మహేష్ సినిమాలో ఒడిశా నృత్యం!
ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గా ఎస్ ఎస్ ఎంబీ 29 పట్టాలెక్కిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కొద్ది భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది.
By: Tupaki Desk | 28 Jun 2025 2:11 PM ISTఇండియాస్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గా ఎస్ ఎస్ ఎంబీ 29 పట్టాలెక్కిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కొద్ది భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. దీనిలో భాగంగా హైదరాబాద్, ఒడిశా ప్రాంతాల్లో కీలక షెడ్యూల్స్ పూర్తి చేసారు. ఇందులో మహష్, పృధ్వీరాజ్ సుకుమార్, ప్రియాంక చోప్రా సహాప్రధాన తారాగణపైం కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ప్రత్యేకంగా రెండవ షెడ్యూల్ చాలా రోజుల పాటు ఒడిశా హిల్స్ పై జరిగిన సంగతి తెలిసిందే.
ఇక్కడ నుంచే మహేష్ లుక్ సహా కొన్ని సన్నివేశాలు లీకింగ్ జరిగింది. తాజాగా ఈసినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది. ఈ సినిమా కోసం ప్రియాంక చోప్రా ప్రత్యేకంగా మయూర్ భంజ్ ఛౌ అనే నృత్యాన్ని నేర్చుకుంది. ఈ నృత్యంలో ప్రసిద్ది చెందిన ఒడిశా కళాకారుడు విక్కీ భర్తయ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకుంది పీసీ. ఈ సందర్భంగా పీసీ తో ఉన్న అనుబంధాన్ని భర్తయా గుర్తు చేసుకున్నాడు.
'ప్రియాంక చోప్రాతో పనిచేయడం నిజంగా గొప్ప అనుభవం. ఆమె ఎంతో తెలివైంది. చాలా సరదాగా ఉంటుంది. తాను పెద్ద హీరోయిన్ అన్న భావన ఎక్కడా చూపించరు. డాన్సు రిహారల్స్ సమయంలో ఆమె లో ఎనర్జీ స్పూర్తిదాయం. ఈ ప్రయాణంలో నేను భాగమవ్వడం సంతోషంగా భావిస్తున్నా` అన్నారు. మయూరు భం ఛౌ అన్నది ఒడిశా రాష్ట్రంలో ప్రత్యేకమైన కళ. ఇందులో మూడు విభిన్న శైలిలు ఉంటాయి.
ఇది మయూరు భౌంజ్ చౌ జిల్లాలో ప్రసిద్ది చెందింది. ఇదొక సెమీ క్లాసికల్ నృత్య రూపం. ఇతర నృత్యాల కంటే భిన్నంగా ఉంటుంది. దీని ప్రదర్శనకు ముఖానికి ఎలాంటి ముసుగులు ధరించాల్సిన పనిలేదు. ఎంతో సహజంగా ఈ డాన్సు ఉంటుంది. పీసీ ఎంతో పర్పెక్ట్ గా ఈ డాన్సు నేర్చుకున్నట్లు మాస్టర్ తెలిపారు.
