ట్రెడిషనల్ అవతార్‌తో ఆకర్షిస్తున్న ప్రియా ప్రకాష్
ప్రియా సోషల్ మీడియాల్లోను భారీ ఫాలోయింగ్ సంపాదించింది. తాజాగా ఈ బ్యూటీ అందమైన ఫోటోషూట్ ని షేర్ చేసింది.
By: Tupaki Desk | 23 Jun 2025 9:01 AM ISTఒకే ఒక్క వింక్ తో వరల్డ్ ఫేమస్ అయింది ప్రియా ప్రకాష్ వారియర్. నటించిన మొదటి సినిమా 'ఒరు అదార్ లవ్' సక్సెస్ సాధించకపోయినా, ప్రియా ప్రకాష్ కెరీర్ కి ఎలాంటి ఇబ్బందీ ఎదురవ్వలేదు. ప్రస్తుతం మాలీవుడ్, కోలీవుడ్ తో పాటు ఇరుగు పొరుగు పరిశ్రమల్లోను అవకాశాలు అందుకుంటోంది.
ప్రియా సోషల్ మీడియాల్లోను భారీ ఫాలోయింగ్ సంపాదించింది. తాజాగా ఈ బ్యూటీ అందమైన ఫోటోషూట్ ని షేర్ చేసింది. ఈ ఫోటోషూట్ లో పూర్తిగా ట్రెడిషనల్ అవతార్ లో కనిపించింది. బంగారం నీలం రంగు మెరుపుల చమ్కీలతో రూపొందించిన బ్లౌజ్, కాంబినేషన్ పరికిణీలో ఎంతో అందంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ స్పెషల్ ఫోటోషూట్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది. ప్రియా నేచురల్ అందాలు యువతరాన్ని ఆకర్షించాయి.
ప్రియా తదుపరి రెండు హిందీ థ్రిల్లర్ చిత్రాలతో అభిమానుల ముందుకు వస్తోంది. సహజ ఆకర్షణ, మృధువైన వ్యక్తిత్వంతో ఆకర్షించే ప్రియా హిందీ చిత్రసీమలో నిలదొక్కుకోవాలని కలలు కంటోంది. ప్రస్తుత ప్రయత్నాలు ఏ మేరకు సఫలమవుతాయో వేచి చూడాలి.
