ప్రియాంక చోప్రాతో మహేష్ రొమాన్స్!
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా- సూపర్ స్టార్ మహేష్ రొమాన్స్ కి ఛాన్స్ ఉందా? ఆ ఛాన్స్ రాజమౌళి తీసు కునే తీసుకుంటున్నాడా? అంటే అవుననే చిన్న లీక్ అందుతుంది.
By: Tupaki Desk | 20 Jun 2025 5:00 AM ISTగ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా- సూపర్ స్టార్ మహేష్ రొమాన్స్ కి ఛాన్స్ ఉందా? ఆ ఛాన్స్ రాజమౌళి తీసు కునే తీసుకుంటున్నాడా? అంటే అవుననే చిన్న లీక్ అందుతుంది. సాధారణంగా రాజమౌళి సినిమాల్లో రొమాన్స్ కనిపించదు. ఉన్నా? ఉన్నాదా? లేదా? అన్నట్లే ఉంటుంది. అంటే బాహుబలిలో ప్రభాస్-తమన్నా మధ్య చెరువు గట్టున సాగిన రొమాన్స్ లా. జక్కన్న సినిమాల్లో అశ్వీల సన్నివేశాలకు ఛాన్స్ ఇవ్వరు.
ఆయన ఫోకస్ అంతా పాత్రలు..కథపైనే పెట్టి పనిచేస్తాడు. అవసరమైతే అర గంట సినిమా నిడివి పెంచు తానంటాడు తప్ప! బోల్డ్ సన్నివేశాలు తనవల్ల కాదంటాడు. బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ ద్వారా ఆ విషయం అర్దమైంది. అంతకు ముందు తీసిన సినిమాల్లో కూడా ఎలాంటి రొమాన్స్ ఉండదు. కానీ ఎస్ ఎస్ ఎంబీ 29 లో మాత్రం హీరో-హీరోయిన్ మధ్య రొమాన్స్ డిమాండ్ చేస్తోందిట.
ఆఫ్రికన్ బ్యాక్ డ్రాప్ లో సాగే స్టోరీ కావడం.. కథ చాలా వరకూ అడవిలో సాగుతుంది. పైగా అడ్వెంచర్ థ్రిల్లర్ . సోలోగా సాగే కౌబోయ్ ప్రయాణంలో మెరుపులా తారసపడిన ప్రియాంక మధ్య పరిచయ సన్నివే శాల్లోనే కొంత రొమాన్స్ రాసినట్లు లీకులందుతున్నాయి. కథ తయారీలో రాజేంద్ర ప్రసాద్ ఇలా ఉండా లని డిజైన్ చేసారుట. పెద్దాయన అంత క్లారిటీ రాసారంటే? రాజమౌళి కూడా నో ఛాన్స్ అనే అవకాశం ఉండదు.
కన్విన్స్ అయి తీసే అవకాశం ఉంటుంది. సీన్స్ విషయంలో రాజమౌళి రాజీ పడరు. కానీ రొమాంటిక్ సన్నివేశాలంటే కాస్త తెగించి తీయాల్సి ఉంటుంది. ఈ సినిమా ద్వారా కొన్ని రూల్స్ ను రాజమౌళి బ్రేక్ చేయక తప్పేలా లేదు. ఇప్పటికే రెండు షెడ్యూళ్ల షూటింగ్ పూర్తయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం థర్డ్ షెడ్యూల్ జరుగుతుంది. తదుపరి కెన్యా పయనం ఉంటుంది.
