Begin typing your search above and press return to search.

వీడియో : ఫ్యామిలీతో పీసీ 43వ బర్త్‌డే

గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా నేడు తన 43వ బర్త్‌డే జరుపుకుంటుంది. సాధారణంగానే ప్రియాంక చోప్రా తన భర్త నిక్‌ తో లైఫ్‌ ను ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.

By:  Tupaki Desk   |   18 July 2025 3:00 PM IST
వీడియో : ఫ్యామిలీతో పీసీ 43వ బర్త్‌డే
X

గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా నేడు తన 43వ బర్త్‌డే జరుపుకుంటుంది. సాధారణంగానే ప్రియాంక చోప్రా తన భర్త నిక్‌ తో లైఫ్‌ ను ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇక బర్త్‌డే స్పెషల్‌ డే రోజు ఏ స్థాయిలో వారి పార్టీ ఉంటుంది, వారు ఎలా చిల్‌ అవుతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్న ప్రియాంక చోప్రా తన పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక వీడియోను షేర్‌ చేసింది. పుట్టిన రోజు సందర్భంగా భర్త నిక్‌తో పాటు కూతురుతో కలిసి సముద్రం మధ్యలో, బీచ్‌లో, రెస్టారెంట్‌లో చేసిన ఎంజాయ్‌మెంట్‌కు సంబంధించిన పోటోలను వీడియో రూపంలో షేర్ చేసింది. అంతే కాకుండా తన భర్త నిక్‌ ఎలా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు అనేది కూడా ఈ వీడియోలో చూపించింది.

అందమైన ప్రియాంక చోప్రా అంతకు మించిన అందమైన ఫ్యామిలీని కలిగి ఉంది. నిక్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న అమెరికన్‌ సింగర్‌ అనే విషయం తెల్సిందే. ప్రియాంక చోప్రా కంటే దాదాపు పదేళ్లు వయసులో చిన్నవాడు అయినప్పటికీ నిక్‌ ఆమెతో చాలా ప్రేమగా ఉంటాడు. ఇద్దరి అన్యోన్యం గురించి మరింత తెలియాలంటే ఈ వీడియోను చూస్తే అర్థం అవుతుంది. వీరిద్దరూ తమ కూతురు పై చూపించే ప్రేమ సైతం ఈ వీడియోలో చూడవచ్చు. ఇద్దరూ చాలా సంరక్షిస్తూ పాపపై ప్రేమ చూపిస్తూ ఉంటారు. ప్రియాంక చోప్రా పుట్టిన రోజు సందర్భంగా షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

ప్రియాంక చోప్రా తన బర్త్‌డే స్పెషల్‌ వీడియోను షేర్‌ చేయగా రామ్‌ చరణ్ భార్య ఉపాసన హ్యాపీ బర్త్‌డే అంటూ కామెంట్‌ చేశారు. ఇంకా వేలాది మంది ప్రియాంక చోప్రాకు హ్యాపీ బర్త్‌డే అంటూ కామెంట్స్ చేశారు. వీడియో షేర్‌ చేసిన కొన్ని గంటల్లోనే ఏకంగా మిలియన్ రియాక్షన్స్‌ను దక్కించుకుంది. లక్షల లైక్స్‌ను సొంతం చేసుకున్న ప్రియాంక చోప్రా తన సోషల్ మీడియా ఆదిపత్యం ను కొనసాగించింది. నిక్‌ ఫ్యాన్స్‌ సైతం ప్రియాంక చోప్రాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పేందుకు ఈ వీడియో కింద తెగ కామెంట్స్ చేశారు. ప్రియాంక చోప్రా ప్రస్తుతం తెలుగు సినిమాలో నటిస్తున్న నేపథ్యంలో ఆమెకు చాలా మంది తెలుగు ప్రేక్షకులు శుభాకాంక్షలు తెలియజేశారు.

గత కొంత కాలంగా పూర్తిగా హాలీవుడ్‌కి పరిమితం అయిన ప్రియాంక చోప్రా ఎట్టకేలకు ఇండియన్ సినిమాకు ఓకే చెప్పింది. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న మహేష్ బాబు సినిమాలో ప్రియాంక చోప్రా నటిస్తున్న విషయం తెల్సిందే. హాలీవుడ్‌ స్థాయిలో రాజమౌళి కి ఉన్న క్రేజ్‌ నేపథ్యంలో ప్రియాంక చోప్రా ఈ సినిమాకి ఓకే చెప్పిందని తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని షెడ్యూల్స్ పూర్తి అయ్యాయి. త్వరలోనే సినిమా కొత్త షెడ్యూల్‌లో ప్రియాంక చోప్రా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ప్రియాంక చోప్రా బర్త్‌డే సందర్భంగా రాజమౌళి ఏదైనా అప్‌డేట్‌ ఇస్తాడని అభిమానులు చాలా ఆశించారు. కానీ ఆయన మాత్రం పీసీ అభిమానులకు నిరాశ మిగిల్చాడు.