లుగా మిస్సయిన రెబల్ గాడ్ ప్రభాస్‌గారిని ఈ సినిమాలో చూపిస్తున్నారు.
ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు ఇండస్ట్రీలో ఒక ప్రొడ్యూసర్ నెగెటీవ్‌గా క్యాంపెయిన్ చేశాడు. రేపు అదే నిర్మాత 'ది రాజా సాబ్'పై పాజిటివ్‌గా ప్రచారం చేస్తాడు. ఈ సినిమాపై నెగెటివ్ ప్రచారం జరిగినప్పుడు ఇలా జరుగుతోందని మారుతికి చెప్పాను. నన్నునమ్మిన ప్రభాస్ గారికి నా బెస్ట్ ఇస్తా అన్నారు మారుతి. అదే ఈ టీజర్. టీజర్ తరువాత సింగిల్స్, ట్రైలర్ ఇలా చాలానే ఉన్నాయి. డిసెంబర్ 5న పాన్ ఇండియా షేక్ అవుద్దీ` అంటూ ఫైర్ అయ్యాడు ఎస్‌కెఎన్. ఇంతకీ ఈ సినిమాపై నెగెటివ్‌గా ప్రచారం చేసిన ఆ నిర్మాత ఎవరు? ఎందుకు అలా నెగెటివ్ ప్రచారం చేశాడు? అతని ఉద్దేశ్యం ఏంటీ? అన్నది తెలియాల్సి ఉంది.