పిక్‌టాక్ : అందాల షో చేస్తున్న ఈ అమ్మడు గుర్తుందా?
విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన 'టాక్సీవాలా' సినిమాలో హీరోయిన్‌గా నటించిన ముద్దుగుమ్మ ప్రియాంక జవాల్కర్. ఆ సినిమా విజయాన్ని సొంతం చేసుకున్న లక్ కలిసి రాలేదు.
By: Tupaki Desk | 9 Jun 2025 5:00 PM ISTవిజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన 'టాక్సీవాలా' సినిమాలో హీరోయిన్‌గా నటించిన ముద్దుగుమ్మ ప్రియాంక జవాల్కర్. ఆ సినిమా విజయాన్ని సొంతం చేసుకున్న లక్ కలిసి రాలేదు. ఈ అమ్మడు ఆ తర్వాత తిమ్మరుసు, ఎస్‌ఆర్ కళ్యాణ మండపం, గమనం సినిమాల్లో నటించింది. ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకోలేదు. అయినా కూడా ఈ అమ్మడికి ఒకటి రెండు ఆఫర్లు దక్కాయి. ఇటీవల మ్యాడ్ స్వ్వేర్ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించింది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో పెద్దగా సినిమాలు ఏమీ లేవు. అయినా కూడా సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడి సందడి కొనసాగిస్తూ ఉంది. ఇన్‌స్టాలో అందమైన ఫోటోలు షేర్ చేస్తూ వచ్చింది.
ప్రియాంక జవాల్కర్ సోషల్ మీడియాలో రెండు మిలియన్‌ల కంటే ఎక్కువగానే ఫాలోవర్స్‌ను సొంతం చేసుకుంది. ఈ అమ్మడు రెగ్యులర్‌గా తన అభిమానుల కోసం అందాల ఆరబోత ఫోటోలు షేర్ చేస్తూ ఉంది. ఈ మధ్య కాలంలో సినిమాల్లో ఎక్కువగా కనిపించని ఈ అమ్మడు ఇన్‌స్టాలో మాత్రం రెగ్యులర్ ఫోటో షూట్స్‌తో అలరిస్తూ వచ్చింది. తాజాగా మరోసారి ఈ ఫోటోలను షేర్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఈ అమ్మడు తన వైపు తిప్పుకుంది. ప్రియాంక జవాల్కర్ అందమైన ఈ ఫోటోలను వేలాది మంది లైక్ చేయడం మాత్రమే కాకుండా పెద్ద ఎత్తున నెటిజన్స్ షేర్ చేస్తున్నారు. ఈ అమ్మడి అందానికి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతూ కామెంట్ చేస్తున్నారు.
వైట్ షర్ట్ ధరించి, బ్లూ జీన్స్ లో ప్రియాంక జవాల్కర్‌ను ఇక్కడ చూడవచ్చు. ఆకట్టుకునే అందంతో పాటు, మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం అనడంలో సందేహం లేదు. తెలుగు అమ్మాయి కావడం వల్ల ఈమెకు హీరోయిన్‌గా ఎక్కువ ఆఫర్లు రావడం లేదని, తెలుగు అమ్మాయి కాకుండా ఉండి ఉంటే కచ్చితంగా ఈమెకు మంచి ఆఫర్లు వచ్చి ఉండేవి అనేది కొందరి అభిప్రాయం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు ఎక్కువ ఆఫర్లు రావని, ఒకవేళ కష్టపడి ఇండస్ట్రీలో అడుగు పెట్టినా కూడా పెద్దగా ఆఫర్లు ఉండవు అనే అభిప్రాయం ప్రియాంక జవాల్కర్ కెరీర్‌ను చూస్తే మరింతగా బలపడుతోంది అంటూ ఆమె ఫ్యాన్స్ అంటున్నారు.
ఏపీలోని అనంతపురంలో మరాఠీ మాట్లాడే ఫ్యామిలీలో జన్మించిన ప్రియాంక జవాల్కర్ కంప్యూటర్ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. అంతే కాకుండా ఫ్యాషన్ డిజైనింగ్‌లోనూ డిప్లొమా చేసింది. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ నిమిత్తం యూఎస్‌లోనూ ఈమె ప్రత్యేక శిక్షణ తీసుకుంది. అంతే కాకుండా పలు కంపెనీల్లోనూ జాబ్ చేసింది. హీరోయిన్‌గా ఆఫర్లు రావడంతో ఈ అమ్మడు సినిమాల వైపు అడుగులు వేసింది. ముందు ముందు అయినా ఈ అందాల ముద్దుగుమ్మకు హీరోయిన్‌గా ఆఫర్లు మరిన్ని రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. తెలుగు మూలాలు ఉండటం వల్ల ఈమెకు ఆఫర్లు రాకపోవడం అనేది బాధాకరం అని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
