Begin typing your search above and press return to search.

అత్త‌గారింట పీసీ క్రిస్మ‌స్ సెల‌బ్రేష‌న్స్?

ఈ వీక్ ని కుటుంబ స‌భ్యు లు..స్నేహితులు..స‌న్నిహితుల‌తో ఎంతో సంతోషంగా గ‌డిపారు.

By:  Tupaki Desk   |   23 Dec 2023 11:56 AM GMT
అత్త‌గారింట  పీసీ  క్రిస్మ‌స్ సెల‌బ్రేష‌న్స్?
X

అంతా క్రిస్మ‌స్ సెల‌బ్రేష‌న్స్ లో మునిగిపోయారు. వేడుక‌కు ఇంకా రెండు రోజులే స‌మ‌యం ఉండ‌టంతో! ఏ లోగిళ్లు చూసినా అలంక‌ర‌ణ‌ల‌తో అందంగా ముస్తాబ‌య్యాయి. మ‌రి అమెరికా కోడ‌లైనా ప్రియాంక చోప్రా ఏం చేస్తున్న‌ట్లు? అమ్మ‌డు అత్త‌గారింట క్రిస్మ‌స్ వేడుక‌ల‌కు సెల‌బ్రేట్ చేసుకోలేద‌నుకుంటున్నారా? అంటే అమ్మ‌డు కూడా క్రిస్మ‌స్ సంబ‌రంలోనే మునిగి తేలుతుంద‌ని తెలుస్తోంది.


తాజాగా ఆ వేడుక‌కు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ప్రియాంక చోప్రా - నిక్ జోనాస్ తమ సన్నిహిత మిత్రులతో కలిసి క్రిస్మస్ హాలిడే డిన్నర్‌ని ఆస్వాదించారు. ఈ వీక్ ని కుటుంబ స‌భ్యు లు..స్నేహితులు..స‌న్నిహితుల‌తో ఎంతో సంతోషంగా గ‌డిపారు. ఒక ఆకర్షణీయమైన స్నాప్‌షాట్‌లో, ప్రియాంక చోప్రా - భర్త నిక్ జోనాస్ ఒడిలో కూర్చున్న ఫోటో అభిమానుల్ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.


ఇద్ద‌రి మ‌ధ్య అన్యోన్య‌త‌ని ఆ ఫోటో చాటి చెబుతుంది. పీసీ తెలుపు వ‌ర్ణం దుస్తుల్లో ఎంతో అందంగా ముస్తాబవ్వ‌గా..నిక్ బ్లాక్ కోట్ ధ‌రించి సోఫాలో కూర్చున్నాడు. నిక్ ఒడిలోనే పీసీ ఎంతో సంతోషంగా సేద తీరుతుంది. ఇక పిసీ డ్రెస్ క్రిస్మ‌స్ వేడుక‌ని ఇండికేట్ చేస్తుంది. ఇద్ద‌రి మ‌ద్య కెమిస్ట్రీ వావ్ అనిపిస్తుంది. ఇక సాయంత్రం ఈ జోడీ స్నేహితుల‌తో పార్టీని ఎంజాయ్ చేసిన‌ట్ల తెలుస్తోంది.


అమెరిక‌న్ గాళ్ ప‌క్క‌నే పీసీ కూర్చుని క‌బుర్లు చెబుతూ పార్టీని ఆస్వాదిస్తున్నారు. ఇక మ‌రో ఫోటోలో పీసీ కుమార్తె మాల్టీ తో గ్రౌండ్ లో ఆట‌లాడుకుంటూ క‌నిపిస్తుంది. మాల్లీ గ్రీన్ క‌ల‌ర్- క్రీమ్-రంగు వస్త్రధారణలో కొత్త బీఎమ్ బ్ల్యూ బొమ్మ కారుతో ఆడుకుంటుంది. బేబి క‌ళ్ల‌లో అమాయకత్వం ఆనందం ఎంతో ముచ్చ‌గొలుపుతున్నాయి. ప్రతి ఛాయాచిత్రం అందమైన మనోహరమైన భావోద్వేగాన్ని కలిగిస్తుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైర‌ల్ గా మారాయి.