Begin typing your search above and press return to search.

మెట్ గాలా 2025 ఈవెంట్లో దేశీ గాళ్

వేదిక ఏదైనా అద‌ర‌గొట్టేయ‌డంలో భార‌తీయ ఫ్యాష‌నిస్టా ప్రియాంక చోప్రా త‌ర్వాతే.

By:  Tupaki Desk   |   6 May 2025 10:57 AM
మెట్ గాలా 2025 ఈవెంట్లో దేశీ గాళ్
X

వేదిక ఏదైనా అద‌ర‌గొట్టేయ‌డంలో భార‌తీయ ఫ్యాష‌నిస్టా ప్రియాంక చోప్రా త‌ర్వాతే. మే 5న న్యూయార్క్ నగరంలోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో జరిగిన 2025 మెట్ గాలాలో పీసీ అద్భుత‌మైన లుక్ తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. బ్లాక్ పోల్కా డాట్స్ రెట్రో వైట్ బాల్‌మైన్ దుస్తులలో ప్రియాంక చోప్రా ప్ర‌త్యేకంగా క‌నిపించింది. ఇది 18వ శతాబ్ధం నాటి గాలా లుక్. యూనిక్ స్టైల్ తో ఆక‌ట్టుకుంది.


ఆస‌క్తిక‌రంగా ఈ దుస్తుల‌కు తగ్గ‌ట్టుగానే ఎలిజ‌బెత్ ప్రిన్సెస్ ని త‌ల‌పించే స్లైడ్ టోపీ ని పీసీ ధ‌రించింది. 241-క్యారెట్ మాగ్నస్ ఎమరాల్డ్ లాకెట్టు.. హై-నెక్ క్రీమ్ బ్లౌజ్ టైలర్డ్ ట్రౌజర్‌లో అందంగా క‌నిపిస్తోంది. టిఫనీ & కో. బ్రోచెస్ ఈ డ్రెస్ ని డిజైన్ చేసింది. గాలా థీమ్ ఆలోచ‌న అనేది చాలా కాలంగా ఉన్న‌దే అయినా ఇప్పుడు ఈ థీమ్ ని అనుస‌రించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది పీసీ. చోప్రా లుక్ క్లాసిక్ గా ఉందంటూ ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి.


ప్రియాంక చోప్రా మెట్ గాలా ఈవెంట్ త‌ర్వాత తిరిగి మ‌హేష్ తో సెట్స్ లో జాయిన్ కావాల్సి ఉంది. ఎస్.ఎస్.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీ అత్యంత భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్క‌నుంది. ఫారెస్ట్ అడ్వెంచ‌ర్ కాన్సెప్టుతో రూపొందుతున్న ఈ సినిమా సెట్స్ నుంచి కొన్ని ఫోటోలు లీకైన సంగ‌తి తెలిసిందే. వాటికి ఫ్యాన్స్ నుంచి అద్భుత స్పంద‌న వ‌చ్చింది.