ఆ సినిమా హిట్ అవుతుందనుకోలేదు
2017లో హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక జవాల్కర్ ఇప్పటివరకు 8 సినిమాలు మాత్రమే చేసింది.
By: Tupaki Desk | 8 April 2025 12:42 PM IST2017లో హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక జవాల్కర్ ఇప్పటివరకు 8 సినిమాలు మాత్రమే చేసింది. ఆ ఎనిమిదిలో రెండు క్యామియోలే. విజయ దేవరకొండ, కిరణ్ అబ్బవరం, సిద్దు జొన్నలగడ్డ, సత్య దేవ్ లాంటి హీరోలతో కలిసి సినిమాలు చేసిన ప్రియాంక జవాల్కర్ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్‌లు అందుకుంది.
వరుస హిట్లు కూడా ప్రియాంక జవాల్కర్ ను స్టార్ హీరోయిన్ ను చేయలేకపోయాయి. చేసిన సినిమాలు సక్సెస్ అయినా ప్రియాంకకు ఎక్కువ ఆఫర్లు రాలేదు. ప్రియాంక హీరోయిన్ గా సినిమా వచ్చి దాదాపు మూడేళ్లవుతోంది. గతేడాది టిల్లూ స్వ్కేర్ లో కాసేపు మెరిసిన ప్రియాంక, రీసెంట్ గా మ్యాడ్ స్వ్కేర్ సినిమాలో లైలా అనే పాత్రలో కనిపించింది. మ్యాడ్ స్వ్కేర్ సూపర్ హిట్ అవడంతో ప్రియాంక మళ్లీ వార్తల్లో నిలుస్తూ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చింది.
టాలీవుడ్ లో ఉన్న అతి తక్కువ మంది తెలుగు అమ్మాయిలలో ప్రియాంక జవాల్కర్ కూడా ఒకరు. షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ ను స్టార్ట్ చేసిన ప్రియాంక, ట్యాక్సీవాలా సినిమాతో హీరోయిన్ గా పరిచయమైందనే సంగతి తెలిసిందే. రాహుల్ సాంకృత్య్సన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ నిర్మించింది.
అయితే ట్యాక్సీవాలా సినిమా ఎడిటింగ్ కూడా అవకముందే హెచ్‌డీ ప్రింట్ ఆన్‌లైన్ లోకి లీకైన సంగతి తెలిసిందే. ఎడిటింగ్ కు పంపిన ఫుల్ మూవీని ఎవరో కావాలని లీక్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో అసలు ట్యాక్సీవాలా సినిమా వర్కవుట్ అవుతుందని ఎవరూ అనుకోలేదని, ఆల్రెడీ ఫుల్ సినిమా లీకైనప్పుడు ఆడియన్స్ థియేటర్లకు వస్తారా అనుకున్నామని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక జవాల్కర్ తెలిపింది.
సినిమా మొత్తం లీకైనా జనాలు థియేటర్లకు వచ్చి మూవీని చూడటం, సినిమాను హిట్ చేయడం ఒక మ్యాజిక్ లాగే జరిగిందని, తనను అందరూ ట్యాక్సీవాలా హీరోయిన్ అనే పిలుస్తారని, ఆ సినిమాలోని మాటే వినదుగా సాంగ్ ఇప్పటికీ తనను వదలదని ప్రియాంక తెలిపింది. ప్రస్తుతం ప్రియాంక రెండు సినిమాల్లో నటిస్తోంది.
