గ్లోబల్ బ్యూటీ టాలీవుడ్ ని రౌండప్ చేస్తోందా?
పీసీ భాగమైతే పాన్ వరల్డ్ మార్కెట్ లో బిజినెస్ పరంగా వర్కౌట్ అవుతుందని ఇలా ప్లాన్ చేసాడు. అందుకుగానూ అమ్మడికి భారీ గా పారితోషికం కూడా చెల్లిస్తున్నారు.
By: Tupaki Desk | 5 April 2025 12:00 PM ISTగ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా టాలీవుడ్ ని సైతం రౌండప్ చేస్తోందా? ఇక్కడా అమ్మడు స్ట్రాంగ్ కెరీర్ బిల్డ్ చేసుకునే పనిలో ఉందా? అంటే సంకేతాలు అలాగే అందుతున్నాయి. అమ్మడు ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ హీరోగా నటిస్తోన్న ఎస్ ఎస్ ఎంబీ 29లో హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వం వహిస్తోన్న చిత్రం కోసం జక్కన్న ఏరికోరి మరీ ఎంపిక చేసాడు. పీసీ కోసం న్యూయార్క్ వెళ్లి మరీ స్టోరీ చెప్పొచ్చాడు.
పీసీ భాగమైతే పాన్ వరల్డ్ మార్కెట్ లో బిజినెస్ పరంగా వర్కౌట్ అవుతుందని ఇలా ప్లాన్ చేసాడు. అందుకుగానూ అమ్మడికి భారీ గా పారితోషికం కూడా చెల్లిస్తున్నారు. ఇదే పీసీ కెరీర్ లో ఇండియా వైడ్ చూసుకుంటే తొలి హాయ్యెస్ట్ రెమ్యునరేషన్ అవుతుందని తెలుస్తోంది. ఇలా పీసీని తీసుకు రావడంతో ప్రాజెక్ట్ స్పాన్ కూడా పెరిగింది.
తాజాగా పీసీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ లీక్ అందింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-అట్లీ ప్రాజెక్ట్ కి కూడా ఈభామనే హీరోయిన్ గా తీసుకుంటున్నారు? అనే ప్రచారం బాలీవుడ్ మీడియాలో జోరందుకుంది. అట్లీ ఎలాగైనా ఈ ప్రాజెక్ట్ లో పీసీని భాగం చేయాలని ట్రై చేస్తున్నాడుట. పీసీ రెండుసార్లు ఇండియాకి వచ్చిన నేపథ్యంలో ఆమెని కలవడం జరిగిందిట. ఇటీవలే దుబాయ్ నుంచి న్యూయార్క్ కూడా వెళ్లి అమ్మడిని మీట్ అయినట్లు వార్తలొస్తున్నాయి.
ఈ విషయంలో పీసీ నుంచి కూడా అట్లీకి పాజిటివ్ గానే రెస్పాన్స్ వస్తోందిట. చూద్దాం చేద్దాం అన్నట్లు పీసీ బధులిస్తుందని టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం పీసీ హాలీవుడ్ బిజీగా ఉంది. రెండు డాక్యుమెంటరీలతో పాటు మూడు సినిమాల్లో నటిస్తోంది. ఇంత బిజీలోనూ మహేష్ సినిమాకు కమిట్ అయిందంటే కారణం పారితోషికం తో పాటు పాన్ వరల్డ్ అప్పిరియన్స్ ఉన్న సినిమా కావడంతోనే. ఇప్పుడు బన్నీకి ఒకే చెప్పాలన్నా? ఈ విషయాలన్నింటిలోనూ అట్లీ కన్విన్స్ చేయగలగాలి.
