ప్రియాంక ఎగ్జైట్ అవుతుంది ఆ సినిమా గురించేనా?
ప్రియాంక చోప్రా నిక్ జోనాస్ ను పెళ్లి చేసుకున్న తర్వాత అమెరికా వెళ్లి హాలీవుడ్ లో సెటిలైన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 4 July 2025 12:18 PM ISTటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతుండగా, ఈ సినిమాలో ప్రియాంక చోప్రా ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా ప్రియాంక ఓ ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ప్రస్తుతం ఓ ఇండియన్ మూవీలో నటిస్తున్నట్టు చెప్పి ఆ సినిమా కోసం ఎంతో వెయిట్ చేస్తున్నట్టు తెలిపారు.
ప్రియాంక చోప్రా నిక్ జోనాస్ ను పెళ్లి చేసుకున్న తర్వాత అమెరికా వెళ్లి హాలీవుడ్ లో సెటిలైన విషయం తెలిసిందే. అమెరికాలో సెటిలయ్యాక ప్రియాంక ఇండియాను, బాలీవుడ్ సినిమాలను మిస్ అవుతున్నానని, ఈ ఇయర్ ఓ ఇండియన్ సినిమాలో నటిస్తున్నానని, ఆ సినిమా కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నానని, ఇండియన్ ఆడియన్స్ చూపే ప్రేమ, ఆప్యాయతలు వెల కట్టలేనివని, ఈ ప్రేమ ఎప్పటికీ ఇలానే కంటిన్యూ అవాలని కోరుకుంటున్నట్టు ప్రియాంక చోప్రా చెప్పారు.
దీంతో ప్రియాంక మాట్లాడింది ఎస్ఎస్ఎంబీ29 సినిమా గురించేనని మహేష్ ఫ్యాన్స్ భావిస్తూ తెగ సంబరపడిపోతున్నారు. అదే ఇంటర్వ్యూలో ప్రియాంక చోప్రా బొంబాయి మూవీ గురించి కూడా మాట్లాడారు. తాను ఎక్కువగా సినిమాలు చూస్తూ పెరగలేదని, తన తండ్రికి మ్యూజిక్ అంటే ఇష్టమవడంతో ఎప్పుడూ ఇంట్లో మ్యూజిక్ వినిపిస్తూనే ఉండేదని, తనకు 13 ఏళ్ల వయసున్నప్పుడు ముంబైలో బొంబాయి సినిమా చూశానని, తనకు ఊహ తెలిసిన తర్వాత చూసిన ఫస్ట్ మూవీ అదేనని, ఆ ఎక్స్‌పీరియెన్స్ ను ఇప్పటికీ మర్చిపోలేనని ప్రియాంక తెలిపారు.
కాగా ఎస్ఎస్ఎంబీ29 సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో సాగే కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. ఈ సినిమాలో మహేష్ మునుపెన్నడూ కనిపించని పాత్రలో చాలా కొత్త లుక్ తో కనిపించనున్నారు. ఎస్ఎస్ఎంబీ29ను రాజమౌళి ఎన్నో హంగులతో పాన్ వరల్డ్ లెవెల్ లో తెరకెక్కిస్తున్నారని ఇప్పటికే రైటర్ విజయేంద్ర ప్రసాద్ పలుమార్లు వెల్లడించారు. ఈ సినిమాలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
