Begin typing your search above and press return to search.

ప్రియాంక చోప్రా కాన్ఫిడెన్స్ లెవెల్ ఇది!

హాలీవుడ్ సినిమాల్లో న‌టించి గ్లోబ‌ల్ లెవెల్లో క్రేజ్‌ని సొంతం చేసుకుని గ్లోబ‌ల్ బ్యూటీగా పాపుల‌ర్ అయిన ప్రియాంక చోప్రా .. జ‌క్క‌న్న మూవీతో రీఎంట్రీ ఇవ్వ‌డానికి పెద్ద రీజ‌నే ఉంద‌ట‌.

By:  Ravindar Gorantla   |   19 Feb 2026 12:22 PM IST
ప్రియాంక చోప్రా కాన్ఫిడెన్స్ లెవెల్ ఇది!
X

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు క‌థానాయ‌కుడిగా ప్ర‌పంచ సినీ దిగ్గ‌జాలు మెచ్చిన‌ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న పాన్ వ‌ర‌ల్డ్ మూవీ `వార‌ణాసి`. గ్లోబ‌ల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా కీల‌క పాత్ర‌ల్లో మల‌యాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమార‌న్ విల‌న్‌గా, మ‌హేష్ తండ్రిగా ప్ర‌కాష్ రాజ్ న‌టిస్తున్నారు. సినిమాలోని కీల‌క ఘ‌ట్ట‌మైన రాయాయ‌ణ యుద్ధ కాండ‌లో హ‌నుమంతుడిగా మ్యాడీ మాధ‌వ‌న్ క‌నిపించ‌నున్నాడ‌ని వార్త‌లు షికారు చేస్తున్నాయి.

అయితే దీనిపై టీమ్ నుంచి ఇంత వ‌ర‌కు ఎలాంటి ప్ర‌క‌ట‌న రాలేదు. అంతే కాకుండా మ‌రి కొన్ని కీల‌క పాత్ర‌ల్లో క్రేజీ స్టార్లు కూడా న‌టించే అవ‌కాశం ఉంద‌ని, వారు ఎవ‌ర‌న్న‌ది త్వ‌ర‌లోనే జ‌క్క‌న్న అధికారికంగా ప్ర‌క‌టిస్తార‌ని ఇన్ సైడ్ టాక్‌. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. కీల‌క ఘ‌ట్టాల చిత్రీక‌ర‌ణ చేస్తున్నారు. ఇదిలా ఉంటే 2019లో వ‌చ్చిన `ది స్కై ఈజ్ పింక్‌` త‌రువాత బాలీవుడ్ సినిమాలకు గుడ్ బై చెప్పిన ప్రియాంక మ‌ళ్లీ ఇన్నేళ్ల విరామం త‌రువాత తిరిగి టాలీవుడ్ మూవీ `వార‌ణాసి`తో ఇండియ‌న్ మూవీస్‌లో రీఎంట్రీ ఇస్తోంది.

హాలీవుడ్ సినిమాల్లో న‌టించి గ్లోబ‌ల్ లెవెల్లో క్రేజ్‌ని సొంతం చేసుకుని గ్లోబ‌ల్ బ్యూటీగా పాపుల‌ర్ అయిన ప్రియాంక చోప్రా .. జ‌క్క‌న్న మూవీతో రీఎంట్రీ ఇవ్వ‌డానికి పెద్ద రీజ‌నే ఉంద‌ట‌. రీసెంట్‌గా ఓ ఇంట‌ర్నేష‌న‌ల్‌ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యలో ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్లిడించి షాక్ ఇచ్చింది. అంతే కాకుండా `వార‌ణాసి` మూవీపై కూడా త‌ను ఎంత కాన్ఫిడెంట్‌గా ఉందో స్ప‌ష్టం చేసింది. `రాజ‌మౌళికి ఉన్న విజ‌న్ ఎవ‌రికీ లేదు. ఆయ‌న‌తో వ‌ర్క్ చేయ‌డం చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. నా కెరీర్‌పై ఈ సినిమా ప్ర‌భావం ఎక్కువగా ఉంటుంద‌ని న‌మ్ముతున్నాను.

ఇప్ప‌టి వ‌ర‌కు నేను చేసిన సినిమాల‌కు ఇది పూర్తిగా విభిన్నమైన‌ది. ఇండియాలో ఉన్న అత్యుత్త‌మ ద‌ర్శ‌కుల‌లో రాజ‌మౌళి ఒక‌రు. ఆయ‌న విజ‌నే వేరు. ఆయ‌న సృష్టించే క‌థ‌లు లార్జ‌ర్‌దెన్ లైఫ్ కంటే పెద్ద‌వి. `వార‌ణాసి` నా కెరీర్‌లోనే అత్యంత నిర్ణ‌యాత్మ‌క చిత్రంగా నిలిచిపోతుంది. ఈ సినిమా రిలీజ్ కోసం నేను చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను` అంటూ చెప్పుకొచ్చింది. అంతే కాకుండా డైరెక్ట‌ర్ రాజ‌మౌళి దార్శ‌నిత‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించింది. ప్ర‌స్తుతం ప్రియాంక చెప్పిన మాట‌ల నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

ఇదిలా ఉంటే సైన్స్ ఫిక్ష‌న్‌కి మించి ఆధ్యాత్మిక‌త‌, అడ్వెంచ‌ర‌స్ అంశాల నేప‌థ్యంలో ఈ మూవీని జ‌క్క‌న్న అత్యంత ప్ర‌తిష్టాత్కంగా తెర‌కెక్కిస్తున్నారు. భార‌తీయ సినిమాల్లో న‌వ శ‌కాన్ని లిఖించ‌నున్న ఈ సినిమా రానున్న రోజుల్లో స‌రికొత్త రికార్డుల‌తో పాటు ప్ర‌పంచ వ్యాప్తంగా చ‌ర్చ‌కు తెర‌లేపుతుంద‌నే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే అంచ‌నాలు తారా స్థాయిరి చేరిన ఈ మూవీని 2027, ఏప్రిల్‌లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.