Begin typing your search above and press return to search.

పవన్ హీరోయిన్ కి లక్కీ ఛాన్స్..!

తెలుగులో పవర్ స్టార్ ఛాన్స్.. తమిళంలో దళపతి సినిమా ప్రియాంకా కెరీర్ కు ఇంతకన్నా బూస్టింగ్ మరొకటి ఉండదు.

By:  Tupaki Desk   |   24 Aug 2023 3:30 PM GMT
పవన్ హీరోయిన్ కి లక్కీ ఛాన్స్..!
X

పవర్ స్టార్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ అంటే స్టార్ స్టేటస్ కి ఎంట్రీ దొరికినట్టే లెక్క. ఆయన పక్కన నటించిన తర్వాత వరుస స్టార్ సినిమా ఆఫర్లు రావడం పక్కా. ప్రస్తుతం ఇలాంటి లక్కీ ఆఫర్ ను అందుకుంది చెన్నై భామ ప్రియాంక అరుల్ మోహన్. కోలీవుడ్ లో సినిమాలు చేస్తున్న అమ్మడిని నాని గ్యాంగ్ లీడర్ తో తెలుగు ఎంట్రీ ఇప్పించాడు. ఆ సినిమా తర్వాత శర్వానంద్ శ్రీకారం లో కూడా నటించింది. అయితే ఆ రెండు సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో అమ్మడిని మన మేకర్స్ లైట్ తీసుకున్నారు. తమిళంలో మాత్రం ప్రియాంక వరుస సినిమాలు చేస్తూనే ఉంది.

అలా సుజిత్ దృష్టిలో పడిన ప్రియాంక పవర్ స్టార్ తో చేస్తున్న ఓజీ సినిమాలో లక్కీ ఛాన్స్ అందుకుంది. పవన్ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంకకు టాలీవుడ్ లో నెక్స్ట్ లెవెల్ క్రేజ్ వచ్చేసింది. ఇప్పటికే ఓజీ తర్వాత ఆమెతో సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో ఇక్కడ పవన్ ఛాన్స్ ఇచ్చాడని తెలిసి తమిళంలో దళపతి విజయ్ సినిమాలో ఆమెను ఫిక్స్ చేశారు. విజయ్ 68వ సినిమా వెంకట్ ప్రభు డైరెక్షన్ లో తెరకెక్కనుంది. ఈ సినిమాలో విజయ్ డ్యుయల్ రోల్ చేస్తుండగా అందులో హీరోయిన్ గా ప్రియాంక ని ఓకే చేశారట.

తెలుగులో పవర్ స్టార్ ఛాన్స్.. తమిళంలో దళపతి సినిమా ప్రియాంకా కెరీర్ కు ఇంతకన్నా బూస్టింగ్ మరొకటి ఉండదు. అక్కడ శివ కార్తికేయన్ తో రెండు సినిమాలు సూర్యతో ఒక సినిమా చేసిన ప్రియాంక రాబోతున్న పవర్ ప్యాక్డ్ సినిమాలతో మాత్రం కెరీర్ జోష్ అందుకుంటుందని చెప్పొచ్చు. ఈ సినిమాల తర్వాత తెలుగు తమిళ భాషల్లో అమ్మడు స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్లడం పెద్ద కష్టమేమీ కాదు. పవన్ ఓజీ హిట్ పడింది అంటే ప్రియాంక ఫేట్ మారినట్టే లెక్క.

వెంకట్ ప్రభు విజయ్ కాంబోలో వస్తున్న సినిమాలో ప్రియాంకతో పాటుగా మరో స్టార్ హీరోయిన్ కూడా ఉంటుందని టాక్. అయినా కూడా సినిమాలో ప్రియాంక రోల్ కి ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తుంది. ఓజీ ఆఫర్ అమ్మడికి మరిన్ని అవకాశాలు తెచ్చేలా చేస్తుంది. విజయ్ సినిమా తర్వాత తమిళంలో కూడా ప్రియాంకకు వరుస ఛాన్స్ లు వచ్చేస్తాయని చెప్పొచ్చు. సో గ్యాంగ్ లీడర్ భామకి రాబోతున్న రోజులన్నీ లక్కీ అని చెప్పడంలో సందేహం లేదు.