Begin typing your search above and press return to search.

మేక‌తో అసౌకర్య స‌న్నివేశంలో స్టార్ హీరో?

ఈ చిత్రంలో మేక‌తో పృథ్వీరాజ్ ఇంటిమేట్ సీన్ లో న‌టించాడ‌ని, కానీ ఆ సీన్ ని సినిమా నుంచి తొల‌గించార‌ని ప్ర‌చారం సాగుతోంది. తాజా ఇంట‌ర్వ్యూలో దీనిని పృథ్వీరాజ్ ఖండించారు.

By:  Tupaki Desk   |   14 April 2024 11:30 AM GMT
మేక‌తో అసౌకర్య స‌న్నివేశంలో స్టార్ హీరో?
X

న‌టుడిగా, ద‌ర్శ‌కుడిగా ఆల్ రౌండ‌ర్ ప‌నిత‌నంతో మెప్పిస్తున్నాడు మ‌ల‌యాళీ పృథ్వీరాజ్ సుకుమార‌న్. అత‌డు ద‌శాబ్ధాలుగా సౌత్ సినీ ప‌రిశ్ర‌మ‌ల్లో సుప‌రిచితుడు. ఇటీవ‌ల అత‌డి ప్ర‌యోగాత్మ‌క ఆలోచ‌న‌లు, స‌క్సెస్ రేటు ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాయి. ప్ర‌భాస్ స‌లార్ లో అత‌డు కీల‌క పాత్ర‌ధారి. స‌లార్ 2లో ప్ర‌తినాయ‌కుడిగా క‌నిపిస్తాడు.

ఇంత‌లోనే 'ది గోట్ లైఫ్' అనే ప్ర‌యోగాత్మ‌క చిత్రంతో దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారాడు. దుబాయ్ ఎడారిలో ఒంట‌రిగా దిక్కుతోచ‌ని స్థితిలో చిక్కుకుపోయే ఒక గొర్రెల కాప‌రి జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఇటీవ‌లే విడుద‌లైన ఈ చిత్రానికి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు బాక్సాఫీస్ వ‌ద్ద క‌న‌క‌వ‌ర్షం కురుస్తోంది.

ఇదే స‌మ‌యంలో 'ది గోట్ లైఫ్' ఒక వివాదాన్ని మోసుకొచ్చింది. ఈ చిత్రంలో మేక‌తో పృథ్వీరాజ్ ఇంటిమేట్ సీన్ లో న‌టించాడ‌ని, కానీ ఆ సీన్ ని సినిమా నుంచి తొల‌గించార‌ని ప్ర‌చారం సాగుతోంది. తాజా ఇంట‌ర్వ్యూలో దీనిని పృథ్వీరాజ్ ఖండించారు. అలాంటి స‌న్నివేశంలో తాను న‌టించ‌లేద‌ని చిత్ర‌క‌థానాయ‌కుడు పృథ్వీరాజ్ సుకుమార‌న్ తెలిపాడు. అంతేకాదు.. ద‌ర్శ‌కుడు బ్లెస్సీ ఒక‌ న‌వ‌ల ఆధారంగా ఈ సినిమాని రూపొందించినా కానీ, న‌వ‌ల‌లో ఉన్న కొన్నిటిని తెలివిగా తెర‌కెక్కించ‌కుండా త‌ప్పించార‌ని తెలిపారు. ది గోట్ లైఫ్ మ‌ల‌యాళంలో పెద్ద విజ‌యం అందుకుంది. ఇరుగు పొరుగు భాష‌ల్లోను ఫ‌ర్వాలేద‌నిపించే వసూళ్ల‌ను సాధించింది.

ఈ చిత్రంలో ఒంటరిగా దిక్కుతోచని స్థితిలో ఉన్న గొర్రెల కాప‌రి నజీబ్ మేకపై ప్రేమను చూపించే సీక్వెన్స్ ఉంటుంది. ఈ సీన్ నవల వెర్షన్‌లో ఉంది.. న‌వ‌లా ర‌చ‌యిత‌ బెన్యామిన్ ఈ చిత్రానికి సంబంధించిన బహిరంగ ప్రచార కార్యక్రమంలో ఇంటిమేట్ సీన్ గురించి ప్ర‌స్థావించాడు. అయితే అసలు అలాంటి సన్నివేశం చిత్రీకరించారా? అని పృథ్వీరాజ్‌ని ప్ర‌శ్నించ‌గా ''అలాంటిది ఎప్పుడూ చిత్రీకరించలేదు సార్. నజీబ్ క్యారెక్టర్ ఆర్క్ అలా చేయదని దర్శకుడు త‌న‌కు చెప్పారు'' అని తెలిపారు.

నజీబ్ పాత్రను పోషించే క్ర‌మంలో అనుభవాల‌ గురించి పృథ్వీరాజ్ మాట్లాడుతూ, ''2008లో బ్లెస్సీ ఈ సినిమా చేయడం గురించి నాకు మొదట చెప్పినప్పుడు, నా మొదటి ఆలోచన ఏమిటంటే, నేను ఈ పాత్రను ఎలా చేయాలి? ఎలా సంప్రదించాలి? నేను దిగి వచ్చి.. దాని గురించి మీతో (ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌ల‌తో) మాట్లాడతానా లేదా? మిస్టర్ బెన్యామిన్ రాసిన నజీబ్ పాత్రను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించానా లేదా మిస్టర్ బ్లెస్సీ మనస్సులో ఉన్న నజీబ్‌ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించానా లేదా?'' ఇలాంటివ‌న్నీ ఆలోచించాను. ఇది నాలోని గందరగోళం. చివరగా మిస్టర్ బ్లెస్సీ- నేనూ, ఆడుజీవితం నవల నుండి స్ఫూర్తి పొంది సినిమా తీశాం. ఇందులో న‌జీబ్ గా భేష‌జం లేకుండా న‌టించాను.. అని తెలిపారు.

ది గోట్ లైఫ్ సౌండ్ డిజైనర్ అయిన రసూల్ పూకుట్టి మాట్లాడుతూ... ''పుస్తకం/న‌వ‌ల‌లో నజీబ్ మేకను ప్రేమించే సన్నివేశం ఉంది. ఈ క్రేజీ జనాలంతా సినిమాలో ఆ సీన్ ని చూడాలని ఎదురుచూశారు. కానీ దర్శకుడు బ్లెస్సీ తెర‌పై ఆ అసౌకర్య స‌న్నివేశాన్ని తప్పించాడు… కాబట్టి ఇదంతా లూజ్ టాక్ మాత్రమే. జ‌నం ఫాంట‌సీలో ఉన్నారు'' అని తెలిపారు.