Begin typing your search above and press return to search.

సలార్‌ నటుడి రికార్డ్‌ లిప్ లాక్...!

మలయాళ స్టార్‌ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌ గత ఏడాది సలార్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   21 March 2024 8:03 AM GMT
సలార్‌ నటుడి రికార్డ్‌ లిప్ లాక్...!
X

మలయాళ స్టార్‌ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌ గత ఏడాది సలార్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ప్రభాస్ తో కలిసి పృథ్వీరాజ్ చేసిన సన్నివేశాలకు మంచి స్పందన వచ్చింది. సలార్ 2 లో తన పాత్ర మరింత ఎక్కువగా ఉంటుందని, యాక్షన్ సన్నివేశాలు బాగుంటాయి అంటూ ఇటీవల పృథ్వీరాజ్ చెప్పుకొచ్చాడు.

ఈ సలార్ నటుడు మార్చి 28వ తారీకున 'ది గోట్ లైఫ్‌' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మలయాళ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బ్లెస్సీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.

తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. సెన్సార్‌ బోర్డు వారు ఈ సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్‌ ఇవ్వడం జరిగిందట. 2 గంటల 41 నిమిషాల నిడివితో ఈ సినిమా విడుదల అవ్వబోతుంది. అమలాపాల్‌ హీరోయిన్ గా ఈ సినిమాలో పృథ్వీరాజ్ కి జోడీగా కనిపించబోతుంది. వీరిద్దరి కాంబోలో లిప్‌ లాక్ సన్నివేశం ఉంటుందని, అది ఏకంగా అయిదు నిమిషాల నిడివితో ఉంటుందని టాక్ వినిపిస్తుంది.

ఈ మధ్య కాలంలో సౌత్ ఇండియన్ సినిమాల్లో ఎప్పుడూ చూడనంత నిడివితో ఈ లిప్ లాక్‌ ఉంటుందని ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ లిప్ లాక్ తో పృథ్వీరాజ్ సుకుమారన్‌ రికార్డ్‌ సృష్టించబోతున్నాడు అంటూ కూడా మలయాళ సినీ జనాల్లో చర్చ జరుగుతోంది.

ది గోట్ లైఫ్ సినిమా కోసం పృథ్వీరాజ్ సుకుమారన్‌ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. ఎడారిలో దారి తప్పిన వ్యక్తిగా, తిండి తిప్పలు లేని వ్యక్తిగా ఈ సినిమాలో పృథ్వీరాజ్ కనిపించబోతున్నాడు. అందుకోసం నేచురల్‌ లుక్ తో కనిపించాలని మూడు రోజులు తిండి లేకుండా ఉండి షూట్‌ లో పాల్గొనేవాడు. ఈ పాత్ర కోసం 31 కేజీల బరువు తగ్గినట్లుగా పృథ్వీరాజ్ చెప్పుకొచ్చాడు.

ఇక ఈ సినిమా ప్రమోషన్ కోసం పృథ్వీరాజ్ సుకుమారన్‌ హైదరాబాద్‌ కి రాబోతున్నట్లుగా సోషల్ మీడియాలో ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉండటం వల్లే ప్రమోషన్ ను భారీ ఎత్తున చేస్తున్నట్లు పేర్కొన్నాడు.