Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ప్రియా ప్రియా చంపొద్దే

ప్రియా ప్ర‌కాష్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఒక్క క‌న్నుగీటుతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా కుర్ర‌కారు గుండెలు కొల్ల‌గొట్టింది ఈ బ్యూటీ. ఒరు ఆధార్ ల‌వ్ - వింక్ గర్ల్ గా భారీ పాపులరైంది.

By:  Tupaki Desk   |   14 Nov 2023 5:10 AM GMT
ఫోటో స్టోరి: ప్రియా ప్రియా చంపొద్దే
X

ప్రియా ప్ర‌కాష్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఒక్క క‌న్నుగీటుతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా కుర్ర‌కారు గుండెలు కొల్ల‌గొట్టింది ఈ బ్యూటీ. ఒరు ఆధార్ ల‌వ్ - వింక్ గర్ల్ గా భారీ పాపులరైంది. అయితే ప్రియా కెరీర్ జ‌ర్నీ అనుకున్నంత సులువుగా సాగ‌లేదు. న‌టిగా త‌న‌ని తాను నిరూపించుకునేందుకు ఇప్ప‌టికే చాలా అవ‌కాశాలొచ్చాయి. అందుకు త‌గ్గ‌ట్టే త‌న‌ను తాను మెరుగుప‌రుచుకుంటూ ప‌రిణ‌తి చెందిన న‌టిగా మారుతోంది. ఈ బ్యూటీ నిరంత‌రం సోష‌ల్ మీడియాల ద్వారా తన అభిమానులతో కనెక్ట్ అవుతోంది. ప్రియా లేటెస్ట్ ఫోటోషూట్ తో వెబ్ లో హాట్ టాపిక్.


తాజా ఫోటోషూట్ లో ప్రియా ప్రకాష్ వారియర్ పూర్తిగా ఎత్నిక్ ఔట్ ఫిట్ లో క‌నిపించింది. ఈ దీపావళికి ప్రియా ప్రకాష్ క్రాస్ ఓవర్ ఎథ్నిక్ టాప్‌లో క‌నిపించింది. ఈ స్పెష‌ల్ లుక్ క్ష‌ణాల్లో వైర‌ల్ గా మారింది. ప్రియా మునుప‌టితో పోలిస్తే ఎంతో హాట్ గా క‌నిపిస్తోందని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ఫోటోషూట్ కి ఎంపిక చేసుకున్న కాన్సెప్ట్, బ్యాక్ గ్రౌండ్ థీమ్ ఇంట్రెస్టింగ్. ఆల్ బ్లాక్ అండ్ గోల్డ్ కాస్ట్యూమ్ ఆయిలీ లుక్ తో ప్రియా స్పెష‌ల్ గా మెరిసిపోతోంది.


ప్రియా కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. మలయాళ చిత్రం ఒరు అదార్ లవ్‌తో పరిచయమైన ఈ భామ బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సంగ‌తి తెలిసిందే. అయితే శ్రీ‌దేవి బంగ్లా అనే చిత్రం వివాదాల్లో నిలిచిపోయింది. ఆ త‌ర్వాత ప్రియా ప్రకాష్ వారియర్ త‌దుప‌రి వ‌రుస‌గా మలయాళ చిత్రాల్లో న‌టించింది. ఇటీవలే `కొల్లా` అనే చిత్రానికి సంతకం చేసింది. ఇందులో రజిషా విజయన్ - వినయ్ ఫోర్ట్ లతో కలిసి కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రంలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉత్సాహంగా ఉంది! హే మలయాళం.. ఒక నిమిషం అయింది.. మీ అందరి ప్రార్ధనలు ఆశీస్సులు కావాలి అని ప్రాజెక్ట్ గురించి ప్ర‌క‌టించింది. అనూప్ మీనన్ ప్రధాన పాత్రలో వికె ప్రకాష్ దర్శకత్వం వహించిన `ఒరు నల్పతుకారంటే ఇరుపతోన్నుకారి`లో కూడా ప్రియా ప్ర‌కాష్ న‌టించింది.


తెలుగులో నితిన్ స‌ర‌స‌న చెక్, తేజ స‌జ్జా స‌ర‌స‌న ఇష్క్ .. సాయిధ‌ర‌మ్ తేజ్ స‌ర‌స‌న బ్రో చిత్రాల్లో న‌టించింది. ఇటీవ‌ల‌ హిందీలో కొన్ని సినిమాల‌తో బిజీగా ఉంది. బ్యాక్ టు బ్యాక్ షూటింగ్‌ల కారణంగా, టాలీవుడ్‌లో తన తదుపరి చిత్రానికి సైన్ చేయలేదు