Begin typing your search above and press return to search.

30కోట్లు లేదా లాభాల్లో వాటా కోరుతున్న న‌టి!

ఇంత‌లోనే ఇప్పుడు క్రిష్ 4 కోసం ప్రియాంక చోప్రా రూ. 30 కోట్ల రెమ్యునరేషన్ డీల్ పై సంతకం చేసింద‌ని క‌థ‌నాలొస్తున్నాయి.

By:  Tupaki Desk   |   14 April 2025 5:00 AM IST
30కోట్లు లేదా లాభాల్లో వాటా కోరుతున్న న‌టి!
X

పారితోషికం ప‌రంగా నంబ‌ర్ వ‌న్ భార‌తీయ‌ క‌థానాయిక‌గా పాపుల‌రైంది ప్రియాంక చోప్రా. దీపిక ప‌దుకొనే, కంగ‌న ర‌నౌత్, ఆలియా భ‌ట్, క‌త్రిన కైఫ్ లాంటి క‌థానాయిక‌లు బాలీవుడ్ లో లీడ్ లో ఉన్నా అంద‌రినీ వెన‌క్కి నెట్టి టాప్ పొజిష‌న్ కి చేరుకుంది పీసీ. హాలీవుడ్ సినిమాల్లో న‌టించిన త‌ర్వాత త‌న పారితోషికాన్ని భారీగా పెంచేసింది. ప్ర‌స్తుతం ఎస్.ఎస్.రాజ‌మౌళి- మ‌హేష్ మూవీ కోసం ఈ బ్యూటీ భారీ మొత్తాన్ని పారితోషికంగా అందుకుంటోంద‌ని క‌థ‌నాలొచ్చాయి.

ఇంత‌లోనే ఇప్పుడు క్రిష్ 4 కోసం ప్రియాంక చోప్రా రూ. 30 కోట్ల రెమ్యునరేషన్ డీల్ పై సంతకం చేసింద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. హృతిక్ రోషన్ ఈ చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేయనుండగా అతడు కీల‌క‌మైన క్రిష్ పాత్ర‌తో పాటు మ‌రో రెండు పాత్ర‌ల్లో న‌టించ‌నున్నాడు. క్రిష్ 2లో న‌టించిన‌ ప్రియాంక చోప్రా తిరిగి త‌న పాత్ర‌తో రీఎంట్రీ ఇవ్వ‌నుంది. క్రిష్ 4 క‌థాంశం, అందులో త‌న పాత్ర‌ ఆకట్టుకోవ‌డంతో ప్రియాంక చోప్రా నో చెప్ప‌లేక‌పోయిందట‌. ప్రియాంక ప్రియ పాత్రను తిరిగి పోషిస్తుందని తెలిసింది.

అయితే ప్రియాంక చోప్రా బృందం ఇంకా దీనిని అధికారికంగా నిర్ధారించలేదు. గ్లోబల్ ఐకాన్‌ కు రూ. 20-30 కోట్ల రేంజ్ లో చెల్లిస్తున్నారని ఒక పాపుల‌ర్ న్యూస్ పోర్టల్ త‌న క‌థ‌నంలో పేర్కొంది. SSMB29 కోసం రూ. 30 కోట్లు పారితోషికం తీసుకుంటోంది. `క్రిష్ 4`కి ఇదే పారితోషికాన్ని ఆశిస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అయితే ఫిక్స్‌డ్ ఫీజు కాకుండా లాభాలలో వాటా మోడల్‌ను ప్రియాంక చోప్రా ఎంపిక చేసుకునే అవ‌కాశం ఉంద‌ని కూడా క‌థ‌నాలొస్తున్నాయి.

హృతిక్ - ప్రియాంక చోప్రా విజయవంతమైన జంట.. వారి మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ ఉంది. కోయి మిల్ గయా నుండి క్రిష్, క్రిష్ 3 .. ఇప్పుడు నాలుగో భాగంలోను పాత్రల ప్రయాణాన్ని కథలో భాగంగా కొనసాగిస్తున్నందున పీసీ క్రిష్ 4 లో చేర‌డం సులభం. ఫ్రాంచైజీని ముందుకు తీసుకెళ్లాలనే హృతిక్ రోషన్ దార్శనికతకు ప్రియాంక చోప్రా ఆకర్షితురాలైంది. అతడు దర్శకత్వం వహించే సవాల్‌ను స్వీకరించడం చూసి పీసీ ఆనందంగా ఉందని పింక్ విల్లా త‌న క‌థ‌నంలో పేర్కొంది.

యుఎస్ పర్యటనలో ఉన్న హృతిక్, ప్రియాంక- నిక్ జంట‌ను క‌లిసారు. న్యూయార్క్‌లో నిక్ జోనాస్ బ్రాడ్‌వే మ్యూజికల్ `ది లాస్ట్ ఫైవ్ ఇయర్స్‌`కు హాజరయ్యారు. స్నేహితుల‌తో స‌ర‌దాగా గ‌డిపాన‌ని, థియేటర్, సంగీతం, వినోదం, మంచి ఫుడ్ తో కూడిన అద్భుతమైన రాత్రిని ఇచ్చిన‌ పీసీకి ధన్యవాదాలు అని హృతిక్ రాసారు. ఈ స‌మావేశంలోనే క్రిష్ 4లో ఆఫ‌ర్ గురించి ప్రియాంక చోప్రాతో హృతిక్ చ‌ర్చించార‌ని గుస‌గుస వినిపిస్తోంది.

క్రిష్ 4 కి రాకేష్ రోషన్ - ఆదిత్య చోప్రా నిర్మాతలు. క్రిష్ 4 లో ప్రీతి జింతా, కంగ‌న కూడా న‌టిస్తార‌ని టాక్ వినిపించింది. నోరా ఫ‌తేహిని ఓ కీల‌క పాత్ర‌కు ఎంపిక చేసార‌ని క‌థ‌నాలొస్తున్నాయి.