గ్లామర్ రోల్స్ కంటే అలాంటివి చేయడమే ఇష్టం
బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా తన ప్రియుడు నిక్ జోనాస్ ను పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లి అక్కడే సెటిలై హాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 5 July 2025 12:06 PM ISTబాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా తన ప్రియుడు నిక్ జోనాస్ ను పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లి అక్కడే సెటిలై హాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సిరీస్‌లతో కూడా ఆకట్టుకుంటున్న ప్రియాంక రీసెంట్ గా హెడ్స్ ఆఫ్ స్టేట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి ఆ సినిమాతో మెప్పించారు. ఈ సినిమాలో ప్రియాంక ఏజెంట్ నోయల్ గా కనిపించి అందరినీ అలరించారు.
రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాంక హెడ్స్ ఆఫ్ స్టేట్ సినిమా గురించి, తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు. హెడ్స్ ఆఫ్ స్టేట్ గురించి డైరెక్టర్ ఇల్యా నైషుల్లర్ తనకు మొదటిసారి చెప్పినప్పుడే ఈ ప్రాజెక్టులో భాగమవ్వాలనుకున్నానని, ఈ యాక్షన్ మూవీకి లీడ్ రోల్ లో హీరోయిన్ ను తీసుకోవడం ముఖ్యమని డైరెక్టర్ భావించడమే తాను ఈ సినిమా చేయడానికి ప్రధాన కారణమని, ఆయన అలా అనుకున్నారు కాబట్టే తనకు ఈ సినిమా చేయాలనే కోరిక కలిగిందని ప్రియాంక చోప్రా తెలిపారు.
సాధారణంగా ఇలాంటి క్యారెక్టర్లతో ఎక్కువగా హీరోలతోనే సినిమాలు చేస్తుంటారని, హీరోలకు సమానంగా యాక్షన్ సీక్వెన్స్ ను చేసే హీరోయిన్ క్యారెక్టర్లను క్రియేట్ చేయడం ఎంతో గౌరవంగా ఉందని, ఈ జర్నీలో భాగమవడం తనకు చాలా సంతోషాన్నిచ్చిందని ఆమె తెలిపారు. ఇండస్ట్రీలో అందరూ అందానికే ప్రాధాన్యమిస్తారు కానీ తాను మాత్రం గ్లామర్ రోల్స్ కంటే యాక్షన్ పాత్రలకే ప్రాధాన్యమిస్తానని ప్రియాంక చెప్పారు.
కెరీర్ స్టార్టింగ్ నుంచే తనకు కథను నడిపించే పాత్రలపై ఎక్కువ ఆసక్తి ఉండేదని, ప్రస్తుతం దర్శకనిర్మాతలు కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమాలను కొత్తగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నారని, ఈ విషయం తనకు ఎంతో సంతోషాన్నిస్తుందని, ఫ్యూచర్ లో కూడా ఇలాంటి పాత్రలను మరిన్ని తీర్చిదిద్దాలని తాను కోరుకుంటున్నట్టు ప్రియాంక తెలిపారు.
హాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంటున్న తాను ఇండియాను, బాలీవుడ్ సినిమాలను చాలా మిస్ అవుతున్నానని, అప్పుడప్పుడు సొంత ఇంటికి దూరమయ్యాననే ఫీలింగ్ వస్తుందని ప్రియాంక అన్నారు. ఎన్ని జానర్లలో నటించినా, యాక్షన్ సినిమాలు చేయడమంటేనే తనకు ఎక్కువ ఇష్టమని, హాలీవుడ్ హీరో టామ్ క్రూజ్, అక్షయ్ కుమార్ చేసే ఎక్స్‌పెరిమెంట్స్ అంటే చాలా ఇష్టమని, అలాంటి భారీ స్థాయిలో స్టంట్స్, సాహసాలు చేసే సినిమాల్లో భాగమవ్వాలని కోరుకుంటున్నట్టు ప్రియాంక మనసులోని మాటను బయటపెట్టారు.