పిక్‌టాక్ : రొమాంటిక్ మూడ్‌లో స్టార్ హీరోయిన్
బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వెళ్లి గ్లోబల్ బ్యూటీగా పేరు దక్కించుకున్న ప్రియాంక చోప్రా ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న విషయం తెల్సిందే.
By: Tupaki Desk | 2 Jun 2025 11:05 AM ISTబాలీవుడ్ నుంచి హాలీవుడ్ వెళ్లి గ్లోబల్ బ్యూటీగా పేరు దక్కించుకున్న ప్రియాంక చోప్రా ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న విషయం తెల్సిందే. 92.3 మిలియన్‌ల ఫాలోవర్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో కలిగి ఉన్న ఈ అమ్మడు ప్రస్తుతం సోషల్ మీడియాలో తన రొమాంటిక్ ఫోటోలను షేర్ చేయడం ద్వారా వైరల్ అవుతోంది. గత నెలలో జరిగిన మెట్ గాలా కార్యక్రమంలో ప్రియాంక చోప్రా పాల్గొన్న విషయం తెల్సిందే. ఆ సమయంలో ప్రియాంక చోప్రాతో పాటు ఆమె భర్త నిక్ ఇంకా కూతురు కూడా ఉన్నారు. ఇంతకు ముందే మెట్ 2025 కి సంబంధించిన ఫోటోలను ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో అభిమానులతో పాటు, ఫాలోవర్స్‌తో షేర్ చేసుకుంది.
మెట్ 25 అంటూ మరోసారి ప్రియాంక చోప్రా ఫోటోలను షేర్ చేసింది. సిల్వర్ కలర్ ఔట్ ఫిట్‌తో ప్రియాంక చోప్రా మెరిసి పోతుంది. ఈ స్థాయి అందం కేవలం ప్రియాంక చోప్రాకే సాధ్యం అంటూ అభిమానులు సైతం కామెంట్ చేస్తున్నారు. ఇవే ఫోటోల్లో ప్రియాంక చోప్రాతో పాటు నిక్ సైతం ఉండటంతో మరింత నెటిజన్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. సోషల్ మీడియాలో పీసీ, నిక్‌ల ఫోటోలు ఎప్పుడు షేర్ చేసినా అభిమానులు, ఫాలోవర్స్ తెగ ఎంజాయ్ చేస్తారు. ఈసారి కూడా వీరి ఫోటోలకు అభిమానులు ఫిదా అవుతూ కామెంట్ చేస్తున్నారు. వంద మిలియన్‌ల ఫాలోవర్స్‌కి చేరువ అయిన ప్రియాంక చోప్రా ఇలాంటి ఫోటోలను షేర్ చేయడం ద్వారా మరింత త్వరగా ఆ మ్యాజిక్ నెంబర్‌ను రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ప్రియాంక చోప్రాకి ఏమాత్రం తగ్గకుండా నిక్ సైతం స్టైలిష్ లుక్‌తో మెప్పించాడు. వీరిద్దరి జోడీ ఎప్పుడూ కన్నుల విందు అన్నట్టుగా ఉంటారు అనడంలో సందేహం లేదు. ఈ అంతర్జాతీయ వేడుకలో తీసుకున్న ఈ ఫోటోలను మరోసారి షేర్ చేయడం ద్వారా ప్రియాంక చోప్రా ఆ కార్యక్రమాన్ని ఏ స్థాయిలో ఆస్వాదించిందో అర్థం చేసుకోవచ్చు. ఆ కార్యక్రమం తన జ్ఞాపకాల నుంచి పోవడం లేదు అంటూ ప్రియాంక చోప్రా ఈ ఫోటోలను షేర్ చేసిన సమయంలో చెప్పుకొచ్చింది. రొమాంటిక్ మూడ్‌లో ఉన్న ఫోటోలకు మంచి రెస్పాన్స్ దక్కింది. అందుకే అభిమానులు ఈ ఫోటోలను ఎక్కువగా షేర్ చేస్తున్నారు. ప్రియాంక చోప్రా వయస్సు పెరిగిన కొద్దీ మరింత అందంగా తయారు అవుతుంది.
ఈ బ్యూటీ సినిమాల విషయానికి వస్తే చాలా కాలం తర్వాత ఇండియన్ సినిమా చేస్తుంది. అది కూడా రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న సినిమా కావడం విశేషం. మహేష్ బాబు సినిమా తర్వాత ప్రియాంక చోప్రా ఒక బాలీవుడ్ సినిమాను చేసేందుకు సిద్ధం అయింది. ఆ సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. మహేష్ బాబు సినిమాలో ప్రియాంక చోప్రా పాత్ర ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది. మహేష్ బాబుకు జోడీగా ప్రియాంక చోప్రా కనిపించబోతుందా లేదా మరో రకంగా ఏమైనా కనిపించబోతుందా అనే చర్చ జరుగుతోంది. రాజమౌళి మాత్రం ఇప్పటి వరకు ప్రియాంక చోప్రా పాత్ర గురించి ఎలాంటి హింట్ ఇవ్వలేదు. ముందు ముందు పీసీ మరిన్ని ఇండియన్ సినిమాలతో పాటు హాలీవుడ్ సిరీస్‌లను, సినిమాలను చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.
