Begin typing your search above and press return to search.

మ‌రీ ఈ రేంజు భంగిమ ఊహించ‌లేదు

అయితే ఈ ఫోటోల‌లోంచి ఒక ప్ర‌త్యేక‌మైన ఫోటో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. బీచ్ లో ఎంతో స‌ర‌దాగా ఆట‌లాడుతూ రొమాంటిగ్గా, స‌ర‌సంగా క‌నిపించింది ప్రియానిక్ జంట.

By:  Tupaki Desk   |   22 July 2025 8:36 AM IST
మ‌రీ ఈ రేంజు భంగిమ ఊహించ‌లేదు
X

ప్రియాంక చోప్రా- నిక్ జోనాస్ జంట స‌ర‌దాలు, బ‌హిరంగ రొమాన్స్ గురించి ఇప్పుడే చెప్పుకోవాల్సిన ప‌ని లేదు. వీలున్న ప్ర‌తిసారీ ప్రియాంక చోప్రా త‌న భ‌ర్త‌తో రొమాంటిక్ లైఫ్ కి సంబంధించిన‌ ఫోటోలు, వీడియోల‌ను షేర్ చేస్తూనే ఉంది. వాటికి నెటిజ‌నుల నుంచి స్పంద‌న అనూహ్యంగా ఉంది. ముఖ్యంగా నిక్ జోనాస్ తో క‌లిసి బికినీ బీచ్ విహార‌యాత్ర‌ల‌కు సంబంధించిన ఫోటోల‌ను షేర్ చేసిన‌ప్పుడు యువ‌త ఎక్కువ‌గా ఎగ్జ‌యిట్ అవుతోంది.

ఇప్పుడు కూడా పీసీ త‌న భ‌ర్త నిక్ జోనాస్, కుమార్తె మాల్తీ మేరీతో బీచ్‌లో విహార యాత్ర‌ను ఆస్వాధిస్తోంది. అయితే ఫ్యామిలీ యాత్ర‌లో పీసీ చెల‌రేగి బికినీ ఫోటోషూట్ల‌లో పాల్గొంది. ఇప్ప‌టికే ప్రియాంక చోప్రా ధ‌రించిన ర‌క‌ర‌కాల బికినీ ఫోటోలు వైర‌ల్ గా మారాయి. ఈ ఫోటోగ్రాఫ్స్ పై యూత్ విప‌రీత‌మైన కామెంట్లు చేసారు.

అయితే ఈ ఫోటోల‌లోంచి ఒక ప్ర‌త్యేక‌మైన ఫోటో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. బీచ్ లో ఎంతో స‌ర‌దాగా ఆట‌లాడుతూ రొమాంటిగ్గా, స‌ర‌సంగా క‌నిపించింది ప్రియానిక్ జంట. ఆలు మ‌గ‌లు రొమాంటిగ్గా బీచ్ లో ఒక‌రితో ఒక‌రు ఆట‌లాడుతూ క‌నిపించారు. ఈ స‌ర‌దా ఆట‌లో పీసీ కింద ప‌డి ఉన్న నిక్ జోనాస్ పై కూచుని క‌నిపించింది. ఇది ఒక ప్ర‌త్యేక‌మైన భంగిమ కావ‌డంతో నేటి జెన్ జెడ్ కుర్రాళ్లు వెంట‌నే ఈ ఫోటోగ్రాఫ్ ని క్యాచ్ చేసి వైర‌ల్ చేయ‌డం ప్రారంభించారు.

ఇది చూడ‌గానే కొత్త జంట హ‌నీమూన్ ట్రిప్ లా ఉంది! అంటూ ఒక‌రు కామెంట్ చేయ‌గా, పెళ్ల‌యి ఇన్నేళ్ల‌యినా హ‌నీమూన్ పూర్త‌వ్వ‌లేదా? అంటూ మ‌రొక‌రు వ్యాఖ్యానించారు. ఇది ఇండియా క‌ల్చ‌ర్ కాద‌ని ఒక‌రు కామెంట్ చేసారు. పీసీ నుంచి దీనిని ఊహించ‌లేదు! అని మ‌రొక అభిమాని అన్నారు. 43వ బ‌ర్త్ డే వేడుక‌ల్లో భాగంగా పీసీ ఈ రేంజులో రెచ్చిపోవ‌డం నెటిజ‌నుల‌ను నిజంగా ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అయితే త‌న కుటుంబంతో ప్రయివేట్ గా గ‌డిపిన ఈ ఫోటోలు వెబ్ లోకి రావ‌డంతోనే చిక్కొచ్చిప‌డింది. ప్రియానిక్ వ్య‌క్తిగ‌తంగా ఎలా ఎంజాయ్ చేసినా, ప‌బ్లిక్ వేదిక‌పైకి ఆ ఫోటోలు, వీడియోలు వ‌చ్చిన‌ప్పుడు ఈ అస‌భ్య‌క‌ర వ్యాఖ్య‌ల్ని ఎదుర్కోవాల్సి వ‌స్తోంది. కానీ ఒక‌రి వ్య‌క్తిగ‌త జీవితం విష‌యంలో హ‌ద్దుమీరిన‌ ట్రోలింగ్ స‌హించలేనిది.