Begin typing your search above and press return to search.

OG బ్యూటీకి ఆరోజులు ఇంకా గుర్తున్నాయట..!

అయితే మోడలింగ్ చేసే టైం లో కనీస అవసరాలకు కూడా సరైన డబ్బులు లేక వచ్చినవి సరిపోక చాలా ఇబ్బందులు పడిందట అమ్మడు. మోడలింగ్ చేస్తూనే సినిమా చేయాలని ప్రయత్నించింది.

By:  Tupaki Desk   |   27 Dec 2023 1:30 PM GMT
OG బ్యూటీకి ఆరోజులు ఇంకా గుర్తున్నాయట..!
X

కోలీవుడ్ అందాల భామ ప్రియాంక అరుల్ మోహన్ ఇప్పుడు తెలుగులో సూపర్ ఫాం లో ఉంది. ఆల్రెడీ అంతకుముందు నానితో గ్యాంగ్ లీడర్, శర్వానంద్ తో శ్రీకారం సినిమాలు చేసిన అమ్మడు లేటెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓజీ, నాని తో మరో సినిమా చేస్తుంది. ఈ రెండు సినిమాలు డీవీవీ దానయ్య నిర్మాణంలో వస్తుండటం విశేషం. కోలీవుడ్ లో వరుస సినిమాలతో సత్తా చాటిన ప్రియాంక తెలుగులో ఇప్పుడు వరుస క్రేజీ ప్రాజెక్ట్ లు అందుకుంది. అయితే ఇప్పుడు కెరీర్ ఇలా ఉంది కానీ సినిమాలు చేయాలనుకున్న మొదట్లో తనకు కూడా కష్టాలు పలుకరించాయని తెలుస్తుంది.

మోడల్ గా గ్లామర్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ప్రియాంక మోహన్ యాడ్స్ లో నటిస్తూ దర్శక నిర్మాతల దృష్టిలో పడ్డది. అయితే మోడలింగ్ చేసే టైం లో కనీస అవసరాలకు కూడా సరైన డబ్బులు లేక వచ్చినవి సరిపోక చాలా ఇబ్బందులు పడిందట అమ్మడు. మోడలింగ్ చేస్తూనే సినిమా చేయాలని ప్రయత్నించింది. ఆ టైం లో యాక్టింగ్ కోర్స్ కూడా చేసింది. మొదట కన్నడ సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఆ తర్వాత నానితో గ్యాంగ్ లీడర్ సినిమా చేసింది.

ఆ సినిమా పర్వాలేదు అనిపించుకుంది ఆ తర్వాత శర్వానంద్ తో శ్రీకారం సినిమా డిజప్పాయింట్ చేసింది. ఆ తర్వాత తమిళంలో శివ కార్తికేయన్ తో రెండు సినిమాలు, సూర్యతో ఒక సినిమా చేసింది. ప్రస్తుతం ధనుష్ తో కెప్టెన్ మిల్లర్ సినిమాలో నటించిన ప్రియాంకా తను ఏ పొజిషన్ లో ఉన్నా సరే కెరీర్ మొదట్లో పడిన ఇబ్బందులను మర్చిపోనని అంటుంది.

ఫ్యామిలీ సపోర్ట్ ఎంత ఉన్నా తను ఎంచుకున్న కెరీర్ లో తను సొంతంగా సంపాదించాలని ప్రియాంక కష్టపడింది. ఆ టైం లో చిన్న చిన్న అవసరాలకు కూడా ఎంతో సమస్యలను ఎదుర్కొన్నానని అంటుంది ప్రియాంక. ఇప్పుడు వరుస ఛాన్స్ లతో అదరగొడుతున్న అమ్మడు కెరీర్ ఏ స్టేజ్ లో ఉన్నా కూడా తను ఒకప్పటి పరిస్థితులను మర్చిపోనని చెబుతుంది. ఓజీ, నాని సినిమాలతో ప్రియాంక తెలుగులో కూడా బిజీ హీరోయిన్ అవ్వాలని చూస్తుంది. ఓజీ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటిస్తుంది కాబట్టి ఆ సినిమా తర్వాత ప్రియాంక తెలుగులో టాప్ హీరోయిన్ రేంజ్ కి వెళ్లడం కన్ఫర్మ్ అని చెప్పొచ్చు.