Begin typing your search above and press return to search.

ఇన్నాళ్లకు బయటపడ్డ ప్రియాంక చోప్రా బ్యూటీ సీక్రెట్.. అసలు విషయం చెప్పిన తల్లి!

ఇకపోతే ఈ ఫేస్ ప్యాక్ ను ఎలా తయారు చేయాలి అనే విషయానికి వస్తే.. ముందుగా ఒక శుభ్రమైన గిన్నె తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల శనగపిండిని తీసుకోవాలి.

By:  Tupaki Desk   |   10 April 2026 9:30 AM IST
ఇన్నాళ్లకు బయటపడ్డ ప్రియాంక చోప్రా బ్యూటీ సీక్రెట్.. అసలు విషయం చెప్పిన తల్లి!
X

మాజీ విశ్వసుందరి, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం అభినయంతో ఎంతోమందిని ఆకట్టుకుంటూ నేడు ప్రపంచ స్థాయి గుర్తింపును సొంతం చేసుకున్న ఈ బ్యూటీ.. 43 సంవత్సరాల వయసులో కూడా అంతే అందంగా.. యవ్వనంగా కనిపిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది. మరి ఈ గ్లోబల్ స్టార్ బ్యూటీ సీక్రెట్ ఏంటి? అసలు ఇంత అందంగా ఉండడానికి ఆమె ఏం ఉపయోగిస్తుంది? అంటూ అభిమానులు సైతం తెలుసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు.. మరి ప్రియాంక చోప్రా బ్యూటీ సీక్రెట్ ను ఆమె తల్లి మధు చోప్రా రివీల్ చేశారు.

ప్రియాంక బ్యూటీ సీక్రెట్ రివీల్ చేసిన తల్లి మధు..

ప్రియాంక చోప్రా తల్లి డాక్టర్ మధు చోప్రా మాట్లాడుతూ.." నేను , నా కూతురు దశాబ్దాలుగా భారతదేశ చర్మ సంరక్షణలో భాగంగా అత్యంత ప్రావీణ్యం పొందిన శనగపిండి, పసుపు ఫేస్ ప్యాక్ ను ఉపయోగిస్తాము. ఇది చాలా బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా పసుపు , శనగపిండి , కొద్దిగా పాలను కలిపి ముఖానికి అప్లై చేసుకున్నట్లయితే ఈ ఫేస్ ప్యాక్ ముఖాన్ని శుభ్రపరుస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. అలాగే మొటిమలు , చర్మంపై ఉండే నలుపుదనం, నిర్జీవమైన ముఖం వంటి సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి.. ముఖ్యంగా చర్మాన్ని తిరిగి రిపేర్ చేయడంలో ఈ ఫేస్ ప్యాక్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నిత్యం కఠినమైన రసాయనాలు కలిగిన ఫేస్ క్రీమ్స్ వల్ల చర్మం ఎంతో ఇబ్బందికి గురవుతుంది. ఇక దాని నుంచి విముక్తి పొందాలి అంటే ఈ ఫేస్ ప్యాక్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది అంటూ ప్రియాంక చోప్రా తల్లి చెప్పుకొచ్చింది.

ఫేస్ ప్యాక్ తయారు చేయడం ఎలా?

ఇకపోతే ఈ ఫేస్ ప్యాక్ ను ఎలా తయారు చేయాలి అనే విషయానికి వస్తే.. ముందుగా ఒక శుభ్రమైన గిన్నె తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల శనగపిండిని తీసుకోవాలి. ఇక ఇందులోకి ఇంట్లో తయారు చేసిన పాలమీగడను కొద్దిగా కలపాలి. అలాగే ఒక చెంచా తాజా పెరుగులో పావు చెంచా పసుపు, చల్లని పాలు వేసి కలపాలి. ఈ పదార్థాలు అన్నింటిని బాగా కలిపి ఈ పేస్టును వారానికి రెండుసార్లు ముఖానికి అప్లై చేయాలి.. ముఖ్యంగా కళ్ళ కింది భాగాన్ని వదిలేసి.. ముఖానికి ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేయాలి.. ఒక 15 నిమిషాల తర్వాత శుభ్రమైన నీటితో చర్మాన్ని కడిగేయాలి.. ఇలా చేయడం వల్ల అందమైన ముఖం మీ సొంతం అవుతుంది. ఇకపోతే పసుపు అన్ని చర్మాల వారికి సరిపోదు కాబట్టి వైద్యుల సలహా మేరకు ఇలాంటి ఫేస్ ప్యాక్స్ ఉపయోగించడం మంచిది.

ప్రియాంక చోప్రా తదుపరి చిత్రాలు..

ప్రియాంక చోప్రా సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈమె ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో .. మహేష్ బాబు హీరోగా వస్తున్న వారణాసి సినిమాలో నటిస్తోంది.. ఇందులో మందాకిని అనే పవర్ఫుల్ పాత్ర పోషిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.