ట్యాక్సీవాలా బ్యూటీ.. నెవ్వర్ బిఫోర్ గ్లామర్ బ్లాస్ట్!
తాజాగా గోల్డెన్ టోన్ అవుట్‌ఫిట్‌లో ఆమె చేసిన స్టన్నింగ్ ఫోటోషూట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.
By: Tupaki Desk | 26 July 2025 5:00 PM IST‘ట్యాక్సీవాలా’ మూవీతో టాలీవుడ్‌లో ఫస్ట్ హిట్ కొట్టిన ప్రియాంక జవాల్కర్ తాజాగా సోషల్ మీడియాలో నెవ్వర్ బిఫోర్ అనేలా దర్శనమిచ్చింది. ఈమధ్య సినిమాలకి దూరంగా ఉన్నా.. తన ఫోటోషూట్స్‌తో మాత్రం తరచూ హాట్ టాపిక్ అవుతూనే ఉంది. తాజాగా గోల్డెన్ టోన్ అవుట్‌ఫిట్‌లో ఆమె చేసిన స్టన్నింగ్ ఫోటోషూట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. క్యూట్ హార్ట్ షేప్ చేస్తూ, ఒదిగిన డ్రెస్సులో అందాలను బోల్డ్‌గా ప్రదర్శిస్తూ ఇచ్చిన స్టిల్స్ నెటిజన్లకు మతిపోయేలా చేస్తున్నాయి.
మెటాలిక్ గోల్డ్ అవుట్‌ఫిట్‌లో ప్రియాంక తన స్టైలిష్ ఎటిట్యూడ్‌తో పాటు గ్లామర్‌ను కూడా ఫుల్ స్కేల్‌లో ప్రెజెంట్ చేసింది. వయ్యారంగా వేర్వేరు పోజులతో తన గ్లామర్ యాంగిల్స్‌ను ఎలివేట్ చేసింది. ప్రియాంక ఎప్పుడూ మోడరేట్ లుక్స్‌తోనే మెస్మరైజ్ చేస్తుంటే.. ఈసారి మాత్రం ఆడియెన్స్‌కు ఊహించని షాక్ ఇచ్చింది. ఆమె ఫోటోలు చూసిన వారంతా “ఇదీ నెవ్వర్ బిఫోర్ గ్లామర్ బ్లాస్ట్!” అని కామెంట్స్ చేస్తున్నారు.
ప్రియాంక కెరీర్ విషయానికి వస్తే.. విజయ్ దేవరకొండ సరసన వచ్చిన ‘ట్యాక్సీవాలా’తోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తిమ్మరుసు, SR కళ్యాణమండపం, గమనం వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. అయితే తన నటనకు భిన్నమైన ప్రాజెక్టుల ఎంపిక కాకపోవడం, మంచి అవకాశాల కొరత వల్ల బిగ్ స్క్రీన్ కు కొంత గ్యాప్ వచ్చింది. అయినా సోషల్ మీడియాలో క్రేజ్ మాత్రం అలానే కొనసాగుతోంది.
ఈ ఫోటోషూట్‌లో కనిపించిన గ్లామర్ ప్రియాంకకు కెరీర్ పరంగా మంచి బ్రేక్ తీసుకొచ్చేలా కనిపిస్తోంది. ఆమెలో ఉన్న స్క్రీన్ ప్రెజెన్స్, స్టైలిష్ లుక్, ఆడిషన్స్‌లో ఉన్న ఎనర్జీ అన్నీ కలిపి చూస్తే.. మిడ్‌రేంజ్ చిత్రాల్లోకి తిరిగి బిజీ అవ్వడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు. ముఖ్యంగా ఈ గోల్డ్ థీమ్ ఫోటోషూట్ ప్రియాంకను మళ్లీ ట్రెండింగ్‌లోకి తెచ్చింది. ప్రస్తుతం ప్రియాంక కొద్ది సినిమాలే చేస్తుండగా, కొత్త కథలపై ఫోకస్ పెంచినట్టు సమాచారం. ఇక ఈ బ్యూటీ రాబోయే రోజుల్లో ఓ సాలిడ్ రీ ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.
