పిక్‌టాక్ : వింక్ బ్యూటీ కిల్లింగ్ షో
ప్రియా ప్రకాష్ వారియర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ అమ్మడి అందాల ఆరబోత ఫోటోలు సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా వైరల్ అవుతూ ఉంటాయి.
By: Tupaki Desk | 16 Jun 2025 9:57 AM ISTప్రియా ప్రకాష్ వారియర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ అమ్మడి అందాల ఆరబోత ఫోటోలు సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా వైరల్ అవుతూ ఉంటాయి. కొన్నాళ్ల క్రితం ఈ అమ్మడు ఒరు అదార్ లవ్ సినిమాలో చిన్న పాత్రలో నటించినప్పటికీ అందులోని కన్ను గీటే సీన్, ముద్దు గన్ పేల్చిన సీన్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి. రెండు మూడు నెలల పాటు ఆ వీడియోలు సోషల్ మీడియాలో ప్రముఖంగా వైరల్ అయ్యాయి. ఆ తర్వాత కూడా ప్రియా ప్రకాష్ వారియర్ గురించి తెలుసుకునేందుకు జనం ఆసక్తి చూపించారు. ఆ వీడియోలను నెటిజన్స్ ఎవరికి తోచిన విధంగా వారు వాడేయడంతో ప్రియా ప్రకాష్ వారియర్‌కి బాలీవుడ్ హీరోయిన్స్ రేంజ్‌లో గుర్తింపు దక్కింది.
సినిమా వారు మాత్రమే కాకుండా రాజకీయ నాయకులు సైతం ఈమె గురించి మాట్లాడుకునే విధంగా ట్రెండ్ అయింది. ఈ వింక్ బ్యూటీ ఆ తర్వాత సినిమాల్లో స్టార్‌గా ఎదుగుతుందని అంతా భావించారు. కానీ ఆమెకు నిరాశ మిగిలింది. వింక్ బ్యూటీ ఇమేజ్ ఈమెకు చాలానే ఆఫర్లు తెచ్చి పెట్టింది. కానీ ఆ ఆఫర్లు ఈ అమ్మడికి అదృష్టంను తెచ్చి పెట్టలేదు, సక్సెస్ లు దక్కక పోవడంతో ఎక్కువగా ఆఫర్లు రాలేదు. వచ్చిన చిన్నా చితకా ఆఫర్లతో ఈ అమ్మడు ఇండస్ట్రీలో కొనసాగుతోంది. అయితే సోషల్ మీడియాలో తనకున్న ఫాలోయింగ్‌ను కాపాడుకునేందుకు ఇలాంటి అందమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ వస్తోంది.
ప్రియా ప్రకాష్ ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపుగా 8 మిలియన్‌ల ఫాలోవర్స్‌ను కలిగి ఉంది. తన ఫాలోవర్స్ కోసం రెగ్యులర్‌గా వింక్ బ్యూటీ తన అందమైన ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ వచ్చింది. తాజాగా మరోసారి తన అందమైన స్టైలిష్ ఫోటోలను షేర్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆకట్టుకునే అందంతో పాటు, స్టైలిష్ లుక్‌లో ఈ అమ్మడు కన్నుల విందు చేయడంతో ఆమె ఫాలోవర్స్ తెగ లైక్ కొడుతూ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారు. ఫోటోలు, వీడియోలను షేర్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించే ప్రియా ప్రకాష్ వారియర్ ఈ సారి అంతకు మించి అన్నట్లుగా అందాల విందు చేయడంతో ఫోటోలు షేర్ చేసిన కొన్ని గంటల్లోనే అత్యధిక రీచ్‌ను సొంతం చేసుకుంది.
విభిన్నమైన వైట్ కలర్ బ్లేజర్‌ను ధరించి ఈ అమ్మడు కిల్లింగ్ లుక్‌తో చంపేస్తుంది అంటూ అభిమానులు నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ అమ్మడు షేర్ చేస్తున్న ఫోటోలు ఎప్పుడూ వైరల్ అవుతూ ఉంటాయి. అయితే ఈసారి అంతకు మించి అన్నట్లుగా స్కిన్ షో చేయడం ద్వారా చూపు తిప్పుకోనివ్వడం లేదు అంటూ అభిమానులు అంటున్నారు. ఈ స్థాయి స్కిన్ షో చేసి, అందంగా కనిపిస్తున్నా పాపం ప్రియా ప్రకాష్ వారియర్‌కి ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాకపోవడం విచారకరం అంటూ అభిమానులతో పాటు అంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వరకే ఈమె అందం పరిమితం కావడం దారుణం అంటూ కొందరు అంటున్నారు. ముందు ముందు అయినా ప్రియా ప్రకాష్ వారియర్ సోషల్ మీడియాలో స్టార్‌డం దక్కించుకుంటుందేమో చూడాలి.
