Begin typing your search above and press return to search.

వింక్ బ్యూటీకి మంచి బూస్ట్..!

కన్నుగీటి పాన్ ఇండియా లెవెల్ లో సంచలనం సృష్టించిన బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్. మలయాళంలో ఒరు ఆధార్ లవ్ అనే ఒక చిన్న సినిమా టీజర్ లో అమ్మడు ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ తో సోషల్ మీడియా అంతా షేక్ అయ్యింది.

By:  Tupaki Desk   |   14 April 2025 10:20 AM IST
Priya Prakash Strikes Back with Ajiths Hit Song
X

కన్నుగీటి పాన్ ఇండియా లెవెల్ లో సంచలనం సృష్టించిన బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్. మలయాళంలో ఒరు ఆధార్ లవ్ అనే ఒక చిన్న సినిమా టీజర్ లో అమ్మడు ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ తో సోషల్ మీడియా అంతా షేక్ అయ్యింది. ఆ క్రేజ్ తో ఆ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేశారు. ఐతే సినిమా టీజర్ కి వచ్చిన క్రేజ్ కి తగినట్టు సినిమా లేకపోవడం వల్ల మైనస్ అయ్యింది. ఆ తర్వాత ప్రియ ప్రకాష్ కి తెలుగు నుంచి ఆఫర్స్ వచ్చాయి.

ఐతే చేస్తే స్టార్స్ తోనే చేస్తా అని అమ్మడు కాత బెట్టు చేయడంతో మన వాళ్లు లైట్ తీసుకున్నారు. తీరా కెరీర్ గ్రాఫ్ పడిపోతుంది అనుకున్న టైం లో ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ టాలీవుడ్ వైపు చూసింది. అలా నితిన్ తో చెక్ సినిమా చేయగా అది కాస్త తుస్సుమన్నది. ఇక తేజా సజ్జాతో ఒక సినిమా చేయగా అది కూడా ప్రేక్షకులను మెప్పించలేదు.

తనకు వచ్చిన సోషల్ మీడియా క్రేజ్ కి ప్రియా ప్రకాష్ కెరీర్ కి అసలు సంబంధం లేదు. అయినా సరే అమ్మడు తన ప్రయత్నాలు మాత్రం ఆపలేదు. ఏ చిన్న ఛాన్స్ వచ్చినా కూడా వదలకుండా చేస్తూ వచ్చింది ప్రియా ప్రకాష్. ఈ క్రమంలోనే లేటెస్ట్ గా అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో ఒక రీమిక్స్ సాంగ్ లో మెప్పించింది. అజిత్ సుల్తానా సాంగ్ లో సిమ్రన్ లా ప్రియా ప్రకాష్ కూడా అదరగొట్టింది.

అఫ్కోర్స్ సిమ్రాన్ రేంజ్ వేరని తెలిసినా గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా హిట్ అవ్వడంతో ప్రియా ప్రకాష్ సాంగ్ గురించి కూడా అందరు చర్చించుకుంటున్నారు. సో అలా అమ్మడు సక్సెస్ అయినట్టే అని చెప్పొచ్చు. అంతేకాదు అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ వల్ల ప్రియా ప్రకాష్ కి మంచి బూస్టింగ్ వచ్చిందని చెప్పొచ్చు. సో ఇలానే ప్రత్యేక గీతాల్లో అమ్మడు తన సత్తా చాటితే మళ్లీ తిరిగి ఫాం లోకి వచ్చే అవకాశం ఉంటుంది.

తెలుగులో ఒకటి రెండు ప్రయత్నాలు చేసినా లాభం లేకపోవడంతో సైలెంట్ అయిన ప్రియా ప్రకాష్ మలయాళంలోనే వచ్చిన అరకొర అవకాశాలతో కెరీర్ కొనసాగిస్తుంది. మరి గుడ్ బ్యాడ్ అగ్లీ హిట్ ప్రియా ప్రకాష్ కెరీర్ కి ఊపు తెచ్చేలా చేస్తుందా అన్నది చూడాలి.