Begin typing your search above and press return to search.

ఓజీ గురించి క్యూటీ కామెంట్‌

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరి హర వీరమల్లు, ఉస్తాద్‌ భగత్ సింగ్ మరియు ఓజీ సినిమాల్లో నటిస్తున్న విషయం తెల్సిందే

By:  Tupaki Desk   |   26 Feb 2024 10:43 AM GMT
ఓజీ గురించి క్యూటీ కామెంట్‌
X

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరి హర వీరమల్లు, ఉస్తాద్‌ భగత్ సింగ్ మరియు ఓజీ సినిమాల్లో నటిస్తున్న విషయం తెల్సిందే. అయితే ఆయన ఫ్యాన్స్ తో పాటు చాలా మంది సినీ ప్రేమికులు పవన్‌ ఓజీ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పవన్‌ కి బాగా సెట్‌ అయ్యే కథ అవ్వడంతో పాటు ఫ్యాన్స్ ఎలా అయితే చూడాలి అనుకుంటున్నారో అలాంటి కథ తో ఓజీ రూపొందుతోంది.

సాహో సినిమా తో హిందీ ప్రేక్షకులను సర్‌ ప్రైజ్ చేసిన దర్శకుడు సుజీత్‌ దర్శకత్వంలో ఓజీ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌ గా క్యూట్‌ బ్యూటీ ప్రియాంక అరుల్‌ మోహన్ నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా గురించి మరియు పవన్ గురించి ప్రియాంక ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ప్రియాంక అరుల్‌ మోహన్ మాట్లాడుతూ... చాలా మంది ఓజీ గురించి ఎదురు చూస్తున్నారు. వారు అంతా కూడా ఆశిస్తున్నట్లు ఓజీ అద్భుతంగా వస్తుంది. కచ్చితంగా స్క్రీన్‌ పై చూస్తున్న సమయంలో అద్భుతమైన ఫీల్‌ ను పొందుతారు అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే వ్యాఖ్యలు చేసింది.

ఇక పవన్‌ గురించి ప్రియాంక అరుల్‌ మోహన్‌ మాట్లాడుతూ... పవన్‌ గొప్ప వ్యక్తి. ఆయన గ్రేట్‌ లీడర్‌, లెజెండ్‌ అంటూ పొగడ్తల వర్షం కురిపించింది. మొత్తానికి ఓజీ పై ఉన్న అంచనాలను భారీగా పెంచేసింది. ప్రస్తుతం పవన్‌ ఎన్నికల హడావుడిలో ఉన్నాడు. అది పూర్తి అవ్వగానే మొదట ఓజీ పూర్తి చేసి, ఇదే ఏడాదిలో విడుదల చేసే ప్లాన్‌ చేస్తున్నారు.