Begin typing your search above and press return to search.

ఆ హీరోకి పీసీ ఓకే చెబుతుందా..?

బాలీవుడ్ నుంచి హాలీవుడ్ షిఫ్ట్ అయిన ప్రియాంక చోప్రా ఆల్మోస్ట్ ఇండియన్ సినిమాలకు దూరమైనట్టే అనిపించింది. దాదాపు 9 ఏళ్లుగా ఒక్క భారతీయ సినిమాను కూడా అమ్మడు చేయలేదు.

By:  Tupaki Desk   |   24 May 2025 5:41 AM
Priyanka Chopra’s Big Indian Comeback
X

బాలీవుడ్ నుంచి హాలీవుడ్ షిఫ్ట్ అయిన ప్రియాంక చోప్రా ఆల్మోస్ట్ ఇండియన్ సినిమాలకు దూరమైనట్టే అనిపించింది. దాదాపు 9 ఏళ్లుగా ఒక్క భారతీయ సినిమాను కూడా అమ్మడు చేయలేదు. 2016 లో హిందీలో జై గంగాజల్ చేసిన ప్రియాంక చోప్రా అదే ఏడాది మరాఠిలో వెంటిలేటర్ సినిమా చేసింది ఆ తర్వాత వరుస హాలీవుడ్ సినిమాలు సీరీస్ లతో అదరగొట్టేస్తుంది. అక్కడే పాప్ సింగర్ నిక్ జోనస్ ని పెళ్లాడింది ప్రియాంక చోప్రా. 9 ఏళ్లుగా బాలీవుడ్ నుంచి వచ్చిన ఆఫర్లను కూడా కాదనేస్తుంది అమ్మడు.

ఐతే లేటెస్ట్ గా రాజమౌళి డైరెక్షన్ లో సూపర్ స్టార్ మహేష్ హీరోగా చేస్తున్న సినిమాకు అమ్మడు సైన్ చేసిన విషయం తెలిసిందే. మహేష్ ప్రియాంక చోప్రా ఈ కాంబో సంథింగ్ స్పెషల్ కానుంది. ముఖ్యంగా ప్రియాంక చోప్రా క్రేజ్ ని క్యాష్ చేసుకునేందుకే ఈ ప్రాజెక్ట్ లో ఆమెను తీసుకున్నారని అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే 9 ఏళ్ల తర్వాత ఇండియన్ సినిమాకు సైన్ చేసిన పీసీ ఇక మీదట ఇక్కడ కూడా వరుస సినిమాలు చేస్తుందా అన్నది తెలియాల్సి ఉంది.

ఆల్రెడీ అమ్మడు క్రిష్ 4 లో నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. హృతిక్ రోషన్ తో క్రిష్ సినిమా చేసిన ప్రియాంకా చోప్రా ఆ సినిమా సీక్వెల్స్ లో కూడా అలరించింది. త్వరలో క్రిష్ 4 సెట్స్ మీదకు వెళ్లబోతుందని తెలుస్తుంది. మరి క్రిష్ 4 లో ప్రియాంక ఉంటుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. SSMB29 సినిమాకు సైన్ చేసింది కాబట్టి క్రిష్ 4 ని కూడా అమ్మడు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

ప్రస్తుతం ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో హెడ్స్ ఆఫ్ స్టేట్, ది బ్లఫ్ సినిమాల్లో నటిస్తుంది. మహేష్ తో చేస్తున్న సినిమా ఎలా లేదన్నా మరో రెండేళ్లు పట్టేలా ఉంది. ఈలోగా తను కమిటైన ఇంగ్లీష్ సినిమాలు పూర్తి చేసి అమ్మడు మరోసారి ఇండియన్ స్క్రీన్స్ పై తన సత్తా చాటాలని చూస్తుంది. ఏది ఏమైనా ప్రియాంక చోప్రా ప్లానింగ్ ఒక రేంజ్ లో ఉందని ఆమె ఫ్యాన్స్ అనుకుంటున్నారు. మహేష్ సినిమాకు పీసీ ఎంత వరకు హెల్ప్ అవుతుందో ఆ సినిమా వచ్చాక తెలుస్తుంది. క్రిష్ 4లో కూడా ప్రియాంక చోప్రా ఉంటే మాత్రం ఆ సినిమాకు వేరే లెవెల్ క్రేజ్ వస్తుందని చెప్పొచ్చు.