Begin typing your search above and press return to search.

ఆ మూవీ నా కెరీర్లోనే స్పెష‌ల్

ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్ర‌ముఖ న‌టి ప్రియ‌మ‌ణి కీల‌క పాత్ర పోషిస్తున్నారు. తాజాగా జ‌న నాయ‌గ‌న్ సినిమాలో భాగ‌మ‌వ‌డంపై ప్రియ‌మ‌ణి త‌న ఆనందాన్ని వ్య‌క్తం చేశారు.

By:  Tupaki Desk   |   4 July 2025 5:00 PM IST
ఆ మూవీ నా కెరీర్లోనే స్పెష‌ల్
X

కోలీవుడ్ స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్ ప్ర‌స్తుతం జ‌న నాయ‌గ‌న్ అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. విజ‌య్ పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి వెళ్లే ముందు చేయ‌బోతున్న సినిమా కావ‌డంతో జ‌న నాయ‌గ‌న్ పై అంద‌రికీ భారీ అంచ‌నాలున్నాయి. హెచ్‌. వినోద్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో మంచి హిట్ అందుకుని ఆ త‌ర్వాత రాజ‌కీయాల‌పై ఫుల్ ఫోక‌స్ చేయాల‌ని చూస్తున్నారు విజయ్.

జ‌న నాయ‌గ‌న్ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా న‌టిస్తున్నారు. గ‌తంలో విజ‌య్ తో క‌లిసి పూజా బీస్ట్ సినిమాలో న‌టించ‌గా ఇప్పుడు మ‌రోసారి జ‌న నాయ‌గ‌న్ లో న‌టిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్ర‌ముఖ న‌టి ప్రియ‌మ‌ణి కీల‌క పాత్ర పోషిస్తున్నారు. తాజాగా జ‌న నాయ‌గ‌న్ సినిమాలో భాగ‌మ‌వ‌డంపై ప్రియ‌మ‌ణి త‌న ఆనందాన్ని వ్య‌క్తం చేశారు.

జ‌న నాయ‌గ‌న్ సినిమాలో విజ‌య్ తో క‌లిసి స్క్రీన్ షేర్ చేసుకోవ‌డం చాలా సంతోషంగా ఉంద‌ని చెప్పిన ప్రియ‌మ‌ణి, ఈ సినిమా త‌న కెరీర్లో చాలా స్పెష‌ల్ మూవీ అని, జ‌న నాయ‌గ‌న్ లో త‌న పాత్ర చాలా కొత్త‌గా ఉంటుంద‌ని, ఈ సినిమా న‌టిగా త‌న‌లోని కొత్త యాంగిల్ ను చూపిస్తుంద‌ని ఆమె రీసెంట్ గా ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపారు. దీంతో ఈ సినిమాపై అంచ‌నాలు పెర‌గ‌డంతో పాటూ ఆమె చేసిన వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

ఎంతో ప‌వ‌ర్‌ఫుల్ క‌థ‌తో మ‌రిన్ని అద్భుత‌మైన పెర్ఫార్మెన్సుల‌తో తెర‌కెక్కుతున్న జ‌న నాయ‌గ‌న్ లో ప్రేమ‌లు ఫేమ్ మ‌మిత బైజు కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ రోర్ పేరిట గ్లింప్స్ రిలీజ‌వ‌గా, ఆ వీడియోకు ఆడియ‌న్స్ నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ సినిమాకు అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతం అందిస్తుండ‌గా, ఈ సినిమా టాలీవుడ్ మూవీ భ‌గ‌వంత్ కేస‌రికి రీమేక్ అని వార్త‌లు వినిపిస్తున్నాయి.