Begin typing your search above and press return to search.

ప్రియాంక చోప్రా ఇండియాకి తిరిగొచ్చేస్తుందా?

ప్ర‌స్తుతం `హెడ్స్ ఆఫ్ స్టేట్`, `ది బ్ల‌ప్` చిత్రాల్లో న‌టిస్తోంది. ఈ క్ర‌మంలోనే పీసీ రెండు...మూడు సార్లు ఇండియాకు రావ‌డం జ‌రిగింది.

By:  Tupaki Desk   |   14 April 2025 11:30 AM
Is Priyanka Chopra Moving Back to India?
X

గ్లోబ‌ల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఇండియాకి తిరిగొచ్చేస్తుందా? కాపురం న్యూయార్క్ నుంచి ముంబైకి షిప్ట్ చేస్తుందా? అంటే స‌న్నివేశం చూస్తుంటే అలాగే క‌నిపిస్తుంది. హాలీవుడ్ లో పీసికి అవ‌కాశాలు తగ్గిన మాట వాస్త‌వం. పీసీ హాలీవుడ్ కెరీర్ 2021 వ‌ర‌కూ బాగానే సాగింది. ఆ త‌ర్వాతే కెరీర్ లో కుదుపులు మొద‌ల య్యాయి. 2021-24 మ‌ధ్య కేవ‌లం నాలుగు హాలీవుడ్ సినిమాలే చేసింది. అంత‌కు ముందు బిజీగా ఉన్న బ్యూటీ ఒక్క‌సారిగా స్లో అయింది.

ప్ర‌స్తుతం `హెడ్స్ ఆఫ్ స్టేట్`, `ది బ్ల‌ప్` చిత్రాల్లో న‌టిస్తోంది. ఈ క్ర‌మంలోనే పీసీ రెండు...మూడు సార్లు ఇండియాకు రావ‌డం జ‌రిగింది. సరిగ్గా ఇదే స‌మ‌యంలో ఎస్ ఎస్ ఎంబీ 29 కి సైన్ చేసింది. సూప‌ర్ స్టార్ మ‌హేష్ క‌థానాయ‌కుడిగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న చిత్రానికి పీసీ సైన్ చేయ‌డంతో ప్రాజెక్ట్ పై క్రేజ్ పేరిగింది. దీంతో గ్లోబ‌ల్ స్థాయిలో ఈ సినిమాకి ఇమేజ్ మొద‌లైంది. ఇంత వ‌ర‌కూ బాగానే ఉంది.

తాజాగా మ‌రో రెండు హిందీ సినిమాల‌కు సైన్ చేసింద‌న్న వార్త ఆస‌క్తిక‌రంగా మారింది. మ్యాడ్ డాక్ ఫిల్మ్స్ లో ఓ లేడీ ఓరియేంటెడ్ చిత్రానికి అగ్రిమెంట్ చేసుకుందిట‌. దీంతో పాటు `క్రిష్ 4` లోనూ పీసీనే హీరోయిన్ గా తీసుకున్నారు. హిందీలో పీసీ సినిమా చేయ‌డం అన్న‌ది ఐదేళ్ల త‌ర్వాత జ‌ర‌గ‌డం ఇదే తొలిసారి. హాలీవుడ్ కి వె ళ్లిన త‌ర్వాత చాలా హిందీ అవకాశాలొచ్చాయి. ఇండియాకొచ్చ‌న ప్ర‌తీసారి నిర్మాత‌లు ఆఫ‌ర్ చేసే వారు.

కానీ వాటిని అంతే సున్నితంగా తిర‌స్క‌రించి గౌర‌వాన్ని నిల‌బెట్టుకునేది. కానీ ఇప్పుడు అలాంటి తిర స్క‌ర‌ణల‌కు తావు లేకుండా వ‌చ్చిన ప్రాజెక్ట్ ను వ‌చ్చిన‌ట్లు లాక్ చేయ‌డం చూసి పీసీ మ‌ళ్లీ ముంబైకి వ‌చ్చేస్తుందా? అన్న సందేహాలు మొద‌ల‌య్యాయి. ప్ర‌స్తుతం ప్రియాంక చోప్రా ఇండియాలోనే ఉన్న‌ట్లు వార్తలొస్తున్నాయి. ఆ మ‌ద్య ఓడిశాలో షూటింగ్ ముగించుకున్న వెంట‌నే పీసీ న్యూయార్క్ వెళ్లిపోయింది. కానీ కొన్ని రోజుల‌కే మ‌ళ్లీ ముంబైకి తిరిగొచ్చింద‌ని తాజాగా వినిపిస్తుంది.