టాప్ హీరోయిన్‌పై కక్ష కట్టిన హీరోల భార్యలు
అయితే ప్రియాంక చోప్రాకు కేవలం షారూఖ్ ఖాన్ భార్య మాత్రమే శత్రువు కాదు. ఇప్పుడు మరో ప్రముఖ హీరో అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా కూడా శత్రువు అనే విషయం బయటపడింది.
By: Tupaki Desk | 10 July 2025 7:00 AM ISTహీరోయిన్ తో మ్యారీడ్ హీరో చనువుగా ఉంటే, ముప్పు ఆ ఇద్దరిలో ఎవరికి? అంటే.. కచ్ఛితంగా చనువుగా ఉన్న ఆ హీరోయిన్‌కే. అలాంటి వైరం కారణంగానే ఈ బాలీవుడ్ టాప్ హీరోయిన్ ఇండస్ట్రీలో అవకాశాలు కోల్పోయింది. సదరు హీరోగారి భార్యామణి తనకు అవకాశాలు రాకుండా ప్రముఖ దర్శకనిర్మాతలను ప్రభావితం చేసిందని కథనాలొచ్చాయి.
ఈ ఎపిసోడ్ లో టాప్ హీరోయిన్ మరెవరో కాదు.. గ్లోబల్ ఐకాన్ గా ప్రియాంక చోప్రా. కింగ్ ఖాన్ షారూఖ్ తో ప్రియాంక చోప్రా ఎఫైర్ సాగించిందని అప్పట్లో చాలా కథనాలు వైరల్ అయ్యాయి. ఆ సమయంలో షారూఖ్ భార్య గౌరీ ఖాన్ చాలా అభధ్రతకు లోనయ్యారని కథనాలొచ్చాయి. అంతేకాదు ఆ తర్వాత ప్రియాంక చోప్రాకు అవకాశాలు రాకుండా నిలువరించారని, కరణ్ జోహార్ సహా ప్రముఖ దర్శకనిర్మాతలను ప్రభావితం చేసారని కూడా గుసగుసలు వినిపించాయి. ఒకానొక సమయంలో తనను బాలీవుడ్ అనధికారికంగా నిషేధించిందని, తనపై కుట్రలు చేసారని కూడా ప్రియాంక చోప్రా బహిరంగంగా వ్యాఖ్యానించారు.
అయితే ప్రియాంక చోప్రాకు కేవలం షారూఖ్ ఖాన్ భార్య మాత్రమే శత్రువు కాదు. ఇప్పుడు మరో ప్రముఖ హీరో అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా కూడా శత్రువు అనే విషయం బయటపడింది. ఓ ఇంటర్వ్యూలో అక్షయ్ కుమార్ తో పది సినిమాలు తెరకెక్కించిన దర్శన్ బాలీవుడ్ హంగామాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా తో సమస్య ఏర్పడిందని తెలిపాడు. ప్రియాంక చోప్రాతో అక్షయ్ కలిసి పనిచేయడం వల్ల తనకు సమస్యలు తలెత్తాయని వెల్లడించాడు. ట్వింకిల్ కు ప్రియాంకతో కొన్ని సమస్యలు ఉండేవని అన్నాడు. ఈ వృత్తిలో కొన్ని సవాళ్లు ఉంటాయి. కొన్నిసార్లు సాన్నిహిత్యం చిక్కులు తెస్తుంది. మీడియా రెగ్యులర్ గా దర్శకనిర్మాతలకు ఎదురయ్యే నష్టాన్ని గ్రహించకుండా అతిశయోక్తి చేస్తుంది అని దర్శన్ వివరించారు.
