భంగ పడిన చోటే షెభాష్ అనిపించుకున్న పీసీ!
అక్కడ నుంచి పాన్ ఇండియా..హాలీవుడ్ అంటూ ఎన్నో సక్సెస్ లు చూసింది. అయితే ప్రియాంక చోప్రా సరిగ్గా 13 ఏళ్ల వయసులో ఉండగానే అమెరికా వెళ్లింది.
By: Tupaki Desk | 19 July 2025 6:00 AM ISTబాలీవుడ్ నుంచి హాలీవుడ్ కి ఎంతో మంది హీరోయిన్లు వెళ్లారు. ఐశ్వర్యారాయ్, దీపికా పదుకొణే, కరీనా కపూర్, రాణీ ముఖర్జీ, అలియాభట్ ఇలా ఎంతో మంది భామలు హాలీవుడ్ లో సినిమాలు చేసారు. కానీ వారెవ్వరు చేరని హైట్స్ కు ప్రియాంక చోప్రా మాత్రమే చేరింది. నేడు హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా స్థానం ఏంటన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కడ వెబ్ సిరీస్ లతో పాటు స్టార్ హీరోలతో కలిసి సినిమాలు సైతం చేస్తోంది. తనకంటూ ప్రత్యేకమైన ఓఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది.
భారతీయ నటీమణులందరికంటే గొప్ప నటిగా హాలీవుడ్ లో సక్సస్ అయింది. మరి ఈ సక్సెస్ కారణం అమెరికాలో తాను ఎదుర్కొన్న అవమానాలు కూడా ఓ కారణమా? అంటే సన్నివేశం అలాగే కనిపిస్తుంది. ప్రియంక చోప్రా కుటుంబానికి ఎలాంటి సినిమా నేపథ్యంలో లేదు. ఆర్మీ కుటుంబం నుంచి అంచలం చెలుగా సినిమాల్లోకి వచ్చింది. బాలీవుడ్ లో చిన్న గా మొదలైన కెరీర్ హీరోయిన్ వరకూ తీసుకెళ్లింది.
అక్కడ నుంచి పాన్ ఇండియా..హాలీవుడ్ అంటూ ఎన్నో సక్సెస్ లు చూసింది. అయితే ప్రియాంక చోప్రా సరిగ్గా 13 ఏళ్ల వయసులో ఉండగానే అమెరికా వెళ్లింది. అక్కడ చదువుకోవాలని తల్లిదండ్రులు పంపిచారు. కానీ అమెరికా స్కూల్లో ఆ వయసులోనే జాతి వివక్షకు గురైంది. తోటి విద్యార్దులు తనని ఓ అంటరాని తనంతో చూసారు. దీంతో పాటు వాతావరణం కూడా నచ్చలేదు. అక్కడ నుంచి వెంటనే తిరిగి ఇండియాకు వచ్చేసింది. అయితే తనను తోటి వారు వింతగా చూడటం అన్నది పీసీ మనసులో ఆనాడే బలంగా నాటుకుపోయింది.
దీంతో జీవితంలో ఎదగాలని నిశ్చయించుకుని బాలీవుడ్ సినిమాల్లోకి వచ్చింది. అక్కడ నుంచి హాలీవుడ్ కి వెళ్లింది. ఇప్పుడు అదే హాలీవుడ్ పీసీని చూసి చప్పట్లు కొడుతుంది. గౌరవ మర్యాదలు ఇస్తుంది. ప్రియాంక నటనకే నేడు హాలీవుడ్ దాసోహమైంది. అయితే హాలీవుడ్ లో ఎదిగే క్రమంలో పీసీ భారతీయ విమర్శకుల నుంచి చాలా సవాళ్లే ఎదుర్కుంది. భారతీయ సంస్కృతిని మంటగలపుతోందని ఎన్నో నోళ్లు విమర్శిం చాయి. అయినా వాటి గురించి ఏనాడు పీసీ మాట్లాడింది లేదు. తన టార్గెట్ వైపే ప్రయాణం సాగించి సక్సెస్ అయింది. ప్రస్తుతం ప్రియాంక చోప్రా ఎస్ ఎస్ ఎంబీ 29 లో హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.
