Begin typing your search above and press return to search.

SSMB 29: ఈ ఫొటోలతో ప్రాబ్లమేంటి?

అయితే బీచ్ ఒడ్డున బికీనీ, లిప్ లాక్ ఫొటోలు ఇలా అన్ని పోస్ట్ లు బోల్డ్ గా ఉన్నాయి. ఒక్కో ఫొటో ఒక్కో లెవెల్ లో ఉంది.

By:  Tupaki Desk   |   22 July 2025 10:00 PM IST
SSMB 29: ఈ ఫొటోలతో ప్రాబ్లమేంటి?
X

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఇటీవల కరీబియన్ దీవుల్లో బహమస్ లో తన 43వ పుట్టినరోజును జరుపుకుంది. ఈ వేడుకలో ఆమె భర్త నిక్ జోనస్ సైతం ఉన్నారు. బీచ్ లో తన అందాల వయ్యారాలు ఒలుకబోస్తూ ప్రియాంక కుర్రాళ్ల గుండెళ్లో హీట్ పెంచింది. బీచ్ ఒడ్డున బికీని ఫొటోల్లో రచ్చ చేసింది. మాడ్రన్ ఔట్ ఫిట్, బికీనీల్లో తనను కొట్టేవాళ్లే లేరనే రేంజ్ లో ప్రియాంక అందాల ఆరబోత చేసింది. అంతటితో ఆగకుండా భర్త నిక్ జొనాస్ తో లిప్ లాక్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఇది ఇంటర్నెట్ లో సెగలు పుట్టించింది. ఫ్యామిలీతో కలిసి ఈ ట్రిప్ ను ప్రియాంక ఫుల్ ఎంజాయ్ చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలు ఆమె ఇన్ స్టాగ్రామ్ లో పోస్టే చేసింది. అయితే బీచ్ ఒడ్డున బికీనీ, లిప్ లాక్ ఫొటోలు ఇలా అన్ని పోస్ట్ లు బోల్డ్ గా ఉన్నాయి. ఒక్కో ఫొటో ఒక్కో లెవెల్ లో ఉంది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. లక్షల్లో లైకులు, షేర్లు వచ్చాయి.

అయితే ఈ ఫొటోలకు మొత్తం పాజిటివ్ రెస్పాన్ కాకుండా నెగెటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఈ పోస్ట్ లు మిస్ ఫైర్ అవుతున్నాయి. దానికి కారణం ఆమె మహేశ్ బాబు- రాజమౌళి SSMB29లో నటించడమే. సాధారణంగా రాజమౌళి సినిమాల్లో హీరోయిన్లు దాదాపు సంప్రదాయంగానే కనిపిస్తారు. ఓవర్ ఎక్స్ పోజింగ్, ఇంటిమేషన్ సీన్లు లాంటివి ఉండవు.

అయితే ఓవైపు సినిమా షూటింగ్ నడుస్తుండగా ప్రియాంక ఇలా బోల్డ్ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడం కొంతమంది ఫ్యాన్స్ కు నచ్చడం లేదు. ఆమె ఎక్స్ పోజింగ్ చేస్తుందంటూ కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి పోస్ట్ లు రాజమౌళి సినిమా ఇమేజ్ ను దెబ్బతీస్తాయని అంటున్నారు. రాజమౌళి సర్ చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. అని ఓ నెటిజన్ అనగా, ఆమె చాలా ఎక్స్‌పోజింగ్ చేస్తోంది. ఇది సినిమాకు విరుద్ధంగా ఉండవచ్చు అని మరొక యూజర్ రాశారు.

అలాగే సౌత్ ఇండియా ఫిల్మ్ కల్చర్ ను దృష్టిలో ఉంచుకొని ఆమె ఈ సినిమా కంప్లీట్ అయ్యే దాకా లో ప్రొఫైర్ మెయింటేన్ చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, ఇంకో వర్గం ఆడియెన్స్ ఆమెను సమర్థిస్తున్నారు. ఇది ఆమె వ్యక్తిగత స్వేచ్ఛ అని, ఫ్యామిలీ ట్రిప్ ఆమె ఇష్టమని అంటున్నారు. ఆమె ప్రైవేట్ టైమ్ లో భర్తతో బీచ్‌ లో సమయం గడిపితే తప్పేముంది. అని ఒక యూజర్ అన్నారు.

మరొకరు, దక్షిణ సినీ పరిశ్రమలోకి ప్రవేశించే సెలబ్రిటీలు ఆక్కడి ప్రాంతీయ సున్నితత్వాల గురించి తెలుసుకోవాలి. అని ఆమెకు వ్యతిరేకకంగా కామెంట్ పెట్టారు. ఓవరాల్ గా ఇది ఒ కొత్త కాంట్రవర్సీకి దారి తీసింది. దీనిపై సోషల్ మీడియాలో చర్చలు కొనసాగుతున్నాయి. మరి ఈ కామెంట్స్ కు అమ్మడు ఏమైనా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.