Begin typing your search above and press return to search.

పిక్‌టాక్‌ : బర్త్‌డే పార్టీకి ఈ ముద్దుతో ముగింపు

గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా తన పుట్టిన రోజు సందర్భంగా ఫ్యామిలీతో కలిసి హాలీడే ట్రిప్‌ను ప్లాన్‌ చేసింది.

By:  Tupaki Desk   |   20 July 2025 10:00 PM IST
పిక్‌టాక్‌ : బర్త్‌డే పార్టీకి ఈ ముద్దుతో ముగింపు
X

గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా తన పుట్టిన రోజు సందర్భంగా ఫ్యామిలీతో కలిసి హాలీడే ట్రిప్‌ను ప్లాన్‌ చేసింది. ఎప్పుడూ షూటింగ్స్ అంటూ ప్రియాంక చోప్రా, ప్రోగ్రాంలు అంటూ నిక్‌ దేశ విదేశాలు తిరుగుతూ ఉంటారు. అయితే పీసీ బర్త్‌డే కావడంతో పాపతో కలిసి ఇద్దరు బీచ్‌ కి వెళ్లి ఎంజాయ్ చేశారు. దాదాపు మూడు రోజుల పాటు ప్రియాంక బర్త్‌డే ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేస్తూ వచ్చారు. ప్రియాంక చోప్రాతో పాటు నిక్‌ సైతం బర్త్‌డే పార్టీ విశేషాలను, స్పెషల్‌ మూమెంట్స్‌ను షేర్‌ చేయడం జరిగింది. ప్రియాంక చోప్రా బర్త్‌డే పార్టీ పూర్తి చేసుకున్న తర్వాత ఫైనల్‌గా మరో సెట్‌ ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా వైరల్‌ అయింది.


తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అంటూ ప్రియాంక చోప్రా పలు ఫోటోలను షేర్‌ చేసింది. అందులో తన అందాల ఆరబోత ఫోటోలతో పాటు, నిక్ ముద్దు పెడుతున్న ఫోటో కూడా ఉంది. నిక్‌, పీసీలు లిప్‌ లాక్‌ చేసుకున్న ఈ ఫోటో సోషల్‌ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించింది. వావ్‌ అంటూ అంతా కూడా చూపు తిప్పకండా చూస్తున్నారు. ఇంతకు ముందు నిక్‌ సైతం పీసీ పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు ముద్దు పెట్టుకున్న వీడియోను షేర్‌ చేశాడు. మొత్తానికి వీరి యొక్క ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. ప్రియాంక చోప్రా పుట్టిన రోజు సందర్భంగా ఇన్‌స్టాలో ఇద్దరూ చేసిన ప్రతి ఫోటో, వీడియో నెట్టింట వైరల్‌ అయింది.

ఈ ముద్దు ఫోటోలు షేర్‌ చేసిన కొన్ని గంటల్లోనే మిలియన్స్‌ లో లైక్స్‌, షేర్స్‌ వచ్చాయి. దాదాపుగా పది కోట్ల ఫాలోవర్స్‌కు చేరువగా ఉన్న ప్రియాంక చోప్రా ఈ బర్త్‌డే ఫోటోలు, వీడియోల కారణంగా మరో మిలియన్‌ ఫాలోవర్స్‌ను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్‌ సినిమాలతో బిజీగా ఉంది. ఇంగ్లీష్ సినిమాలు మాత్రమే కాకుండా వెబ్‌ సిరీస్‌లను చేయడం ద్వారా అక్కడి ప్రేక్షకులకు అభిమాన తారగా మారింది. తక్కువ సమయంలోనే హాలీవుడ్‌లో స్టార్‌డం దక్కించుకున్న ప్రియాంక చోప్రా చాలా గ్యాప్‌ తర్వాత ఇండియాలో సినిమాకు ఓకే చెప్పింది. అది కాకుండా తెలుగు సినిమాను పీసీ చేస్తున్న విషయం తెల్సిందే.

ప్రియాంక చోప్రా ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌ షూటింగ్‌ పూర్తి చేశారు. ప్రస్తుతం బర్త్‌డే పార్టీలో బిజీగా ఉన్న ప్రియాంక చోప్రా వచ్చే నెల నుంచి మరో సారి ఈ సినిమా షూటింగ్‌ కోసం ఇండియాకు పీసీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. బాక్సాఫీస్‌ వద్ద బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ విజయాలను అందించిన రాజమౌళి దర్శకత్వంలో అనగానే ప్రియాంక చోప్రా మరో ఆలోచన లేకుండా ఓకే చెప్పిందట. ఈ సినిమాకు గాను ప్రియాంక చోప్రా తీసుకుంటున్న పారితోషికం ఇప్పటి వరకు ఏ ఇండియన్‌ హీరోయిన్‌ తీసుకోని స్థాయిలో అందుకుంటుంది అంటూ వార్తలు వస్తున్నాయి.