Begin typing your search above and press return to search.

వింక్ గాళ్ ప్రియా ప్ర‌కాష్ ఇప్పుడు ఏం చేస్తోంది?

ఒకే ఒక్క క‌న్ను గీటుతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ తెచ్చుకుంది వింక్ గాళ్ ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్.

By:  Tupaki Desk   |   6 Jun 2025 8:30 PM
వింక్ గాళ్ ప్రియా ప్ర‌కాష్ ఇప్పుడు ఏం చేస్తోంది?
X

ఒకే ఒక్క క‌న్ను గీటుతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ తెచ్చుకుంది వింక్ గాళ్ ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్. ఒరు ఆధార్ ల‌వ్ విడుద‌లై చాలా ఏళ్లు గ‌డిచినా ఇంకా అదే వింక్ యూత్ ని క‌వ్విస్తూనే ఉంది. ఒకే ఒక్క వింక్ తో ఇన్నేళ్ల పాటు ప్ర‌భావం చూప‌డం అంటే, ప్రియా ప్ర‌కాష్ ఎలాంటి మ్యాజిక్ చేసిందో అర్థం చేసుకోవ‌చ్చు. ఆ త‌ర్వాత ప్రియా ప్ర‌కాష్ వ‌రుస‌గా తెలుగు, త‌మిళ‌ సినిమాల్లో అవ‌కాశాలు అందుకుంది. నితిన్ స‌హా ప‌లువురు యువ‌హీరోలు ప్రియాకు అవ‌కాశాలిచ్చి ఎంక‌రేజ్ చేసారు. కానీ దుర‌దృష్ట‌వ‌శాత్తూ విజ‌యాలు ద‌క్క‌లేదు. ఆ త‌ర్వాత శ్రీ‌దేవి బంగ్లా పేరుతో వివాదాస్ప‌ద హిందీ చిత్రంలో న‌టించినా అది రిలీజ్ కాలేదు.

ప్రియా ప్ర‌కాష్ న‌టించిన మలయాళ చిత్రం కొల్లా (2023) రెండేళ్ల త‌ర్వాత ఇప్పుడు ఓటీటీలో సంద‌డి చేస్తుండ‌డం స‌ర్వ‌త్రా ఆస‌క్తిని క‌లిగించింది. ఈ చిత్రానికి సూరజ్ వర్మ దర్శకత్వం వహించారు. విమ‌ర్శ‌కుల నుంచి సానుకూల స్పందనలు వచ్చాయి. ఇందులో ప్రియా ప్రకాష్ వారియర్ నటనను ప్రేక్షకులు ప్రశంసించారు. కొల్లా 19 జూన్ 2025 నుండి ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కానుంది. Xలో దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న వెలువడింది. ఈ సినిమా క‌థాంశం చాలా ఆస‌క్తిక‌రం. ఇది శిల్ప అనే అమ్మాయి చుట్టూ తిరిగే క‌థ‌. ఒక‌ సహకార బ్యాంకును దోచుకోవడానికి కవర్‌గా బ్యూటీ పార్లర్ తెరవడానికి ప్లాన్ చేసాక ఏం జ‌రిగింద‌నేదే ఈ సినిమా క‌థాంశం.

ప్రియా ప్ర‌కాష్ ఓటీటీ రంగంలోను అవ‌కాశాలు అందుకుంటోంది. మ‌రోవైపు ప్రియా త‌న అభిమానుల‌కు సోష‌ల్ మీడియాల్లో నిరంత‌ర ట్రీట్‌ని అందిస్తోంది. తాజాగా ప్రియా బీచ్ వెకేష‌న్ కి సంబంధించిన ఫోటోషూట్ ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారింది. సింపుల్ గా త‌న స్నేహితుల‌తో క‌లిసి జాలీగా ఈ ట్రిప్ ని ఎంజాయ్ చేస్తోంది. చూడ‌టానికి ఎంతో సింపుల్ గా క‌నిపిస్తున్నా డిజైన‌ర్ ప్రాక్‌లో ప్రియా ప్రకాష్ ఎంతో అందంగా క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాప్స్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతున్నాయి. ఇక ప్రియాతో పాటు వెకేష‌న్ లో ఉన్న‌ది ఎవ‌రు? అంటూ అభిమానులు ఆరాలు తీస్తున్నారు.

ఇటీవ‌ల అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీలో ప్ర‌త్యేక గీతంలో న‌ర్తించిన‌ ప్రియా త‌దుప‌రి త్రి మంకీస్ అనే బాలీవుడ్ చిత్రంలో నటించింది. ఈ సినిమా త్వ‌ర‌లో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా విడుద‌ల కానుంది. అబ్బాస్ - మ‌స్తాన్ లాంటి దిగ్గ‌జాలు ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. ల‌వ్ హ్యాక‌ర్స్ అనే యూత్ ఫుల్ సినిమాలోను ప్రియా న‌టిస్తోంది.