పీసీ మళ్లీ ఇక్కడ బిజీ బిజీ..?
ప్రస్తుతం ప్రియాంక చోప్రా నటిస్తున్న హెడ్స్ ఆఫ్ స్టేట్, ది బ్లఫ్ ప్రొడక్షన్ లో ఉండగా జడ్జిమెంట్ డే షూటింగ్ జరుపుకుంటుంది.
By: Tupaki Desk | 13 Jun 2025 8:45 AM ISTబాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ప్రియాంక చోప్రా మళ్లీ ఇండియన్ సినిమాల్లో మెరవబోతుంది. 2016 వరకు బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ వచ్చిన ప్రియాంక చోప్రా హాలీవుడ్ షిఫ్ట్ అవ్వడమే ఆలస్యం అక్కడ వరుస ఛాన్స్ లు అందుకుంటూ బిజీ అయ్యింది. ఇక నిక్ జోనస్ ని పెళ్లాడిన తర్వాత అమ్మడు పూర్తిగా అక్కడే సెటిల్ అయ్యింది. బాలీవుడ్ సినిమా ఆఫర్లు వచ్చినా సరే కాదనేంత బిజీ అయ్యింది పీసీ.
ఐతే ఎప్పుడో ఒకసారి మళ్లీ ప్రియాంక ఇండియన్ సినిమాలను ఓకే చేయదా అనుకుంటూ ఫ్యాన్స్ ఎదురుచూశారు. ఐతే ఫైనల్ గా ఎస్.ఎస్ రాజమౌళి మహేష్ కాంబో సినిమాకు ఆమె సైన్ చేసింది. జక్కన్న సినిమా ఇంటర్నేషనల్ లెవెల్ లో చేస్తున్న సంచలనాలు తెలిసిందే. అందుకే అమ్మడు వచ్చిన అవకాశాన్ని వదులుకోవాలని అనుకోలేదు. సూపర్ స్టార్ మహేష్, ప్రియాంక చోప్రా ఈ జోడీ ఆడియన్స్ కి సూపర్ ట్రీట్ అందిస్తుందని చెప్పొచ్చు.
ప్రస్తుతం ప్రియాంక చోప్రా నటిస్తున్న హెడ్స్ ఆఫ్ స్టేట్, ది బ్లఫ్ ప్రొడక్షన్ లో ఉండగా జడ్జిమెంట్ డే షూటింగ్ జరుపుకుంటుంది. ఇక తెలుగులో మహేష్ సినిమాతో పాటు హృతిక్ రోషన్ తో చేస్తున్న క్రిష్ 4 కూడా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. మొత్తానికి ఇటు ఇండియన్ సినిమాలు అటు ఇంగ్లీష్ సినిమాలతో ప్రియాంక చోప్రా బిజీ బిజీగా ఉందని చెప్పొచ్చు.
బాలీవుడ్ టాప్ స్టార్ గా ఉన్న ప్రియాంకా హాలీవుడ్ కి వెళ్లిపోయాక ఆమె తర్వాత దీపిక ఆ ప్లేస్ దక్కించుకుంది. ఐతే హాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్న టైం లో ప్రియాంకాకు ఇండియన్ సినిమా ఆఫర్లు వచ్చినా కూడా ఆమె అంతగా ఆసక్తి చూపించలేదని టాక్. ఐతే ఎప్పుడైతే రాజమౌళి సినిమా వచ్చిందో అప్పటి నుంచి మళ్లీ ఇక్కడ సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యిందట. SSMB 29 తో పాటు హృతిక్ రోషన్ తో క్రిష్ 4 కూడా చేస్తున్న ప్రియాంక ఆ రెండు సినిమాలతో మళ్లీ తన సత్తా చాటుతుందని చెప్పొచ్చు.
రాజమౌళితో చేస్తున్న సినిమా ఎలాగు ఇంటర్నేషనల్ అప్పీల్ ఉంటుంది. ఈ సినిమా ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీగా హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. ప్రియాంక చోప్రా ఈ సినిమాలో నటించడం హాలీవుడ్ లో బిజినెస్ కి బాగా వర్క్ అవుట్ అవుతుందని చెప్పొచ్చు.
