Begin typing your search above and press return to search.

సలార్ లో ఆయన పాత్ర నెక్స్ట్ లెవెల్ అంట..!

కె.జి.ఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ నుంచి సినిమా వస్తుంది అంటే పాన్ ఇండియా ఆడియన్స్ కూడా ఈగర్ గా ఎదురుచూసే పరిస్థితి ఏర్పడింది

By:  Tupaki Desk   |   21 Aug 2023 10:56 AM GMT
సలార్ లో ఆయన పాత్ర నెక్స్ట్ లెవెల్ అంట..!
X

కె.జి.ఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ నుంచి సినిమా వస్తుంది అంటే పాన్ ఇండియా ఆడియన్స్ కూడా ఈగర్ గా ఎదురుచూసే పరిస్థితి ఏర్పడింది. కె.జి.ఎఫ్ 1, 2 రెండు సినిమాలతో డైరెక్టర్ గా తన రేంజ్ ఏంటన్నది చూపించాడు ప్రశాంత్ నీల్ రెండు సినిమాలు ఒక దానికి మించి మరో బ్లాక్ బస్టర్ అవడంతో ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమాల మీద పాన్ ఇండియా ఆడియన్స్ దృష్టి పడింది. ఈ క్రమంలో బాహుబలి ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రశాంత్ నీల్ మేకింగ్ ప్రభాస్ మాస్ స్టామినా ఆటోమేటిక్ గా సలార్ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడేలా చేశాయి.

సలార్ సినిమాని కూడా రెండు భాగాలుగా రిలీజ్ చేస్తారని తెలిసిందే. సలార్ పార్ట్ 1 సెప్టెంబర్ 28న రిలీజ్ అవుతుంది. సలార్ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో మిగతా పాత్రలు కూడా క్రేజీ స్టార్స్ నటిస్తున్నారు. కె.జి.ఎఫ్ 2లో బాలీవుడ్ యాక్షన్ స్టార్ సంజయ్ దత్ ని రంగంలోకి దింపిన ప్రశాంత్ నీల్ సలార్ కోసం మలయాళ స్టార్ పృధ్విరాజ్ సుకుమారన్ ని సెలెక్ట్ చేశాడు. ఈ సినిమాలో పృధ్విరాజ్ క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని తెలుస్తుంది.

అయితే ఆయనతో పాటుగా సినిమాలో మన జగ్గు భాయ్ కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నాడని తెలిసిందే. సలార్ సినిమాలో జగపతి బాబు రాజమనార్ పాత్రలో నటిస్తున్నారు. సినిమా నుంచి వచ్చిన ఆయన ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలు పెంచింది. సలార్ లో పృధ్వి రాజ్ ఒక్కడే కాదు జగపతి బాబు విలనిజం కూడా ఓ రేంజ్ లో ఉండబోతుందని అంటున్నారు. ఒకప్పుడు హీరోగా ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించిన జగపతి బాబు లెజెండ్ సినిమా నుంచి విలన్ గా తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు.

అయితే విలన్ గా కూడా కొన్నాళ్లు ఫాం కొనసాగించిన జగపతి ఈమధ్య కెరీర్ లో మళ్లీ వెనక్కి తగ్గాడు. అయితే ప్రశాంత్ నీల్ సలార్ తో ప్రభాస్ ని ఢీ కొడుతున్న జగపతి బాబు మళ్లీ ఈ సినిమాతో తిరిగి ఫాం లోకి వస్తారని అంటున్నారు. అసలే ప్రశాంత్ నీల్ సినిమాలో ఎలివేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రభాస్ మాత్రమే కాదు సినిమాలో విలన్లకు కూడా ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్ ఉంటుంది. సో అలా చూస్తే ప్రభాస్ సలార్ లో జగపతి బాబు రోల్ కూడా అంచనాలకు మించి ఉంటుందని చెప్పొచ్చు.