Begin typing your search above and press return to search.

పిక్‌టాక్ : బీచ్‌లో అందాల వింక్‌ బ్యూటీ షో

సోషల్‌ మీడియా ద్వారా వచ్చిన గుర్తింపుతో ఈ అమ్మడు ఒక మోస్తరు సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకున్నా అవి పెద్దగా ఈ అమ్మడి కెరీర్‌ను నిలబెట్టలేక పోయాయి.

By:  Tupaki Desk   |   9 Jun 2025 9:59 AM IST
పిక్‌టాక్ : బీచ్‌లో అందాల వింక్‌ బ్యూటీ షో
X

మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్‌ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. గత ఐదు ఏళ్లుగా ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతూనే ఉంది. ఒరు ఆదార్ లవ్‌ సినిమాలో ఈ అమ్మడు పేల్చిన ముద్దు గన్‌ కుర్రాళ్ల గుండెల్లో తూట్లు పొడిచింది. ఇక ఈ అమ్మడు కొంటెగా కన్ను గీటడంతో ఆ భాష.. ఈ భాష అని తేడా లేకుండా ప్రతి ఒక్క భాషకు చెందిన కుర్రాళ్లు గిలగిల కొట్టుకున్నారు. అందాల ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్ వారియర్‌ ఆ రెండు పనులతో ఒక్కసారిగా ఫేమస్ అయింది. దాంతో సినిమాల్లో ఆఫర్లు కూడా వచ్చాయి. కానీ ప్రియా ప్రకాష్ వారియర్‌కి ఆశించిన స్థాయిలో సక్సెస్‌ లు దక్కలేదు. దాంతో ఆఫర్లు సైతం ఎక్కువ రాలేదు.


సోషల్‌ మీడియా ద్వారా వచ్చిన గుర్తింపుతో ఈ అమ్మడు ఒక మోస్తరు సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకున్నా అవి పెద్దగా ఈ అమ్మడి కెరీర్‌ను నిలబెట్టలేక పోయాయి. అయినా కూడా ఈ అమ్మడు ఇండస్ట్రీలో కొనసాగడంకు కారణం సోషల్‌ మీడియాలో ఈమె షేర్‌ చేసే ఫోటోలు, వీడియోలు అనడంలో సందేహం లేదు. హీరోయిన్‌గా ప్రియా ప్రకాష్ వారియర్‌ను సినిమాల్లో చూడటం కంటే ఇలా ఇన్‌స్టాగ్రామ్‌లో అందాల ఆరబోత ఫోటోల్లో చూడటం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. తాజాగా ఈమె బీచ్ ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. బీచ్‌లో అందాలు ఆరబోస్తున్న ఈ అమ్మడు ఆకట్టుకుంది.


సాధారణంగానే ముద్దుగుమ్మలు బీచ్‌లో అందంగా కనిపిస్తూ ఉంటారు. అలాంటిది ప్రియా ప్రకాష్ వారియర్‌ మినీ స్కర్ట్‌ ధరించి, ఒక మోస్తరు బికినీ మాదిరిగా ఉన్న ఔట్‌ ఫిట్‌లో చూపరులను అలరించింది. ఆకట్టుకునే అందంతో పాటు, ముద్దుగుమ్మ స్టైలిష్‌ గా ఫోటోలకు ఫోజ్‌లు ఇవ్వడం వల్ల ఫోటోలు కాస్త వైరల్‌ అయ్యాయి. ప్రియా ప్రకాష్ వారియర్‌ స్కిన్‌ షో చేయడం కొత్తేం కాదు. అయినా కూడా ఈ ఫోటోలు ఆమె అందంగా కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సారి ఇంకాస్త ఎక్కువ అందంగా అనిపించే విధంగా సోషల్‌ మీడియాలో ఈమె ఫోటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి. ప్రియా ప్రకాష్ వారియర్‌ ఇంత అందంగా ఉన్నా లక్‌ కలిసి రావడం లేదు.


ఈ అమ్మడికి అందాల ఆరబోత చేసే ఆసక్తి ఉన్నా సినిమాల్లో ఎక్కువగా ఆ అవకాశాలు రావడం లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ముందు ముందు అయినా ప్రియా ప్రకాష్ వారియర్‌కి ఆఫర్లు రావాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. ఇలాంటి ఫోటో షూట్స్‌ను కంటిన్యూ చేస్తే కచ్చితంగా ముందు ముందు అయినా ఈమెకు ఆఫర్లు వస్తాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం ముద్దుగుమ్మ ఒక మలయాళ సినిమాను చేస్తుంది. మరో వైపు తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. త్వరలోనే ఈ అమ్మడి సినిమా వచ్చి విజయాన్ని సొంతం చేసుకుని మరిన్ని ఆఫర్లు దక్కించుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.