Begin typing your search above and press return to search.

హాలీవుడ్ వెళ్లగానే బాలీవుడ్ చేదైందా..?

మనం చేసే పని ఏదైనా సరే ప్రమోషన్ కోసం ప్రాకులాడుతుంటాం. అది సినీ పరిశ్రమలో కూడా ఉంటుంది

By:  Tupaki Desk   |   12 April 2024 8:42 AM GMT
హాలీవుడ్ వెళ్లగానే బాలీవుడ్ చేదైందా..?
X

మనం చేసే పని ఏదైనా సరే ప్రమోషన్ కోసం ప్రాకులాడుతుంటాం. అది సినీ పరిశ్రమలో కూడా ఉంటుంది. మొదట కొందరు అవకాశం వస్తే చాలనుకుంటారు.. ఆ తర్వాత స్టార్ రేంజ్ కావాలని చూస్తారు. అది వచ్చాక వారి క్రేజ్ కు తగినట్టుగా డిమాండ్ చేయాలని భావిస్తారు. అది కూడా వస్తున్న టైం లో ఇక్కడ కాదు నెక్స్ట్ లెవెల్ ఇమేజ్ కోసం వేరే భాషకు వెళ్లాలని చూస్తారు. సౌత్ భామలందరు ఇక్కడ ఎంత స్టార్ డం వచ్చినా సరే బాలీవుడ్ ఛాన్స్ రావాలని అక్కడ రాణించాలని చూస్తుంటారు. అందుకే సౌత్ లో స్టార్ క్రేజ్ రాగానే చిన్నగా బాలీవుడ్ కి జంప్ అవుతుంటారు.

అయితే బాలీవుడ్ భామలు మాత్రం అక్కడ స్టార్ క్రేజ్ తెచ్చుకుని హాలీవుడ్ కి ప్రమోట్ అవ్వాలని చూస్తారు. అయితే హాలీవుడ్ ఛాన్స్ అంటే అది అందరి వల్లా కాదు. కానీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కొందరు అక్కడ కూడా సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో ప్రియాంక చోప్రా ఒకరు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా హాలీవుడ్ లో క్వాంటికో వెబ్ సీరీస్ తో హాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఆ సీరీస్ అక్కడ హిట్ అవ్వడంతో అక్కడ వరుస ఛాన్సులు అందుకుంది.

హాలీవుడ్ లో దూసుకెళ్తున్న ప్రియాంకకు బాలీవుడ్ నుంచి ఆఫర్లు వచ్చినా సరే ఆమె నో చెప్పింది. తనకు స్టార్ డం తెచ్చిన బాలీవుడ్ ను కూడా ప్రియాంక లైట్ తీసుకుంది. ఈ క్రమంలో బాలీవుడ్ లో కొన్ని సినిమాలు కమిట్మెంట్ ఇచ్చి కూడా చివరి నిమిషం హ్యాండ్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయట. ఆ విషయాన్నే ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ రీసెంట్ గా చెప్పుకొచ్చారు.

బోనీ కపూర్ నిర్మాణంలో సర్ధార్ నీ సినిమాకు ప్రియాంక సైన్ చేసిందట. దిల్జిత్ హీరోగా ప్రియాంక హీరోయిన్ గా ఆ సినిమా ప్లాన్ చేయగా ముందు ఓకే చెప్పిన ప్రియాంక ఆ తర్వాత కాదన్నది ఆమె నో చెప్పడంతో ఆ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టాట్టాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు బోనీ కపూర్. క్వాంటికో సిరీస్ తర్వాత తనకు ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం సినిమా చేయాలని కాకపోతే ఆ టైం లో కొంత టైం కావాలని కోరిక ప్రియాంకకు అడిగినంత టైం ఇచ్చినా ఆమె నెక్స్ట్ క్వాంటికో 2 చేసింది కానీ తన సినిమా చేయలేదని అన్నారు బోనీ కపూర్.

ప్రియాంక రాకపోవడంతో ఆ సినిమా ఆపేశానని చెప్పారు బోనీ కపూర్. అదే కాదు ఆ తర్వాత ప్రియాంక ఏ బాలీవుడ్ సినిమా చేయలేదు. హాలీవుడ్ లో తనకు ఏర్పడిన క్రేజ్ తో అక్కడే వరుస ప్రాజెక్ట్ లు చేస్తుంది అమ్మడు. బాలీవుడ్ నుంచి ఎంత పెద్ద ఆఫర్ వచ్చినా లైట్ తీసుకుంటుంది అమ్మడు. హాలీవుడ్ వెళ్లగానే తనకు ఇంత క్రేజ్ తెచ్చిన బాలీవుడ్ చేదైందా అంటూ ఆమెపై ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు.