Begin typing your search above and press return to search.

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

ప్రియాంక చోప్రా రాజమౌళి దర్శకత్వంలోని ‘వారణాసి’తో భారతీయ సినిమాల్లోకి తిరిగి వస్తుండగా, మరోవైపు మరాఠీ చిత్రం ‘వెంటిలేటర్’ సీక్వెల్ నిర్మాణంలో భాగం కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. పదేళ్ల క్రితం తల్లి మధు చోప్రాతో కలిసి నిర్మించిన ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించేందుకు దర్శకుడు రాజేష్ మాపుస్కర్ సిద్ధమయ్యారని సమాచారం. మధు చోప్రా నిర్మాణ బాధ్యతలు చేపట్టనుండగా, ప్రియాంక ప్రమోషన్ల సమయంలో సమర్పకురాలిగా కనిపించనుందని తెలుస్తోంది.

By:  Ramesh Palla   |   7 Nov 2026 6:00 PM IST
వారణాసి చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?
X

హాలీవుడ్‌లో వరుస సినిమాలు సిరీస్‌లు చేస్తున్న ప్రియాంక చోప్రా జోనాస్‌ను టాలీవుడ్ జక్కన్న రాజమౌళి 'వారణాసి' సినిమా కోసం తీసుకు వచ్చిన విషయం తెల్సిందే. వారణాసిలో ఆ పాత్రకు ఉన్న ప్రాధాన్యత నేపథ్యంలో, రాజమౌళిపై ఉన్న నమ్మకంతో ప్రియాంక చోప్రా నటించేందుకు ఓకే చెప్పింది. వారణాసి సినిమా కమిట్ అయిన సమయంలో ప్రియాంక చోప్రా ఇక వరుసగా హిందీ సినిమాలు చేసే అవకాశం ఉందని అంతా భావించారు. ఆ సమయంలో ఒకటి రెండు హిందీ సినిమాలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఇప్పటి వరకు ప్రియాంక చోప్రా హిందీలో కొత్త సినిమా చేస్తున్న సంగతి అధికారికంగా బయటకు రాలేదు. హాలీవుడ్‌లోనే సినిమాలు, సిరీస్‌లను కంటిన్యూ చేస్తూ వస్తోంది. వారణాసి తర్వాత బాలీవుడ్‌లో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా మరిన్ని సినిమాలు నటిస్తుందా అనేది చూడాలి.

ప్రియాంక చోప్రా మరాఠీ సినిమాకు నిర్మాత...

హిందీలో, ఇతర ఇండియన్‌ భాషల్లో ఇప్పటి వరకు సినిమాలకు కమిట్‌ కాలేదు కానీ ప్రియాంక చోప్రా ఒక మరాఠి సినిమాను నిర్మించేందుకు రెడీ అవుతోంది. సరిగ్గా పదేళ్ల క్రితం ప్రియాంక చోప్రా తన తల్లి మధు చోప్రాతో కలిసి 'వెంటిలేటర్‌' అనే మరాఠీ సినిమాను నిర్మించింది. ఆ సినిమా చిన్న బడ్జెట్‌తో రూపొంది పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సమయంలో వెంటిలేటర్‌ సినిమాను అయిదు కోట్ల లోపు బడ్జెట్‌తో నిర్మించినట్లు సమాచారం. ఆ సినిమాకు ఇప్పుడు సీక్వెల్‌ చేసేందుకు దర్శకుడు రాజేష్‌ మాపుస్కర్‌ ప్లాన్‌ చేశాడు. ఇటీవల రాజేష్ మాపుస్కర్‌ చెప్పిన కథ నచ్చడంతో ప్రియాంక చోప్రా, మధు చోప్రాలు సీక్వెల్‌ను నిర్మించేందుకు రెడీ అయ్యారని తెలుస్తోంది. మధు చోప్రా ఈ మొత్తం నిర్మాణ బాధ్యత తీసుకుంటుంది. అయితే ప్రియాంక చోప్రా మాత్రం ప్రమోషన్‌ సమయంలో సమర్పకురాలిగా కనిపించబోతుంది.

హాలీవుడ్‌లో పీసీ వరుస సినిమాలు...

పదేళ్ల క్రితం ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కి పరిమితం అయింది, ఆ సమయంలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రియాంక చోప్రా నిర్మాణం అంటే కచ్చితంగా తప్పుడు నిర్ణయం అనే అభిప్రాయం ను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు హాలీవుడ్‌ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉండటంతో పాటు, అత్యంత ప్రతిష్టాత్మకమైన వారణాసి సినిమాలోనూ ప్రియాంక చోప్రా నటిస్తోంది. కనుక ఈ సమయంలో చిన్న సినిమా నిర్మాణంలో భాగస్వామిగా ఉండటం అనేది ఆమె ఇమేజ్‌ను తగ్గిస్తుందనే అభిప్రాయంను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణ బాధ్యతలు ఆమె చూసుకోకున్నా టైటిల్‌ కార్డ్‌తో అయినా నష్టం జరిగే ప్రమాదం ఉందని ఆమె అభిమానులు స్వయంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా బాలీవుడ్‌లో సినిమాలు చేయాలని కోరుకుంటూ ఉంటే ఇలా నిర్మాణం చేయడం ఏంటని మరికొందరు ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.

రాజమౌళి వారణాసి సినిమా తర్వాత....

ప్రియాంక చోప్రా ఇండియన్‌ మూవీతో సిల్వర్‌ స్క్రీన్‌ పై కనిపించి ఏడు సంవత్సరాలకు పైగానే అయింది. వారణాసితో ఆ బ్రేక్‌ కు తెర పడబోతుంది. ఇక నిర్మాతగా ప్రియాంక చోప్రా చాలా కాలం క్రితమే తప్పుకుంది. కానీ ఇప్పుడు ఆమె నిర్మాణంలో సినిమా అనే ప్రచారం మొదలైంది. గతంలో తాను నిర్మించిన సినిమా కనుక వెంటిలేటర్‌ సీక్వెల్‌ కు నిర్మాతగా ఉండాలని ప్రియాంక చోప్రా భావించడంలో తప్పేం లేదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆ మధ్య రాజమౌళి సైతం వారణాసి చేస్తూ ఒక సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించాడు. ఆ సినిమా తీవ్రంగా నిరాశ పరిచింది. ఇప్పుడు వారణాసి షూట్‌ లో ఉండగానే వెంటిలేటర్‌ 2 సినిమాను నిర్మించేందుకు రెడీ అయింది. ఇది ఎంత వరకు వర్కౌట్‌ అవుతుంది? వారణాసి సినిమాకు ఎంత వరకు ఎఫెక్ట్‌ అవుతుంది? అనే విషయాలు ఆసక్తికరంగా మారాయి.