జక్కన్నకు పీసీ చేసిన రిక్వెస్ట్ ఏంటీ?
రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్ వరల్డ్ మూవీ `వారణాసి`. సూపర్‌స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తుండగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది.
By: Tupaki Desk | 4 Feb 2026 12:01 PM ISTరాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్ వరల్డ్ మూవీ `వారణాసి`. సూపర్‌స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తుండగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది. తను ఏడేళ్ల విరామం తరువాత చేస్తున్న ఇండియన్ మూవీ ఇదే కావడం విశేషం. తనకు గ్లోబల్ స్టార్‌గా ఉన్న ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని జక్కన్న ఈ సినిమాకు తీసుకున్నాడనే వార్తలు షికారు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ట్రావెలర్‌గా, శ్రీరాముడిగా మహేష్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించి ఆశ్చర్యపరచబోతున్నాడు.
ఇదిలా ఉంటే ఈ ప్రాజెక్ట్‌లోకి ఎంటరవ్వడానికి ముందు ప్రియాంక చోప్రా దర్శకుడు రాజమౌళిని రిక్వెస్ట్ చేసిందట. దానికి ఒప్పుకోమని కోరిందట. కొలైడర్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రియాంక `వారణాసి` ప్రాజెక్ట్ అంగీకరించడానికి ముందు జరిగిన పలు ఆసక్తికరమైన విషయాల్ని పంచుకుంది. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ నెట్టింట వైరల్‌గా మారి మహేష్ అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. ఈ మూవీ కోసం రాజమౌళి ఫోన్ చేసినప్పుడు ప్రియాంక మాట్లాడుతూ `నేను దాదాపుగా ఆరేళ్లుగా భారతీయ సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నాను. రాజమౌళి నాకు ఫోన్ చేసి మా సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది మీరు చేయాలి` అన్నారు.
అప్పుడు నేను నాకు ఒకే ఒక అభ్యర్థన ఉంది. మీరు నాతో డ్యాన్స్ చేయిస్తారా దయచేసి? ఎందుకంటే నేను చాలా కాలంగా డ్యాన్స్ చేయలేదు` అని అడిగాను. అయ్యే నేను ఆయనను అలా అడిగి ఉండాల్సింది. ఎందుకంటే మేము ఇప్పుడు సినిమా కోసం చాలా డ్యాన్స్ చేస్తున్నాం. పాపం మహేష్..ఇదంతా నీ వల్లే..నీవల్లే నేను కూడా చేయాల్సి వస్తోంది` అంటున్నాడు` అని తెలిపింది. అంటే ప్రియాంక చోప్రా కారణంగా ఇప్పుడు మహేష్ కూడా జక్కన్నకు బుక్ అయ్యాడన్నమాట.
చాలా కాలంగా భారతీయ సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన ప్రియాంక చోప్రా `వారణాసి`తో బిగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని, ఇందులోనే తన డ్యాన్స్ టాలెంట్‌ని మరో సారి ప్రేక్షకులకు చూపించాలని కోరి మరీ డ్యాన్స్‌లు ఉండేలా ప్లాన్ చేయడం, దానికి జక్కన్న గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటే ఇందులో ప్రియాంకతో ఖచ్చితంగా ఓ క్లాసికల్ డ్యాన్స్‌ని ఓ రేంజ్‌లో ఏర్పాటు చేసి ఉంటాడని అంతా భావిస్తున్నారు. భారీ స్థాయిలో పాన్ వరల్డ్ మూవీగా రూపొందుతున్న ఈ మూవీని జక్కన్న తన గత సినిమాలకు పూర్తి భిన్నంగా సరికొత్త తరహాలో ఇండియన్ స్క్రీన్‌పై ఆవిష్కరించబోతున్నాడు.
ఓ అతీంద్రియశక్తులున్న వస్తువు కోసం టైమ్ ట్రావెల్ చేసే హీరో స్టోరీగా పురాణ, ఇతిహాసాలని లింక్ చేస్తూ తెరపై ఆవిష్కరిస్తున్నారని ఫస్ట్ ట్రైలర్‌తోనే ఫుల్ క్లారిటీ వచ్చేసింది. తాజాగా ఓ ప్రముఖ హాలీవుడ్ మీడియాకు టీమ్ ఇచ్చిన ఇంటర్వ్యూతో ఈ సినిమాపై సినీ లవర్స్‌కి పూర్తిగా స్పష్టత వచ్చేసింది. అత్యంత భారీ స్థాయిలో ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో రూపొందుతున్న ఈ సినిమాని ఏప్రిల్ 7, 2027లో భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
