Begin typing your search above and press return to search.

ఆస్తులు అమ్మేస్తోన్న హీరోయిన్..కార‌ణం ఏంట‌బ్బా?

ఇప్ప‌టికే అమెరిక‌న్ పౌర‌స‌త్వం తీసుకుంది. లాస్ ఎంజెల్స్ లో భ‌ర్త నిక్ జోనాస్ తో క‌లిసి చాలా కాలంగా ఉంటుంది

By:  Tupaki Desk   |   18 Nov 2023 11:48 AM GMT
ఆస్తులు అమ్మేస్తోన్న హీరోయిన్..కార‌ణం ఏంట‌బ్బా?
X

సెల‌బ్రిటీలు అంత‌రిక్షంలో సైతం ఆస్తులు కొనేస్తున్న స‌మ‌యం ఇది. ఇప్ప‌టికే భూమ్మీద ఆవాసం బోర్ కొట్టిన సెల‌బ్రిటీలు అంత‌రిక్షంలో కూడా ఇళ్లు నిర్మించుకుని అక్క‌డ జీవించాల‌ని ఆశ‌ప‌డుతున్నారు. కొంత మంది సెల‌బ్రిటీలు స్పేస్ లో ప్లాట్ లు కొనుగోలు చేసారు. ప్ర‌తీ ఏడాది ప‌న్నులు కూడా చెల్లిస్తు న్నారు. చంద్ర‌యాన్ స‌క్సెస్ అయిన నేప‌థ్యంలో ఇళ్లు క‌ట్టుకోవ‌డానికి ఇంకెంతో స‌మ‌యం ప‌ట్ట‌ద‌ని చాలా మంది భావిస్తున్నారు.

ఇలాంటి స‌మ‌యంలో గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రా ఉన్న ఆస్తులే అమ్మేస్తుంది అన్న వార్త మ‌రోసారి సంచ‌ల‌నం అవుతుంది. భార‌త్ లో ఉన్న ఒక్క ప్రోప‌ర్టీని సేల్ పెట్టి డ‌బ్బుని ఖాతాలో జ‌మ చేసుకుంటు న్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే లోఖండ్ వాలో ఒక క‌మ‌ర్శియ‌ల్ ప్రాప‌ర్టీని 7 కోట్ల‌కు అమ్మేసింది. తాజాగా అంధేరిలో ఉన్న అపార్ట్ మెంట్ ని కూడా అమ్మ‌కానికి పెట్టిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి. ఈ అపార్ట్ మెంట్ ని ద‌ర్శ‌క-నిర్మాత అభిషేక్ చౌబే భారీ ధ‌ర‌కు కొనుగోలు చేసారుట‌.

దాదాపు 6 కోట్ల‌కు కొన్న‌ట్లు తెలుస్తుంది. అక్టోబ‌ర్ 23..25 తేదీల్లో లావాదేవీలు జ‌రిగిన‌ట్లు స‌మాచారం. ఈ మొత్తం వ్య‌వ‌హారాన్ని భార‌త్ లో ఉన్న పీసీ త‌ల్లి చూసారుట‌. స్టాంప్ డ్యూటీ ఛార్జీలుగా 36 ల‌క్ష‌లు చెల్లించిన‌ట్లు స‌మాచారం. అయితే పీసీ ఇలా వ‌రుస పెట్టి ఒక‌దాని వెంట ఒక‌టి అమ్మ‌డంతో అమ్మ‌డు ఇండియా వ‌దిలి పూర్తిగా అమెరికాలో స్థిర ప‌డే ప్లాన్ లో ఉందా? అన్న సందేహాలు తెర‌పైకి వ‌స్తున్నాయి.

ఇప్ప‌టికే అమెరిక‌న్ పౌర‌స‌త్వం తీసుకుంది. లాస్ ఎంజెల్స్ లో భ‌ర్త నిక్ జోనాస్ తో క‌లిసి చాలా కాలంగా ఉంటుంది. అక్క‌డ ఉంటోన్న ప్లాట్ అద్దెకా? సొంత‌దా ? అన్న‌ది తెలియ‌దుగానీ పెళ్లైన తర్వాత ఎక్కువ స‌మ‌యం తీసుకోకుండానే కాపురం పెట్టేసింది. కెరీర్ పరంగా హాలీవుడ్ సినిమాల‌తో బిజీగా ఉండ‌టంతో ఇంత‌కాలం అక్క‌డ‌లా ఉంది అనుకున్నారు. కానీ ఇండియాలో ఆస్తులు అమ్మేస్తోన్న వైనం చూస్తుంటే శాశ్వ‌తంగా స్వ‌దేశానికి దూర‌మ‌య్యే ప్లాన్ లో ఉందా? అన్న సందేహాలు తెర‌పైకి వ‌స్తున్నాయి.