ఆ రెండు సినిమాలూ సర్‌ప్రైజులే!
కింగ్‌డమ్ ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకొస్తున్న వంశీ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో గుంటూరు కారం సినిమాపై ఎందుకు ట్రోల్స్ వచ్చాయో తనకు ఇప్పటికీ అర్థం కాదని చెప్పారు.
By: Tupaki Desk | 19 July 2025 8:00 PM ISTఇండస్ట్రీలో హీరోలకు ఉండే క్రేజ్, నిర్మాతలకు ఉండే క్రేజ్ వేరు. కానీ టాలీవుడ్ లోని ఓ నిర్మాతకు హీరోతో సమానమైన క్రేజ్ ఉంది. అతనే నాగవంశీ. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిర్మాతగా సినిమాలు చేసే నాగ వంశీ ఎప్పుడూ ఏదొక వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. మీడియాలో, సోషల్ మీడియాలో ఆయనకుండే క్రేజ్, ఫాలోయింగే డిఫరెంట్.
ఏ విషయాన్నైనా మొహమాటం లేకుండా చెప్పే నాగవంశీ నుంచి సినిమా వస్తుందంటే మీడియా కూడా ఆయన ఈసారి ఏం మాట్లాడతారా అని ఎదురుచూస్తూ ఉంటుంది. ఇప్పుడు వంశీ నుంచి కింగ్‌డమ్ అనే సినిమా రాబోతుంది. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా జులై 31న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
కింగ్‌డమ్ ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకొస్తున్న వంశీ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో గుంటూరు కారం సినిమాపై ఎందుకు ట్రోల్స్ వచ్చాయో తనకు ఇప్పటికీ అర్థం కాదని చెప్పారు. ఇండస్ట్రీలో ప్రతీ శుక్రవారం ఓ సర్‌ప్రైజ్ ఉంటుందని, రీసెంట్ గా లక్కీ భాస్కర్ సినిమా రెవిన్యూ తాను అనుకున్నంత చేయలేకపోయిందని, అది తనకు ఓ రకంగా సర్‌ప్రైజేనని వంశీ అన్నారు.
గుంటూరు కారం రిలీజైనప్పుడు మొదటి రెండ్రోజులు ఆ సినిమాను బాగా ట్రోల్ చేశారని, అసలు అంత ట్రోలింగ్ ఎందుకు చేశారో అర్థం కాలేదని, థియేట్రికల్ రన్ అయ్యాక ఓటీటీలోకి వచ్చాక కూడా సినిమా బాలేదని ఎక్కడా టాక్ రాలేదని, అయినా సినిమాను స్టార్టింగ్ లో ఎందుకు ట్రోల్ చేశారో అర్థం కాలేదని, గత రెండేళ్లలో గుంటూరు కారం, లక్కీ భాస్కర్ సినిమాలే తనకు సర్‌ప్రైజుల్ని ఇచ్చిన సినిమాలని వంశీ చెప్పారు. కింగ్‌డమ్ విషయానికొస్తే నాగవంశీ ఈ సినిమా విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
