ప్రియాంక చోప్రాపై పడ్డ 'వడా పావ్' ఫ్యాన్స్..!
హైదరాబాద్ వాళ్లకు బిర్యానీ సెంటిమెంట్ కాగా, తమిళ్ వాళ్లకు సాంబార్ ఇడ్లీ సెంటిమెంట్. అలాగే నార్త్ వాళ్లకు ముఖ్యంగా మహారాష్ట్ర వాళ్లకు వడా పావ్ సెంటిమెంట్.
By: Tupaki Desk | 11 July 2025 6:00 PM ISTహైదరాబాద్ వాళ్లకు బిర్యానీ సెంటిమెంట్ కాగా, తమిళ్ వాళ్లకు సాంబార్ ఇడ్లీ సెంటిమెంట్. అలాగే నార్త్ వాళ్లకు ముఖ్యంగా మహారాష్ట్ర వాళ్లకు వడా పావ్ సెంటిమెంట్. ముంబాయి వెళ్లిన వారు ఖచ్చితంగా వడా పావు తినాల్సిందే. వరల్డ్ ఫేమస్ అయిన వడా పావ్‌కు ఎంతో మంది అభిమానులు ఉంటారు. సౌత్ ఇండియాలోనూ వడా పావ్ కొన్ని చోట్ల అమ్ముతారు, కానీ అంతగా ఫేమస్ కాలేదు. ఇండియా మొత్తం వడా పావ్ కి ఉన్న గుర్తింపును గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సెలబ్రిటీలు సైతం వడా పావ్ గురించి ఏదో ఒక సమయంలో మాట్లాడటం మనం చూస్తూ ఉంటాం. చాలా మంది వడా పావ్ తమ ఫేవరేట్ అని చెప్పడం జరిగింది.
ఇప్పుడు ఇదే వడా పావ్ కారణంగా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా చిక్కుల్లో పడింది. ఇటీవల ఒక మీడియా చిట్ చాట్‌లో తన ఫేవరెట్ ఫుడ్ ఐటెమ్స్ గురించి చెప్పుకొచ్చింది. ఆ క్రమంలో రెండు ఫుడ్ ఐటెమ్స్‌ను పెట్టి ఇందులో మీ ఫేవరెట్ ఏది అంటూ ప్రశ్నించిన సమయంలో ఆమె ఒకటి పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇండియన్ ఫుడ్ ఐటెమ్స్ తో పాటు ఇంటర్నేషనల్ ఫుడ్ ఐటెమ్స్‌ను సైతం అందులో చేర్చారు. చాలా వాటికి రెండు ఇష్టం, రెండింటిలో ఏది బెస్ట్ అనేది ఎంపిక చేసుకోలేను అని చెప్పింది. కానీ వడా పావ్ విషయంలో మాత్రం అలా చెప్పలేదు. తనకు వడా పావ్ కంటే ఎక్కువగా హాట్ డాగ్ ఇష్టం అని, రెండింటిలో నేను హాట్ డాగ్‌ను ఎంపిక చేసుకుంటాను అంది.
వడా పావ్ అంటే చాలా ఇష్టం, ఎక్కువగా తింటాను, కానీ నాకు హాట్ డాగ్ అనేది బలహీనత. అది పక్కన ఉండగా మరేది తినలేను అన్నట్లుగా చెప్పుకొచ్చింది. హాట్ డాగ్ అనేది అమెరికాలో మోస్ట్ పాపులర్ ఫుడ్ ఐటెం. ఈ మధ్య కాలంలో అమెరికాలోనే ప్రియాంక చోప్రా ఎక్కువగా ఉంటుంది, అంతే కాకుండా హాలీవుడ్ సినిమాలు, సిరీస్‌లు చేస్తుంది. అందుకే హాట్ డాగ్‌ను తన ఫేవరేట్ అని చెప్పడం ద్వారా అమెరికన్స్‌కి మరింత దగ్గర కావచ్చు అని ఈమె భావించి ఉంటుందని, అందుకే తన ఫేవరేట్‌గా హాట్ డాగ్‌ను చెప్పిందని చాలా మంది అంటున్నారు. వడా పావ్ కి ఉన్న క్రేజ్ ను తగ్గించే విధంగా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రియాంక చోప్రాను వడా పావ్ ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో విమర్శలు చేస్తున్నారు. వడా పావ్ ఫ్యాన్స్ మొత్తం ఇప్పుడు ప్రియాంక చోప్రా మీద పడి మరీ ట్రోల్ చేస్తున్నారు. ఈ ట్రోల్స్ నుంచి ఆమె ఎలా బయట పడుతుందో చూడాలి. ఇప్పటికే ఈ విషయమై వివాదం తీవ్రతరం దాల్చుతోంది. ఆమె స్పందించకుంటే, క్షమాపణ చెప్పకుంటే ఆమె నుంచి రాబోతున్న సినిమాలపై ఆ ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వడా పావ్ విషయమై ప్రియాంక చోప్రా వ్యాఖ్యలను పలువురు నార్త్ ఇండియన్ ఆహార ప్రియులు ఖండిస్తున్నారు. కేవలం హాలీవుడ్ ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకోవడం కోసం ప్రియాంక చోప్రా ఇలాంటి వ్యాఖ్యలు చేసిందని అంటున్నారు.
