Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: బికినీలో అగ్గి రాజేసిన పీసీ

అమెరికా కోడ‌లు ప్రియాంక చోప్రా ఏం చేసినా అది ప్ర‌త్యేకంగా ఉంటుంది. ఇప్పుడు భ‌ర్త నిక్ జోనాస్, మాల్తీ మేరీతో క‌లిసి విహార యాత్ర‌ను ఆస్వాధిస్తోంది పీసీ.

By:  Tupaki Desk   |   20 July 2025 5:00 PM IST
ఫోటో స్టోరి: బికినీలో అగ్గి రాజేసిన పీసీ
X

అమెరికా కోడ‌లు ప్రియాంక చోప్రా ఏం చేసినా అది ప్ర‌త్యేకంగా ఉంటుంది. ఇప్పుడు భ‌ర్త నిక్ జోనాస్, మాల్తీ మేరీతో క‌లిసి విహార యాత్ర‌ను ఆస్వాధిస్తోంది పీసీ. బికినీ బీచ్ సెల‌బ్రేష‌న్స్ లో పీసీని కొట్టేవాళ్లే లేరని ప్రూవ్ చేస్తూ.. మ‌రోసారి చెల‌రేగిపోయింది. జూలై 18న‌ తన 43వ పుట్టినరోజును బీచ్‌లో తనకు అత్యంత ఇష్ట‌మైన కుటుంబ స‌భ్యుల‌తో జ‌రుపుకుంది. బీచ్ సెల‌బ్రేష‌న్స్ నుంచి కొన్ని స్పెష‌ల్ ఫోటోగ్రాఫ్స్ ని ఇన్ స్టాలో షేర్ చేయ‌గా అవి వైర‌ల్ గా మారుతున్నాయి.

ఇన్ స్టాలో దేశీ గాళ్ ప్రియాంక చోప్రా బికినీ ఫోటోలతో అగ్గి రాజేసింది. ఈ ఫోటోగ్రాఫ్స్ లో నిక్ జోనాస్, కుమార్తె మాల్తీ మేరీ కూడా క‌నిపిస్తున్నారు. పుట్టినరోజు పోస్ట్‌లో పీసీ విహారయాత్ర నుండి ప్రత్యేక మూవ్ మెంట్స్ కి సంబంధించిన‌ వీడియో మాంటేజ్ ఆక‌ట్టుకుంది. పసుపు రంగు బికినీలో ప్రియాంక జాలీ మూడ్ లో ఉన్న క్లిప్స్‌, నిక్‌తో రొమాంటిక్ ఫోజులు, బేబీ మాల్తీతో విహారం ఆక‌ర్షిస్తోంది. నిక్ ప‌ర్ఫెక్ట్ ఫ్యామిలీమ్యాన్ లా క‌నిపిస్తున్నాడు.

తన కుటుంబాన్ని తన గొప్ప బహుమతిగా పేర్కొన్న పీసీ త‌న భ‌ర్త నిక్ జోనాస్ ని చుంబిస్తూ క‌నిపించింది. ర‌క‌ర‌కాల బికినీల్లో పీసీ ఫోజులు ఇప్పుడు ఇంట‌ర్నెట్ లో హాట్ టాపిగ్గా మారాయి. కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే....ప్రియాంక చివరిగా హెడ్స్ ఆఫ్ స్టేట్‌లో కనిపించింది. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియో యాక్షన్ కామెడీ.. దీనిలో జాన్ సెనా, ఇద్రిస్ ఎల్బాతో కలిసి నటించింది. ఈ చిత్రంలో MI6 ఏజెంట్ నోయెల్ బిస్సెట్ పాత్రను పోషించింది. ప్ర‌పంచంపై కుట్ర‌ను భ‌గ్నం చేసే ఆఫీస‌ర్ పాత్ర‌లో పీసీ న‌టించింది.