Begin typing your search above and press return to search.

ఆడ‌పులితో స్టార్ హీరోయిన్ క‌నెక్ష‌న్

గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనాస్ ఇటీవ‌ల స్వ‌స్థ‌లం ముంబైలో ఎక్కువ‌గా క‌నిపిస్తున్నారు.

By:  Tupaki Desk   |   3 April 2024 5:53 AM GMT
ఆడ‌పులితో స్టార్ హీరోయిన్ క‌నెక్ష‌న్
X

గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనాస్ ఇటీవ‌ల స్వ‌స్థ‌లం ముంబైలో ఎక్కువ‌గా క‌నిపిస్తున్నారు. తిరిగి హిందీ చిత్ర‌సీమ‌లో అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నిస్తోంద‌ని క‌థ‌నాలొచ్చాయి. ఇంత‌లోనే ఇప్పుడు తన కొత్త ప్రాజెక్ట్ `టైగర్` విడుదల తేదీని ప్రకటించింది. అయితే ఈ సినిమాలో పీసీ న‌టించ‌లేదు. ఈ అద్భుతమైన సినిమాలో ఒక పాత్ర‌కు తన వాయిస్‌ని అందించాన‌ని తెలిపింది. ఈ చిత్రం ద్వారా అడవిని అన్వేషించడం ఎలా సరదాగా ఉందో కూడా వెల్ల‌డించింది.

నిజానికి టైగ‌ర్ చిత్రం ఎనిమిదేళ్లుగా రూపొందుతోంది. ప్ర‌ఖ్యాత డిస్నీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అడ‌విలో స్వేచ్ఛ‌గా తిరిగే పులి క‌థ‌తో రూపొందించిన చిత్ర‌మిది. అడ‌వి అందాల‌ను తెర‌పై ఆవిష్క‌రిస్తుంది. ప్రేమ, సంఘర్షణ, ఆకలి, మనుగడకు సంబందించిన మరెన్నో కథల‌ను టైగ‌ర్‌లో చూడొచ్చు.

ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలను పీసీ తాజాగా వెల్ల‌డించింది. పెద్ద- చిన్న, పిరికి - గంభీరమైన జీవులు సంచరించే భారతదేశంలోని సందడిగా ఉండే అరణ్యాలలో అంబా అనే కాలాతీత వారసత్వం కలిగిన పులి క‌థ‌ను తెర‌పై చూడొచ్చు. ఈ ఆడ‌పులి తన పిల్లలను చాలా ప్రేమతో చూసుకుంటుంది. తల్లి - బిడ్డల మధ్య ఉన్న అందమైన బంధం చాలా అద్భుతంగా తెర‌పై ఆవిష్క‌రించారు. ఈ అందమైన కుటుంబాన్ని తెర‌పై నేచుర‌ల్ గా చూపించాలంటే అంత సులువు కాదు. అందుకోస‌మే ఏకంగా 8 సంవత్సరాల పాటు ఈ చిత్రాన్ని చిత్రీకరించారు.

వరల్డ్ ఎర్త్ డేగా జరుపుకునే ఏప్రిల్ 22న `టైగర్` ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా రిలీజ్ తేదీని వెల్ల‌డిస్తూ పీసీ సంతోషాన్ని వ్య‌క్తం చేసింది. ఈ అద్భుతమైన కథకు నా గాత్రాన్ని అందించడం ..ఈ చిత్రం ద్వారా అరణ్యాలను అన్వేషించడాన్ని నేను చాలా ఆనందించాను. మీరు మాతో కలిసి అడవిని ఆస్వాధించడానికి వేచి ఉండలేను! టైగ‌ర్ ఈ ఎర్త్ డే రోజు అంటే.. ఏప్రిల్ 22న థియేటర్ల‌లో ప్రదర్శితం కానుంది.. అని అన్నారు.

ప్రియాంక చోప్రా ఇటీవల భ‌ర్త నిక్ జోనాస్ - కుమార్తె మాల్తీ మేరీ జోనాస్‌తో కలిసి భారతదేశంలో ఉన్నారు.

ఇటీవల ముంబైలోని జియో వరల్డ్ ప్లాజాలో బల్గారీ గ్రాండ్ స్టోర్‌ను కూడా ప్రారంభించింది. ఈ బ్రాండ్‌కు ప్రపంచ బ్రాండ్ అంబాసిడర్‌లలో పీసీ ఒకరు. అనంత‌రం మార్చి 18న నిక్ ముంబై చేరుకున్నారు. ఈ ఏడాది నిక్ భారత్‌కు రావడం ఇది రెండోసారి. నిక్, అతడి సోదరులు కెవిన్ - జో జోనాస్ జనవరిలో లోల్లపలూజా ఇండియా మ్యూజిక్ ఈవెంట్‌లో ప్రదర్శన ఇచ్చారు.

తిరిగి అమెరికాకు వెళ్లే ముందు, ప్రియాంక -నిక్ జోనాస్ ముంబైలో త‌న‌ బంధువు కం న‌టి మన్నారా చోప్రా పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుక‌లో ఈ అంద‌మైన జంట ఎంతో ముచ్చ‌ట‌గా క‌నిపించారు. దీనికి ముందు ప్రియాంక- నిక్ జోడీ నోయిడాలో మన్నారా ఆమె కుటుంబ సభ్యులు - స్నేహితులతో క‌లిసి హోలీ జరుపుకున్నారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. ప్రియాంక `హెడ్స్ ఆఫ్ స్టేట్`లో జాన్ సెనా- ఇద్రిస్ ఎల్బాలతో కలిసి కనిపించనుంది. కత్రినా కైఫ్ - అలియా భట్‌లతో కలిసి ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహించనున్న‌ 'జీ లే జరా'లో కనిపించనుంది. అయితే రెండేళ్ల క్రితం ఈ సినిమా ప్రకటన వెలువడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్‌ రాలేదు.