Begin typing your search above and press return to search.

స్టార్ హీరోపై వింక్ బ్యూటీ విపులంగా!

తాజాగా అజిత్ తో ఆన్ సెట్స్ అనుభ‌వాల‌ను ప్రియా వారియ‌ర్ పంచుకుంది. ఆవేంటో ఆమె మాట‌ల్లోనే..

By:  Tupaki Desk   |   11 April 2025 10:09 AM
స్టార్ హీరోపై వింక్ బ్యూటీ విపులంగా!
X

త‌ల అజిత్ క‌థానాయ‌కుడిగా న‌టించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' థియేట‌ర్ల‌లో స‌క్సెస్ పుల్ గా దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. యాక్ష‌న్ ప్రియుల్ని ఈ చిత్రం అల‌రిస్తుంది. త్రిష‌, ప్రియా వారియ‌ర్ అందాలు సైతం అంతే ఆక‌ట్టుకుంటున్నాయి. తాజాగా అజిత్ తో ఆన్ సెట్స్ అనుభ‌వాల‌ను ప్రియా వారియ‌ర్ పంచుకుంది. ఆవేంటో ఆమె మాట‌ల్లోనే..'మొద‌టి రోజు నుంచి చివ‌రి రోజు వ‌ర‌కూ మీరు న‌న్ను చూసిన విధానం ఎంతో అద్భుతంగా ఉంది.

షూటింగ్ కార‌ణంగా కుటుంబానికి దూరంగా ఉన్నా? ఆ పెయిన్ ఎక్క‌డా క‌ల‌గ‌కుండా చేసారు. సెట్ లో ప్ర‌తీక్ష‌ణం ఎంతో గొప్ప‌గా ఉండేది. మీరు నా ప‌ట్ల చూపించి ప్రేమ‌, ఆప్యాయ‌త‌ల‌కు ఫిదా అయిపోయాను. ఓ పెద్ద స్టార్ అయినా ఎంతో నిరాడంబ‌రంగా ఉంటారు. సెట్ లో ప్ర‌తీ ఒక్క‌రిని మీరు గ‌మ‌నించే తీరు అద్భుతం. అంద‌రిని ఎంతో గొప్పగా గౌర‌విస్తారు. మీరు ఓ డైమండ్ లాంటి వారు.

జీవితంలో ఎన్నో ఎత్తు ప‌ల్లాలు చూసాను. ఆ అనుభ‌వాల నుంచి స్థిర‌త్వంగా ఉండ‌టం నేర్చుకున్నాను. నా కెరీర్ లో ఇప్పటివరకు అత్యంత ఇష్టమైన క్షణం ఏమిటంటే? స్థిర‌త్వాన్ని అల‌వాటు చేసుకోవ‌డం ఒక‌టైతే? మీతో ఉన్న ఆ కొన్ని రోజులు కూడా ఎప్ప‌టికీ గుర్తుండిపోతాయి. మీతో ప‌నిచేయ‌డం గొప్ప అదృ ష్టంగా భావిస్తున్నాను. మీతో మ‌ళ్లీ మ‌ళ్లీ ప‌నిచేయాల‌ని కోరుకుంటున్నాను.

ప్రేమ‌, గౌర‌వంతో మీ వీరాభిమాని` అని ముగించింది. ప్ర‌స్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైర‌ల్ గా మారింది. ప్రియా వారియ‌ర్ సోష‌ల్ మీడియాలో ఫేమ‌స్ అవ్వ‌డంతో హీరోయిన్ గా మారిన సంగ‌తి తెలిసిందే. ఒక్క క‌న్ను గీటుతో వింక్ బ్యూటీ ఇండియానే ఊపేసింది. తెలుగులో కూడా న‌టించిన సంగ‌తి తెలిసిందే.