మరో పెద్ద ప్రాజెక్టులో ప్రియాంక
ఇదిలా ఉంటే క్రిష్ 4 గురించి మరో ఆసక్తికర విషయమేంటంటే ఇందులో క్రిష్ కు జోడీగా ప్రియాంక చోప్రా నటించనుంది.
By: Tupaki Desk | 12 April 2025 7:40 AMహృతిక్ రోషన్ హీరోగా వచ్చిన క్రిష్ ఫ్రాంచైజ్ సినిమాకు ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హృతిక్ ఎన్నో సినిమాలు చేసినా వాటిలో క్రిష్ ఫ్రాంచైజ్ కు మాత్రం సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటికే ఈ ఫ్రాంచైజ్ నుంచి మూడు భాగాలు రిలీజ్ కాగా, ఇప్పుడు నాలుగో భాగం రెడీ అవుతోంది. అయితే దీంట్లో మరో ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఉంది.
ఈ నాలుగో పార్ట్ కు హృతిక్ రోషనే దర్శకత్వం వహించనున్నాడు. ముందు మూడు భాగాల్లో హీరోగా నటించిన హృతిక్ ఇప్పుడు క్రిష్ 4కు దర్శకత్వం వహిస్తుండటంతో సినిమాపై అందరికీ భారీ అంచనాలు పెరిగాయి. ఇదిలా ఉంటే క్రిష్ 4 గురించి మరో ఆసక్తికర విషయమేంటంటే ఇందులో క్రిష్ కు జోడీగా ప్రియాంక చోప్రా నటించనుంది. క్రిష్ సినిమా నుంచి ప్రియాంక ఆ ఫ్రాంచైజ్ లో ప్రియ పాత్రను పోషిస్తూ వస్తుంది.
అయితే ఇప్పటివరకు హృతిక్ రోషన్, ప్రియాంక చోప్రా కలిసి పలు సినిమాలు చేశారు. వారిద్దరిదీ బ్లాక్ బస్టర్ పెయిర్. ప్రియాంక, హృతిక్ కలిసి నటించిన ప్రతీ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలవడంతో పాటూ భారీ కలెక్షన్లను కూడా అందుకున్నాయి. గతంలో ప్రియాంక, హృతిక్ కలిసి క్రిష్, క్రిష్3, అగ్నిపథ్ సినిమాల్లో కలిసి నటించారు. ఆ సినిమాలన్నీ కూడా సూపర్ హిట్లుగా నిలిచినవే.
క్రిష్, క్రిష్3లో ప్రియాంక కీలక పాత్రలో కనిపించగా, ఇప్పుడు క్రిష్4లో కూడా ఆమె పాత్ర చాలా కీలకం కానుందని అర్థమవుతుంది. అయితే క్రిష్ 4లో ప్రియాంక నటించనుండటం ఆమె ఫ్యాన్స్ కు చాలా పెద్ద న్యూస్. ఆల్రెడీ రాజమౌళి- మహేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎంబీ29లో కీలక పాత్ర చేస్తున్న ప్రియాంక ఇప్పుడు క్రిష్ 4లో కూడా నటించనుందని తెలిసి ఆమె అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు.
చాలా కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ప్రియాంక, ఇప్పుడు వీలైనంత బెస్ట్ ప్రాజెక్టులతో మళ్లీ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తోంది. ప్రస్తుతానికి క్రిష్ 4 సినిమా కోసం నటీనటులను ఎంపిక చేస్తున్నారు మేకర్స్. ఇదిలా ఉంటే ఈ సూపర్ హీరో మూవీ భారీ వీఎఫ్ఎక్స్ తో రూపొందనుందనే విషయం తెలిసిందే. మరి డైరెక్టర్ గా హృతిక్ క్రిష్ 4ను ఏ రేంజ్ కు తీసుకెళ్తాడో చూడాలి.