Begin typing your search above and press return to search.

పవన్ హీరోయిన్‌ అప్పుడే అంత సంపాదించిందా?

టాలీవుడ్‌ తో పాటు కోలీవుడ్‌ లో ప్రస్తుతం ప్రియాంక అరుల్‌ మోహన్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. స్టార్‌ హీరోలతో పాటు చిన్న హీరోలు, క్రేజీ దర్శకులు ఈమె తో వర్క్ చేసేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు.

By:  Tupaki Desk   |   21 Nov 2023 5:54 AM GMT
పవన్ హీరోయిన్‌ అప్పుడే అంత సంపాదించిందా?
X

టాలీవుడ్‌ తో పాటు కోలీవుడ్‌ లో ప్రస్తుతం ప్రియాంక అరుల్‌ మోహన్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. స్టార్‌ హీరోలతో పాటు చిన్న హీరోలు, క్రేజీ దర్శకులు ఈమె తో వర్క్ చేసేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. పక్కింటి అమ్మాయిగా కనిపిస్తూనే ప్రత్యేకమైన ఆకర్షణ ఈ అమ్మడి సొంతం అంటూ ఇప్పటికే ఆమె నుంచి వచ్చిన సినిమాలను చూస్తే అర్థం అవుతోంది.


హీరోయిన్‌ గా ప్రియాంక మోహన్‌ వచ్చిన ప్రతి ఆఫర్‌ కి ఓకే చెప్పడం లేదు. మంచి కథ మరియు కథనాలను ఎంపిక చేసుకుని మరీ సినిమాలను చేస్తుంది. ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌ తో సాహో సుజీత్ తెరకెక్కిస్తున్న ఓజీ సినిమాలో ప్రియాంక మోహన్‌ నటిస్తున్న విషయం తెల్సిందే. అంతే కాకుండా పలు సినిమాల్లో నటిస్తోంది.

ఇక ఈ అమ్మడు మొదటి నుంచి భారీగానే పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. కెరీర్‌ ఆరంభించి కొన్నాళ్లే అయినా కూడా ప్రియాంక అరుల్‌ మోహన్‌ దాదాపుగా పాతిక కోట్ల వరకు సంపాదించిందని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇటీవలే చెన్నై లో ఖరీదైన అపార్ట్‌మెంట్‌ లో ప్లాట్ కొనుగోలు చేసిందని కూడా వార్తలు వస్తున్నాయి.

సినిమాలతో మాత్రమే కాకుండా సోషల్‌ మీడియా ద్వారా కూడా ప్రియాంక అరుల్‌ మోహన్‌ ఆదాయం దండిగా ఉందట. అందుకే తక్కువ సమయంలో ఇంత ఆదాయం దక్కింది అంటున్నారు ఇండస్ట్రీలో అడుగు పెట్టి కొన్నాళ్లు కూడా కాకుండానే ప్రియాంక చాలా తెలివిగా బాగానే వెనకేసుకుందని తమిళ్ మీడియా వర్గాల వారు కూడా మాట్లాడుకుంటున్నారు.

ఈనెల 20న పుట్టిన రోజు జరుపుకున్న ప్రియాంక అరుల్‌ మోహన్‌ సన్నిహితులకు పార్టీ ఇచ్చిందని తెలుస్తోంది. శివ కార్తికేయన్‌ హీరోగా వచ్చిన డాక్టర్ సినిమా తో మంచి గుర్తింపును దక్కించుకుని, నాని గ్యాంగ్‌ లీడర్‌ తో నటిగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న ఈ అమ్మడు ముందు ముందు మరింత మంది స్టార్‌ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌ గా మారవచ్చు అంటున్నారు.